పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

బ్రెజిల్ లో బిఎమ్-ఎస్ఇఎఎల్-11 ప్రాజెక్టు నుఅభివృద్ధి పరచడం కోసం భారత్ పెట్రోలియమ్ కార్పరేశన్ లిమిటెడ్ కు చెందిన ఒక పూర్తిస్థాయి యాజమాన్యం కలిగిన అనుబంధ సంస్థ ‘‘భారత్ పెట్రోల్రిసోర్సెస్ లిమిటెడ్’ ద్వారా అదనపుపెట్టుబడి కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 27 JUL 2022 5:19PM by PIB Hyderabad

బ్రెజిల్ లో బిఎమ్-ఎస్ఇఎఎల్-11 కన్ సెశన్ ప్రాజెక్టు ను అభివృద్ధి పరచడం కోసం భారత్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ (బిపిసిఎల్)కు చెందిన పూర్తి యాజమాన్యం లోని అనుబంధ సంస్థ అయిన ‘భారత్ పెట్రోల్ రిసోర్సెస్ లిమిటెడ్’ ( బిపిఆర్ఎల్) ద్వారా 1,600 మిలియన్ యుఎస్ డార్ మేరకు (ఇది సుమారు 12,000 కోట్ల రూపాయల కు సమానం) అదనపు పెట్టుబడి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలిపింది.

 

సిసిఇఎ ఈ కింద పేర్కొన్న అంశాల ను కూడా ఆమోదించింది:

 

i. బిపిఆర్ఎల్ లో బిపిసిఎల్ ద్వారా పెట్టే ఎక్విటీ రూప పెట్టుబడి పరిమితి ని పెంచడం తో పాటు, కంపెనీ యొక్క అధీకృత వాటా మూలధనాన్ని 15,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయల కు పెంచడం (బిపిసిఎల్ కాలానుగుణం గా ఈ నిధుల ను సమకూర్చవలసి ఉంటుంది).

 

ii. ఇంటర్ నేశనల్ బివి బ్రెజిల్ పెట్రోలియో లిమిటడా లో బిపిఆర్ఎల్ ఇంటర్ నేశనల్ బివి లో పెట్టే ఎక్విటీ పెట్టుబడి యొక్క పరిమితిని పెంచడానికి తగిన అనుమతిని ఇవ్వడం. ఇందుకోసం డబ్ల్యుఒఎస్ ద్వారా ప్రస్తుత పరిమితి అయిన 5,000 కోట్ల రూపాయల ను 15,000 కోట్ల రూపాయల కు చేర్చడం జరుగుతుంది. అంటే దీనిలో 10,000 కోట్ల రూపాయల మేరకు పెరుగుదల చోటు చేసుకొంటుందన్న మాట.

 

బిఎమ్-ఎస్ఇఎఎల్-11 ప్రాజెక్టు లో ఉత్పత్తి 2026-27 నుంచి మొదలవుతుంది అని అంచనా వేయడమైంది.

 

ఇది ఈ కింద ప్రస్తావించిన అంశాల లో సహాయకారి కాగలదు:

a. భారతదేశం యొక్క శక్తి సంబంధి భద్రత ను పటిష్ట పరచడం కోసం అవసరమయ్యే ఆయిల్ ను అందుబాటు లోకి తీసుకు రావడం.

 

b. భారతదేశం యొక్క ముడి చమురు సరఫరా వనరుల లో వివిధీకరణ కు తావు ఇవ్వడం; అంతేకాకుండా బ్రెజిల్ నుంచి క్రూడ్ ఆయిల్ ను మరింత గా సమకూర్చుకోవడం లో భారతదేశాని కి చెందిన చమురు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.

 

c. బ్రెజిల్ లో భారతదేశం యొక్క పాద ముద్ర ను బలపరచుకోవడం, దీనితో చుట్టుపక్కల ఉన్న లాటిన్ అమెరికన్ దేశాల లో సరికొత్త వ్యాపార మార్గాలు అందివస్తాయి.

 

d. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత గా బలోపేతం అవుతాయి.

 

బిపిఆర్ఎల్ ఈ కన్ సెశన్ లో 40 శాతం పార్టిసిపేటింగ్ ఇంటరెస్ట్ (పిఐ) ని కలిగి ఉంది. అయితే, బ్రెజిల్ కు చెందిన జాతీయ చమురు కంపెనీ అయినటువంటి పెట్రోబ్రాస్ కు కూడా దీనిలో భాగం ఉంది.

 

బ్రెజిల్ లో 2008వ సంవత్సరం నాటి నుంచి ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అన్వేషణ మరియు అభివృద్ధిల లో బిపిఆర్ఎల్ కు ప్రమేయం ఉంది.

 

***



(Release ID: 1845622) Visitor Counter : 107