గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణ రహదారుల అభివృద్ధి

Posted On: 27 JUL 2022 4:09PM by PIB Hyderabad

గ్రామీణ ప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేసి గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY-I) 2000వ సంవత్సరంలో ప్రారంభించబడింది. 2001 జనాభా లెక్కల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ రవాణా సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా రహదారులను నిర్మించేందుకు ఒకసారి అమలు జరిగే ప్రత్యేక కార్యక్రమంగా  ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రారంభించబడింది. .

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎంపిక చేసిన 50,000 కిలోమీటర్ల పొడవైన రోడ్లు,  మేజర్ గ్రామీణ రోడ్ల స్థాయిని మెరుగుపరచడానికి 2013 సంవత్సరంలో ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన  -II ప్రారంభించబడింది.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో రహదారి సౌకర్యాన్ని అభివృద్ధి చేసేందుకు  ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన తో సమాంతరంగా  రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్సట్రీమిజం ఎఫక్టెడ్ ఏరియా పథకం   
2016 లో ప్రారంభమైంది. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న 44 జిల్లాలు మరియు వాటి చుట్టుపక్కల ఉన్న 9 రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల్లో రహదారి సౌకర్యాన్ని  మెరుగుపరచడానికి ప్రారంభించబడింది. 

2019 సంవత్సరంలో, గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు (గ్రామ్‌లు), హయ్యర్ సెకండరీ పాఠశాలలు మరియు ఆసుపత్రులకు నివాసాలను కలుపుతూ నిర్మించిన రహదారులను పటిష్టం చేయడానికి ప్రభుత్వం 2019 లో  ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన-III ని  ప్రారంభించింది.ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన-III లో  1,25,000కిలోమీటర్ల రహాదారులు, గ్రామీణ రహదారులు పటిష్టం చేయబడతాయి. 

ప్రారంభం అయిన నాటి నుంచి  21.07.2022 వరకు  ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద వివిధ కార్యక్రమాల ద్వారా  7,93,568 కిలోమీటర్ల రహదారులలో మొత్తం 1,84,056 రోడ్లు, మరియు 10,082 వంతెనలు  మంజూరు చేయబడ్డాయి, వీటిలో మంజూరు చేసిన 7,12,638 రోడ్లలో  1,70,857 కిలోమీటర్ల  రోడ్డు నిర్మాణం, 7,264 వంతెనల నిర్మాణం  పూర్తయింది.

ప్రస్తుతం, 8 ఈశాన్య రాష్ట్రాలు మరియు 2 హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్) మినహా అన్ని రాష్ట్రాలకు  ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన   నిధుల భాగస్వామ్య విధానం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య 60:40 గా ఉంది. ఈ రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నిధుల నిష్పత్తి  90:10 గా ఉంది.  ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన ని అమలు చేస్తున్న ఇతర కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

***

 



(Release ID: 1845500) Visitor Counter : 177


Read this release in: English , Urdu , Marathi