ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ కుటుంబ నియంత్రణ శిఖరాగ్ర సదస్సు - 2022 లో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్


"భారతదేశం కుటుంబ నియంత్రణ ఆవశ్యకత ను అర్థం చేసుకుని 1952లోనే జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది"

" 31 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల 2.1 లేదా అంతకంటే తక్కువ మొత్తం సంతానోత్పత్తి రేటు తో భారతదేశం భర్తీ స్థాయి సంతానోత్పత్తిని సాధించింది,"

"2012 - 2020 మధ్య, అదనంగా 1.5 కోట్లకు పైగా ఆధునిక గర్భనిరోధక సాధనాల వినియోగదారుల చేరిక తో భారత్ లో గణనీయంగా పెరిగిన ఆధునిక గర్భనిరోధక సాధనాల వినియోగం

2016 నుంచి మిషన్ పరివార్ వికాస్ కింద నూతన దంపతులకు 17 లక్షలకు పైగా నయీ పెహెల్ కిట్ల పంపిణీ ; 7 లక్షలకు పైగా సాస్ బహు సమ్మేళనాల నిర్వహణ; 32 లక్షల మంది క్లయింట్లకు సార్దీ వ్యాన్ ల ద్వారా కౌన్సిలింగ్ : డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్

Posted On: 27 JUL 2022 1:47PM by PIB Hyderabad

కుటుంబ నియంత్రణ అవసరాన్ని, ప్రాముఖ్యతను భారతదేశం ముందుగానే అర్థం చేసుకుందని, 1952లో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి దేశంగా అవతరించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ అన్నారు. బుధవారం ఢిల్లీ లో  జాతీయ కుటుంబ నియంత్రణ శిఖరాగ్ర  సదస్సు 2022 కు ఆమె అధ్యక్షత వహించారు. గౌరవ ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా "సుస్థిర ప్రయత్నాలు, సారథ్య భాగస్వామ్యాలు, బ్ కా సాథ్ , బ్ కా విశ్వాస్ , బ్ కా ప్రయాస్ బ్ కా వికాస్ తో కుటుంబ నియంత్రణ లక్ష్య రూపకల్పన ‘‘ఇతివృత్తం తో సదస్సు ను నిర్వహించారు.

 

సందర్భంగా డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ, " 31 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం సంతానోత్పత్తి రేటును 2.1 లేదా అంతకంటే తక్కువ నమోదు చేయడంతో భారతదేశం భర్తీ స్థాయి సంతానోత్పత్తిని సాధించిందని , ఆధునిక గర్భనిరోధకాల వాడకం గణనీయంగా 56.5% (ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -5) కు పెరిగిందని చెప్పారు. ‘‘ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -5 డేటా స్పేసింగ్ పద్ధతుల వైపు మొత్తం సానుకూల మార్పును సూచిస్తుందని, ఇది మాతా మరియు శిశు మరణాలను , అనారోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది" అని ఆమె పేర్కొన్నారు.

 

మిషన్ పరివార్ వికాస్ (ఎమ్ పి వి) -2016 జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. పథకం కింద, నయీ పెహెల్ కిట్ల పంపిణీ, సాస్ బహు సమ్మేళన్ సార్థీ వ్యాన్లు వంటి సృజనాత్మక వ్యూహాలు ప్రజా సమూహాలను చేరుకోవడానికికుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన జననాలు, చిన్న కుటుంబాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి దోహద పడుతున్నాయి. ‘‘కొత్తగా పెళ్లయిన వారికి 17 లక్షలకు పైగా నయీ పెహెల్ కిట్లను పంపిణీ చేశామని, 7 లక్షలకు పైగా సాస్ బహు సమ్మేళనాలు నిర్వహించామని, 32 లక్షల మందికి సార్ధీ  వ్యాన్ల ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చామని, ప్రయత్నాల కారణంగానే NFHS-5 డేటా అన్ని ఎం పి వి రాష్ట్రాలలో ఆధునిక గర్భనిరోధక వినియోగంలో గణనీయమైన పెరుగుదలను , తీరని అవసరాలను తగ్గించడాన్ని చూపుతుంది" అని ఆమె తెలిపారు.

 

భారతదేశం ఎఫ్ పి 2020లో ముఖ్యమైన సభ్యదేశమని, ఇప్పుడు ఎఫ్ పి 2030 భాగస్వామ్యానికి మారిందని మంత్రి అన్నారు. భాగస్వామ్యానికి భారతదేశ నిబద్ధత లో భాగంగా కుటుంబ నియంత్రణ కోసం మూడు బిలియన్ డాలర్ల ను పెట్టుబడి పెట్టడం

జరిగిందని ఆమె తెలిపారు."2012 - 2020 మధ్య, భారతదేశం లో ఆధునిక గర్భనిరోధకాల వాడకందారులు  అదనంగా 1.5 కోట్ల మంది కి పైగా చేరారుతద్వారా ఆధునిక గర్భనిరోధక సాధనాల వినియోగం  గణనీయంగా పెరిగింది" అని ఆమె పేర్కొన్నారు.

 

సందర్భంగా, మంత్రి భారతదేశ కుటుంబ నియంత్రణ 2030 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. మెడికల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా (ఎం సి),  వీల్ అప్లికేషన్, -మాడ్యూల్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్ పి ఎల్ ఎం ఎస్) , డిజిటల్ ఇంటర్వెన్షన్ విభాగంలో కుటుంబ నియంత్రణపై డిజిటల్ ఆర్కైవ్లను కూడా ప్రారంభించారు. కమ్యూనిటీని శక్తివంతం చేయడానికి , సమగ్ర సేవలను అందించడంలో ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతను చూపడానికి, డాక్టర్ పవార్ నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ హెల్ప్లైన్ మాన్యువల్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సి హెచ్ ) బుక్లెట్ , ఎస్ హెచ్ బ్రోచర్ , కరపత్రాన్ని (కుటుంబ ప్రణాళిక) కూడా ప్రవేశ పెట్టారు.

 

"అట్టడుగు స్థాయిలో సేవలందించిన ఆరోగ్య కార్యకర్తలను అభినందిస్తూ, కుటుంబ నియంత్రణ కార్యక్రమం విజయానికి అచంచలమైన ప్రయత్నాలతో వారు కీలకమైన ఛాంపియన్లు గా నిలిచారని " డాక్టర్ పవార్ ప్రశంసించారు. మేల్ పార్టిసిపేషన్, స్పేసింగ్ మెథడ్స్, సెల్ఫ్ కేర్ మెథడ్స్, పిపిఐయుసిడి, ఇంజెక్టబుల్ ఎమ్ పి కేటగిరీల కింద ఆమె రాష్ట్రాలను సత్కరించారు. డాక్టర్లకు (మగ మరియు ఆడ స్టెరిలైజేషన్ కేటగిరీల కింద), నర్సులు (పిపిఐయుసిడి ఇంజెక్టబుల్ ఎమ్ పిఎ కేటగిరీల కింద), ఫ్యామిలీ ప్లానింగ్ లో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ లు ,వ్యాసెక్టమీ క్లయింట్ లను ప్రోత్సహించినందుకు  ఆశా వర్కర్ లకు సర్వీస్ ప్రొవైడర్ అవార్డులు కూడా అందించారు.

 

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ, భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఇప్పుడు ఏడు దశాబ్దాలకు పైగా పురాతనమైందని, కాలంలో, జనాభా నియంత్రణ భావన నుండి జనాభా స్థిరీకరణకు , నిరంతర సంరక్షణ సామరస్యాన్ని నిర్ధారించే దిశగా భారతదేశం ఒక మార్పును చూసిందని అన్నారు.

సందర్భంగా ఆయన మూడు ఇతివృత్త రంగాలను ప్రస్తావించారు. మొదటిది, భారతదేశం రీప్లేస్ మెంట్ లెవల్ ఫెర్టిలిటీని సాధించినప్పటికీ, పునరుత్పత్తి వయస్సు గ్రూపులో ఇప్పటికీ గణనీయమైన జనాభా ఉంది, వారు ప్రభుత్వ జోక్య ప్రయత్నాలకు కేంద్రంగా ఉండాలి. రెండవది, భారతదేశం దృష్టి సాంప్రదాయకంగా సరఫరా వైపు, అంటే ప్రొవైడర్లు , డెలివరీ వ్యవస్థలపై ఉంది. కుటుంబం, కమ్యూనిటీ , సమాజంతో సహా డిమాండ్ వైపు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. " దృష్టితో గణనీయమైన మార్పు సాధ్యమవుతుంది, పెరుగుదల మార్పుకు బదులుగా", అని ఆయన పేర్కొన్నారు. మిషన్ పరివార్ వికాస్ కింద కమ్యూనిటీ ఆధారిత పథకం నిబంధనల నుండి ప్రయోజనం పొందడానికి ,దానిని మరింత శుద్ధి చేయడానికి రాష్ట్రాలు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. చివరగా, నాలెడ్జ్, స్కిల్స్ , సృజనాత్మక సేవల ద్వారా ఎఫ్ పి 2030 కింద మన నిబద్ధతను అందించడానికి మన సామర్థ్యాన్ని పెంపొందించడంలో కుటుంబ నియంత్రణ సర్వీస్ ప్రొవైడర్ పూల్ గణనీయమైన పాత్రను పోషించాలి. "సమర్థవంతమైన ,సరైన శిక్షణ పొందిన శ్రామిక శక్తి మన కుటుంబ నియంత్రణ ప్రయత్నానికి పునాదిగా ఉండాలి. ఇది మన మా సేవల నాణ్యతను పెంచుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

 

ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి , మిషన్ డైరెక్టర్ (ఎన్ హెచ్ ఎమ్) శ్రీమతి రోలి సింగ్, ఎఫ్ పి అండ్ ఎంహెచ్ సలహాదారు డాక్టర్ ఎస్ కె సిక్దార్, , వివిధ అభివృద్ధి భాగస్వాముల ప్రతినిధులు సదస్సు కు హాజరయ్యారు.

 

 

****



(Release ID: 1845446) Visitor Counter : 179