విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా  "ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య - విద్యుత్@2047"



ఇందులో విద్యుత్ , పునరుత్పాదక ఇంధన రంగాలలో సాధించిన విజయాలతో పాటు విజన్ ఆఫ్ ఇండియా 2047 ను ప్రదర్శిస్తారు

Posted On: 27 JUL 2022 3:01PM by PIB Hyderabad

 

విద్యుత్, నూతన,  పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" లో భాగంగా "ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య - విద్యుత్ @2047" కార్యక్రమాన్ని 2022 జూలై 25 నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పవర్ సి.పి.ఎస్.ఈ లు, రాష్ట్ర డిస్కామ్‌లతో అనుబంధంతో జరుపుకుంటుంది.

 

ఈ కార్యక్రమం జాతీయ, రాష్ట్ర దృక్కోణాల నుండి ప్రజలకు విద్యుత్,  పునరుత్పాదక ఇంధన రంగాలలో సాధించిన విజయాలను ప్రదర్శిస్తుంది మరియు 2047లో భారతదేశం స్వాతంత్ర్యం పొంది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రంగాలలో భారతదేశం యొక్క దృక్పథాన్ని కూడా ప్రదర్శిస్తుంది. దక్షిణ ఢిల్లీ జిల్లాలో, ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం 28 మరియు 29 జూలై 2022న నిర్వహిస్తోంది. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (POSOCO) లిమిటెడ్ దక్షిణ ఢిల్లీలో జరిగే కార్యక్రమాలకు సమన్వయ సి.పి.ఎస్.ఈ గా సమన్వయం చేస్తోంది.

 

న్యూఢిల్లీలోని మెహ్రౌలీలోని సర్వోదయ కో-ఎడ్ సీనియర్ సెకండరీ స్కూల్ లో జూలై 28న జరిగే కార్యక్రమానికి గౌరవ పార్లమెంటు సభ్యుడు శ్రీ రమేష్ బిధురి ముఖ్య అతిథిగా హాజరవుతారు. జూలై 29న, న్యూ ఢిల్లీ లోని పుష్ప్ విహార్ లోని గవర్నమెంట్ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్ లో జరిగే కార్యక్రమానికి దక్షిణ ఢిల్లీ డి.ఎం. మోనికా ప్రియదర్శిని ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

 

****



(Release ID: 1845353) Visitor Counter : 159