వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఆట వస్తువుల భద్రతా అంశాలపై భౌతిక భద్రత, రసాయనాల వ్యతిరేకంగా భద్రత, అగ్ని సంబంధిత, విద్యుత్ భద్రతకు సంబంధించిన 10 భారతీయ ప్రమాణాలను ప్రచురించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్.
వీటిలో ఏడు ప్రమాణాలు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO)లో భాగంగా ' భద్రత'పై 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆట వస్తువుల పై ISI మార్క్ ని కలిగి ఉండాలన్న నిబంధన పరిధిలో.
ISI మార్క్ లేని బొమ్మలను తయారు చేయడానికి, దిగుమతి చేయడానికి, విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి, నిల్వ చేయడానికి, అద్దెకు, లీజుకు లేదా అమ్మకానికి ప్రదర్శించడానికి ఏ వ్యక్తి కీ అనుమతి లేదు- BIS నుంచి లైసెన్స్ కింద.
Posted On:
21 JUL 2022 6:16PM by PIB Hyderabad
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, భారత జాతీయ ప్రమాణాల సంస్థ, భౌతిక భద్రత, రసాయనాలకు వ్యతిరేకంగా భద్రత, అగ్ని ప్రమాద భద్రత, విద్యుత్ భద్రత మొదలైన వాటికి సంబంధించిన బొమ్మల భద్రతా అంశాలపై 10 భారతీయ ప్రమాణాలను ప్రచురించింది. ఈ ప్రమాణాలు బొమ్మల తయారీలో సురక్షితం కాని విష పదార్థాల వాడకాన్ని నిరోధించాయి.
ఈ 10 ప్రమాణాలలో, 7 'ఆటవస్తువులు భద్రత'పై క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO)లో భాగం. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం బొమ్మలు బొమ్మల భద్రత కోసం 7 భారతీయ ప్రమాణాలకు (జాబితా జోడించారు), BIS నుంచి లైసెన్స్ తో పాటు స్టాండర్డ్ మార్క్ (ISI మార్క్) కలిగి ఉండటం తప్పనిసరి. ఈ ప్రభుత్వ మార్గదర్శకాలు 1 జనవరి 2021 నుంచి అమల్లోకి వచ్చాయి.
భారతీయ ప్రమాణాల ప్రకారం BIS ల్యాబ్ లేదా BIS గుర్తింపు పొందిన ప్రయోగశాలలో బొమ్మలను పరీక్షించడంతోపాటు ఫ్యాక్టరీ సందర్శన ద్వారా వాటి తయారీ, పరీక్ష సామర్థ్యాన్ని అంచనా వేయడం ఆధారంగా బొమ్మల తయారీ యూనిట్లకు BIS లైసెన్స్ లను మంజూరు చేస్తుంది. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేని, BIS స్టాండర్డ్ మార్క్ అంటే "ISI మార్క్"ని కలిగి లేని బొమ్మలను తయారు చేయడానికి, దిగుమతి చేయడానికి, విక్రయించడానికి లేదా పంపిణీ చేయడానికి, నిల్వ చేయడానికి, అద్దెకు ఇవ్వడానికి లేదా అమ్మకానికి ప్రదర్శించడానికి ఎవరికీ అనుమతి లేదు.
లైసెన్స్ మంజూరు చేయడానికి ముందు, బొమ్మలు పిల్లలకు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి వివిధ భౌతిక, రసాయన, విద్యుత్ భద్రతా అవసరాల కోసం కఠినమైన పరీక్షలకు లోనవుతాయి. ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం, పదునైన కోణాలు (షార్ప్ పాయింట్ పరీక్షలు ), పదునైన అంచులు (షార్ప్ ఎడ్జ్ పరీక్షలు) తనిఖీ చేయడం కోసం పరీక్షలు చేస్తారు, అంచులు, కోణాలు చర్మాన్ని గాయపరచి పిల్లలకి హాని చేస్తాయి. బొమ్మల్లో యాంటీమోనీ, ఆర్సెనిక్, బేరియం, కాడ్మియం, క్రోమియం, సీసం, పాదరసం, సెలీనియం వంటి కొన్ని విషపూరిత మూలకాల సాంద్రతను నిర్ధారించడానికి, అవి సురక్షితమైన పరిమితుల్లో ఉన్నాయని నిర్ధారించడానికి రసాయన పరీక్షలు చేస్తారు, పవర్ ఇన్పుట్, ఎలెక్ట్రిక్ బలం, తేమ నిరోధకత, తాపన, అసాధారణ ఆపరేషన్ కోసం పరీక్షలు నిర్వహించడం ద్వారా బొమ్మల ఎలక్ట్రికల్ అంశాలకు సంబంధించి భద్రత నిర్ధారిస్తారు. మెకానికల్ బలం, నిర్మాణం, స్క్రూలు, కనెక్షన్లు, త్రాడులు, వైర్ల రక్షణ, క్లియరెన్స్ లు, క్రీపేజ్ దూరాలు, భాగాలు, వేడి, ఇంకా అగ్ని నిరోధకత మొదలైన పరీక్షలు.
BIS లైసెన్స్ మంజూరు చేయబడిన తర్వాత కూడా, బొమ్మల తయారీ యూనిట్లు తాము ఉత్పత్తి చేసే బొమ్మలు క్రమం తప్పకుండా పరీక్షలకు లోనౌతున్నాయని, నిర్ణీత స్కీమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్, టెస్టింగ్ను అనుసరించేలా చూసుకోవాలి. దాని మార్కెట్, ఫ్యాక్టరీ నిఘా కార్యకలాపాలలో భాగంగా, BIS లైసెన్స్ పొందిన తయారీ యూనిట్లలో నిఘా సందర్శనలను నిర్వహిస్తుంది, ఫ్యాక్టరీలు, మార్కెట్ నుండి బొమ్మల నమూనాలను కూడా తీసుకుంటుంది, వాటిని BIS ల్యాబ్లు, BIS గుర్తింపు పొందిన ల్యాబ్లలో పరీక్షిస్తుంది. 800 కంటే ఎక్కువ టాయ్ తయారీదారులు, ఎక్కువగా MSME సెక్టార్ నుండి, ఇప్పటికే BIS సర్టిఫికేషన్ తీసుకున్నారు.
వినియోగదారులు మార్కెట్ నుండి "ISI మార్క్" ఉన్న సురక్షితమైన బొమ్మలను మాత్రమే కొనుగోలు చేశామని నిర్ధారించుకోవాలి. అలాగే, "ISI మార్క్" లేకుండా ఏదైనా బొమ్మ అమ్ముతున్నట్లు కనిపిస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయాలి. BIS కేర్ యాప్ (గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి)లో ఫిర్యాదులను ఫైల్ చేయవచ్చు లేదా complaint@bis.gov.inకి మెయిల్ చేయవచ్చు.
భౌతిక భద్రత, రసాయనాలకు వ్యతిరేకంగా భద్రత, మంట, విద్యుత్ భద్రత మొదలైన వాటికి సంబంధించిన భద్రతా అంశాలపై BIS ప్రచురించిన 10 ప్రమాణాలలో, ‘బొమ్మల భద్రత’పై నాణ్యత నియంత్రణ ఆర్డర్లో భాగమైన 7 ప్రమాణాలు క్రింద వివరించారు:
1. IS 9873 (పార్ట్ 1):2019/ ISO 8124-1 : 2018 బొమ్మల కోసం భద్రతా అవసరాలు: పార్ట్ 1 యాంత్రిక, భౌతిక లక్షణాలకు సంబంధించిన భద్రతా అంశాలు
2. IS 9873 (పార్ట్ 2) : 2017/ ISO 8124-2 : 2014 బొమ్మల కోసం భద్రతా అవసరాలు: పార్ట్ 2 మండే అవసరాలు
3. IS 9873 (పార్ట్ 3) : 2020/ ISO 8124-3 : 2020 బొమ్మల కోసం భద్రతా అవసరాలు: పార్ట్ 3 – కొన్ని మూలకాల తొలగింపు
4. IS 9873 (పార్ట్ 4) : 2017/ ISO 8124-4 : 2014 ఆటవస్తువులల భద్రత పార్ట్ 4 స్వింగ్లు, స్లయిడ్లు, ఇండోర్, అవుట్డోర్ ఫ్యామిలీ డొమెస్టిక్ వినియోగానికి సారూప్య కార్యాచరణ బొమ్మలు
5. IS 9873 (పార్ట్ 7) : 2017/ ISO 8124-7 : 2015 బొమ్మల భద్రత పార్ట్ 7 అవసరాలు, ఫింగర్ పెయింట్ల కోసం పరీక్షా పద్ధతులు
6. IS 9873 (పార్ట్ 9) : 2017 సేఫ్టీ ఆఫ్ టాయ్స్ పార్ట్ 9 టాయ్స్, చిల్డ్రన్ ప్రొడక్ట్స్ లో పేథలేట్స్ ఎస్టర్స్
7. IS 15644:2006/ IEC 62115: 2003 ఎలక్ట్రిక్ బొమ్మల భద్రత
****
(Release ID: 1843990)
Visitor Counter : 219