వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2021లో భారతదేశం R&D రంగంలో USD 343.64 మిలియన్ల FDI ఈక్విటీ ప్రవాహాన్ని ఆకర్షిస్తుంది. ఇది 2020తో పోలిస్తే 516% ఎక్కువ


R&Dలో ఎఫ్‌డిఐ ఈక్విటీ గ్రహీతలలో కర్నాటక మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ మరియు హర్యానా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి


R&Dలో మొత్తం FDI ఈక్విటీలో 40% వాటాతో సింగపూర్ R&Dలో అగ్రగామిగా ఉన్న దేశం. జర్మనీ మరియు U.S.A తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Posted On: 19 JUL 2022 6:09PM by PIB Hyderabad

క్యాలెండర్ సంవత్సరం 2021 సమయంలో భారతదేశం R&D రంగంలో USD 343.64 మిలియన్ల FDI ఈక్విటీ ప్రవాహాన్ని ఆకర్షించింది. ఇది మునుపటి C.Y (క్యాలెండర్ ఇయర్) 2020 (USD 55.77 మిలియన్లు) తో పోలిస్తే 516% ఎక్కువ. వర్తించే చట్టాలు/నిబంధనలు, భద్రత మరియు ఇతర షరతులకు లోబడి R&D రంగంలో 100% ఆటోమేటిక్ రూట్లో FDI అనుమతిస్తారు.

C.Y (క్యాలెండర్ ఇయర్) 2021 సమయంలో R&Dలో ఎఫ్డిఐ ఈక్విటీ గ్రహీతలలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. తర్వాత తెలంగాణ మరియు హర్యానా ఉన్నాయి. C.Y 2021 సమయంలో కింది రాష్ట్రాలు మునుపటి C.Y (క్యాలెండర్ ఇయర్) 2020 తో పోలిస్తే 250% కంటే ఎక్కువ వృద్ధిని చూపించాయి. అవి: తెలంగాణ, కర్ణాటక, హర్యానా, ఆంధ్రప్రదేశ్ & తమిళనాడు.

C.Y (క్యాలెండర్ ఇయర్) 2021 సమయంలో R&Dలో అత్యధిక పెట్టుబడి పెట్టే దేశం సింగపూర్. R&Dలో మొత్తం FDI ఈక్విటీలో 40% వాటాతో జర్మనీ (35%) మరియు U.S.A (11%). ఇంకా, జర్మనీ, మారిషస్, ఫ్రాన్స్, సింగపూర్, ఒమన్ మరియు U.S.A వంటి అనేక దేశాల నుండి FDI ఈక్విటీ ఇన్ఫ్లో మునుపటి C.Y (క్యాలెండర్ ఇయర్) 2020 తో పోలిస్తే 200% కంటే ఎక్కువ పెరిగింది.

డైమ్లెర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ C.Y (క్యాలెండర్ ఇయర్) 2021 సమయంలో R&Dలో అగ్ర ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లో స్వీకర్త కంపెనీ. దీనికి R&Dలో మొత్తం FDI ఈక్విటీలో 35% వాటా ఉంది. అలాగే ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (34%) మరియు స్టెలిస్ బయోఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ (21%) తదుపరి స్థానాలలో ఉన్నాయి.

ధోరణులు పటిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న R&D రంగాన్ని సూచిస్తున్నాయి. ఇది నూతన ఆవిష్కరణలు, ఉత్పాదకతను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. తద్వారా అధిక ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది.

అధిక ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేయగల జ్ఞాన-ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పరిశోధన మరియు అభివృద్ధి (R&D) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక, స్థిరమైన మూలధనాన్ని ప్రేరేపిస్తుంది. సాంకేతికత బదిలీ, వ్యూహాత్మక రంగాల అభివృద్ధి, గొప్ప ఆవిష్కరణలు, పోటీ మరియు ఇతర ప్రయోజనాలతో పాటు ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి దేశీయ మూలధనం, సాంకేతికత మరియు నైపుణ్యాలకు అనుబంధంగా R&D ఇంటెన్సివ్ ఎఫ్డిఐని ఆకర్షించడం మరియు ప్రోత్సహించడం అనేది ప్రభుత్వం చేసే ఒక నిరంతర ప్రయత్నం.

***


(Release ID: 1842987) Visitor Counter : 242


Read this release in: English , Hindi , Punjabi