వ్యవసాయ మంత్రిత్వ శాఖ

కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ తోమర్‌తో స‌మావేశ‌మైన‌ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ డేవిడ్ బీస్లే


- వ్యవసాయం, ఆహార రంగంలో భారత దేశం చేస్తున్న కృషిని ప్రశంసించిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

Posted On: 18 JUL 2022 8:09PM by PIB Hyderabad

వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ డేవిడ్ బీస్లే ఈ రోజు కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి  శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌ను న్యూఢిల్లీలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో శ్రీ డేవిడ్ బీస్లే  సాగు, ఆహార రంగంలో భారతదేశం సాధించిన విజయాలను కొనియాడారు. ప్రపంచ ఆహార కార్యక్రమం చేప‌ట్టిన  ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో కలిసి ప్రపంచానికి ఆహార ధాన్యాల సాఫీగా సరఫరా కోసం భారత దేశం తనవంతు సహాయాన్ని అందించడాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ బీస్లీ నేతృత్వంలోని ప్రపంచ ఆహార కార్యక్రమ ప్రతినిధి బృందాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి శ్రీ తోమర్ అనంత‌రం మాట్లాడుతూ ఆహార భద్రతను నిర్ధారించడానికి భారతదేశం మరియు డ‌బ్ల్యుఎఫ్‌పీ 1968 నుండి వ్యవసాయ రంగంలో సన్నిహితంగా పనిచేస్తున్నాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో  భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావిస్తూ  కోవిడ్ మహమ్మారి విస్త‌రిస్తున్న సమయంలో భారతదేశ ప్రజల‌కు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా మోడీ ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను పంపిణీ చేసిందని శ్రీ తోమర్ వివ‌రించారు.  దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా, భారతదేశం అనేక దేశాలకు ఆహార ధాన్యాలను అందించిందని, తద్వారా భారతదేశ ప్రాచీన సంప్రదాయం‘వసుదైక‌ కుటుంబం’ (ప్రపంచం ఒకే కుటుంబం) యొక్క ప్రాముఖ్యతను నిలబెట్టిందని శ్రీ తోమర్ తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి, ఆహార భద్రతపై డ‌బ్ల్యుఎఫ్ పీ మరియు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలపై శ్రీ బీస్లీ సంతృప్తి వ్యక్తం చేశారు, అలాగే భారతదేశం యొక్క పురోగతిని ప్రశంసించారు. రాబోయే అమెరికా కాంగ్రెస్ సమావేశంలో భాగంగా వ్యవసాయంలో భారతదేశం సాధించిన విజయాలను ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తామ‌ని  చెప్పారు. వచ్చే సంవత్సరం భారతదేశం నాయకత్వంలో అంతర్జాతీయ చిరుధాన్యాల  సంవత్సరాన్ని జరుపుకోనున్నట్లు మంత్రి శ్రీ తోమర్ తెలియజేసినప్పుడు, మిస్టర్ బీస్లీ పోషకమైన తృణధాన్యాల ప్రచారంలో డ‌బ్ల్యుఎఫ్ పీ పూర్తి సహకారాన్ని అందిస్తుంద‌ని హామీ ఇచ్చారు.
                                                   

***



(Release ID: 1842528) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi , Punjabi