వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన సమిష్టి కృషి కారణంగా లక్షలాది మంది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసింది: శ్రీ తోమర్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌తో సమానంగా, ఆదాయం పెరిగిన 75,000 రైతుల విజయగాథల సంకలనంతో ఈ-బుక్ విడుదల
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ 94వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అవార్డుల ప్రదానోత్సవం
Posted On:
16 JUL 2022 8:45PM by PIB Hyderabad
దేశంలో వ్యవసాయ రంగం తో పాటు రైతులు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), కృషి విజ్ఞాన కేంద్రాలు (కె.వి.కె.లు) లతో సహా అందరి సమగ్ర ప్రయత్నాల కారణంగా అనేక మంది రైతులు తమ ఆదాయాలను రెట్టింపు చేయడంలో లేదా అంతకన్నా ఎక్కువ చేయడంలో విజయం సాధించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకొని, ఆదాయం పెరిగిన లక్షలాది మంది రైతులలో 75,000 మంది రైతుల విజయగాథలను సంకలనం చేయడం ద్వారా ఒక ఈ-ప్రచురణను రూపొందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై రాష్ట్రాల వారీగా సంక్షిప్త ప్రచురణ కూడా తయారు చేయబడింది. ఈ సందర్భంగా వీటిని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తోమర్ విడుదల చేశారు. ఈ-ప్రచురణ ఐసీఏఆర్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఐసిఎఆర్ 94వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీ తోమర్ శాస్త్రవేత్తలు మరియు రైతులకు అవార్డులను కూడా పంపిణీ చేశారు.
ఢిల్లీలోని ఐసిఎఆర్ పూసా క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ తోమర్ ప్రసంగిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో, ఆదాయాలు రెట్టింపు లేదా రెట్టింపు కంటే ఎక్కువ అయినటువంటి 75,000 మంది రైతుల విజయ గాథలను నమోదు చేయాలని ఐసిఎఆర్ గత సంవత్సరం నిర్ణయించినందున ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు. విజయవంతమైన రైతుల ఈ సంకలనం దేశ చరిత్ర లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. శ్రీ తోమర్ ఐసిఎఆర్ ఇతర ప్రచురణలను కూడా విడుదల చేశారు. ఐసిఎఆర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 'సంకల్ప్ దివస్'గా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సంవత్స రం మొత్తానికి సంబంధించిన తీర్మానాలు చేపట్టాల ని, వాటిని వచ్చే వ్యవస్థాపక దినోత్సవం నాటికి పూర్తి చేయాలన్నారు.
सफलता की कहानी, किसानों की ज़ुबानी...
#बढ़ता_किसान_भारत_की_शान @icarindia @AgriGoI pic.twitter.com/Z7W7VXExzP
— Narendra Singh Tomar (@nstomar) July 16, 2022
భారతదేశం ఒక వ్యవసాయ దేశమని, వ్యవసాయ రంగం ఒక రంగమని, ఇందులో నిర్విరామంగా పనిచేయాలని, కొత్త సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని శ్రీ తోమర్ అన్నారు. ప్రస్తుతం, సంప్రదాయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు సాగడం సవాలు. గ్రామీణ ప్రాంతాలు, పేదలు, రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలని, జీవితం సులభంగా ఉండాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ప్రధాన మంత్రి చేసిన ప్రయత్నమిది. ఈ లక్ష్యసాధన దిశగా బహుముఖ ప్రయత్నాలు చేశారు. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి పథకాలను అమలు చేయడం ద్వారా నిధులు సమకూరుస్తున్నారు. ప్రజలను ఉపాధితో అనుసంధానం చేస్తున్నారు, వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయని ఆయన అన్నారు.
"ఒక విద్యావంతుడు వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నప్పుడు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్హత మరియు అనుభవంతో కలపడం ద్వారా, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు, తద్వారా ఉపాధి సమస్యను పరిష్కరించవచ్చు" అని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ ఐసీఏఆర్ ఏర్పాటై నేటికి 93 ఏళ్లు పూర్తయ్యాయి. "1929 సంవత్సరంలో స్థాపించబడినప్పటి నుండి ఇప్పటి వరకు, 2014 నుండి ఇప్పటి వరకు ఎనిమిదేళ్లలో విడుదల చేసిన 2,000 రకాలతో సహా సుమారు 5,800 విత్తన రకాలను విడుదల చేసింది. ఇది చాలా ముఖ్యమైన విజయం. వీటిలో విత్తన రకాలు ఉద్యానవన, వాతావరణ అనుకూలమైన మరియు బలవర్థకమైన రకాలు. ఈ రోజు మనం వాతావరణ మార్పు సవాలును ఎదుర్కొంటున్నాము, కాబట్టి ఇది శాస్త్రవేత్తలకు అత్యంత ఆందోళన కలిగించే విషయం. భారతదేశ వ్యవసాయ ఎగుమతులు మరింత మెరుగయ్యేలా మనం ఈ దిశలో ఒక రోడ్‌మ్యాప్‌తో ముందుకు వచ్చి ఫలితాలను దేశం ముందు ప్రదర్శించాలి. ఇందులో అన్ని కేవీకేలు, ఐసీఏఆర్ ఇన్‌స్టిట్యూట్‌ల ఇతర శాస్త్రవేత్తల పాత్ర కీలకం’’ అని అన్నారు.
ప్రధానమంత్రి దార్శనికత ద్వారా నూతన విద్యా విధానం పుట్టుకొచ్చిందని, ప్రస్తుతం ఇప్పుడు పాఠశాల విద్యలో వ్యవసాయ పాఠ్యాంశాలు చేర్చబడుతున్నాయని శ్రీ తోమర్ అన్నారు. వ్యవసాయ విద్యా సంస్థలు నూతన విద్యా విధానాన్ని ఎలా అవలంబించాలో, ఈ పనిని ఐసిఎఆర్ చేసిందని, దీని ఫలవంతమైన ఫలితాలను భవిష్యత్తులో చూస్తామని ఆయన అన్నారు.
పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు పత్తి ఉత్పత్తిని పెంచడంతో సహా వ్యవసాయ ఉత్పాదకత రంగంలో దృఢమైన ప్రయత్నాలు చేయాలని ఐసిఎఆర్ మరియు కెవికెలను శ్రీ తోమర్ కోరారు. అంతకు ముందు, వ్యవసాయ మంత్రి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది రైతులతో ఆన్ లైన్ లో సంభాషించారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ మొదలైన ప్రాంతాల రైతులతో వ్యవసాయ మంత్రి జరిపిన చర్చలో ప్రభుత్వ పథకాలు మరియు సంస్థాగత మద్దతు కారణంగా వారి ఆదాయాలు మరియు జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని వెల్లడైంది.
डोंगरपुर राजस्थान से श्रीमती शांता पटेल जी ने बताया कि कृषि विज्ञान केंद्र से प्रशिक्षण के बाद अब उनकी बचत साढ़े तीन लाख से बढ़कर साढ़े तेरह लाख रूपए हो गई है... #बढ़ता_किसान_भारत_की_शान @icarindia @narendramodi @AgriGoI pic.twitter.com/uh2jzfcKgk
— Narendra Singh Tomar (@nstomar) July 16, 2022
ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పర్షోత్త మ్ రూపాలా ఐసిఎఆర్ సాధించిన విజయాల చరిత్ర ను డాక్యుమెంట్ చేయాలని సూచించారు. పోషకాలను పెంపొందించే పంటల కొత్త విత్తన రకాలను అభివృద్ధి చేసినందుకు ఐసిఎఆర్ ను ఆయన అభినందించారు. ఈ రంగంలో శ్రేష్టమైన కృషి చేసేలా వారిని ప్రోత్సహిస్తూనే, వ్యవసాయ, అనుబంధ రంగాల లో జరుగుతున్న ఆవిష్కరణల వైపు పరిశోధన కేంద్రాల దృష్టిని మల్పించాలని ఆయన అన్నారు. ప్రధానమంత్రి చొరవతో భారత దేశం నాయకత్వంలో వచ్చే సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని జరుపుకోనున్న ట్లు ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా, ఐసిఎఆర్ ప్రపంచవ్యాప్తంగా పోషకమైన తృణధాన్యాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాలి.
వ్యవసాయాభివృద్ధిలో రైతులతో పాటు ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి అన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో, రైతుల ఆదాయాన్ని పెంచడం, వారికి సౌకర్యాలు మరియు మద్దతు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. 8 ఏళ్ల క్రితం వ్యవసాయ బడ్జెట్ రూ.22 వేల కోట్లు కాగా, ఇప్పుడు రూ.1.32 లక్షల కోట్లకు పెంచబడింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో రూ.6,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండగా, చిన్న రైతుల సమస్యలను ఎఫ్పీవోల ద్వారా పరిష్కరిస్తున్నారు. కొత్త 10,000 ఎఫ్.పి.ఒ.లు ఒక మైలురాయిగా నిలుస్తాయి మరియు వాటి ద్వారా రైతులు తమ ఉత్పత్తులను దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఏ మూలలోనైనా సులభంగా విక్రయించగలుగుతారు.
.
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేష్ చంద్ మాట్లాడుతూ, శ్రీ తోమర్ మాట్లాడిన తీర్మానం తనంతట తానుగా ముఖ్యమని అన్నారు. ప్రతి సంస్థ తన స్వంత తీర్మానాన్ని చేయాలి, తద్వారా అది ప్రతి ఒక్కరి తీర్మానంగా మారుతుంది. కెవికెలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఐసిఎఆర్ ఏమి సాధించినా, అది ప్రజలను భాగస్వాములుగా చేయడం ద్వారా చేసింది. గత 75 సంవత్సరాలలో హరిత విప్లవం యొక్క విజయం జన్యు మెరుగుదల నుండి వచ్చింది. భారత ప్రభుత్వం గొప్ప బాధ్యతతో రెండు మార్గాల్లో నడుస్తోంది. ఒకటి సంప్రదాయ పద్ధతి, రెండవది – విజ్ఞాన శాస్త్రం.
भारतीय कृषि अनुसंधान परिषद का 94वां स्थापना दिवस और पुरस्कार वितरण समारोह - 2022 #बढ़ता_किसान_भारत_की_शान https://t.co/VkoSc6uTXM
— Narendra Singh Tomar (@nstomar) July 16, 2022
సంస్థల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకుగాను వ్యక్తిగత ఉద్యోగులు మరియు బృందాలను ప్రోత్సహించడం మరియు వారి ఉద్యోగ సంతృప్తి స్థాయిలను మెరుగుపరచడంతోపాటుగా వారిని మరింత సమర్థవంతంగా, ప్రతిస్పందించేవిధంగా మరియు ఉత్పాదకంగా తీర్చిదిద్దే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 4 ప్రధాన కేటగిరీల్లో 15 అవార్డులను మంత్రి ప్రదానం చేశారు. వ్యవసాయ సంస్థలకు నేషనల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ అవార్డ్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్, నేషనల్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ మెంట్ ఫర్ ఫార్మర్స్ ఈ కేటగిరీల్లో ఉన్నాయి.
आज पूसा परिसर नई दिल्ली में @icarindia के 94वें स्थापना दिवस और पुरस्कार वितरण समारोह - 2022 में पुरस्कार प्राप्त करने वाले सभी महानुभावों एवं संस्थाओं को हार्दिक बधाई एवं शुभकामनाएं...#बढ़ता_किसान_भारत_की_शान @AgriGoI pic.twitter.com/ti8BEJH3D4
— Narendra Singh Tomar (@nstomar) July 16, 2022
ఈ ఏడాది ఐసిఎఆర్ 4 సంస్థలు, 1 ఆల్ ఇండియా కో ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్, 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, 67 శాస్త్రవేత్తలు మరియు 11 మంది రైతులు సహా 15 విభిన్న అవార్డుల కింద 92 మంది అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది, వీరిలో 8 మంది మహిళా శాస్త్రవేత్తలు మరియు రైతులు ఉన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన అతిథి మరియు ప్రముఖులు వివిధ ఐసిఎఆర్ ప్రచురణలు మరియు సాంకేతికతలను విడుదల చేశారు.
ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (వ్యవసాయ విస్తరణ) డాక్టర్ ఎ.కె.సింగ్ స్వాగతోపన్యాసం చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పవన్ కుమార్ అగర్వాల్ ధన్యవాదాలు తెలిపే ఓటును ప్రతిపాదించారు. మహారాష్ట్ర ఎంపీ డాక్టర్ అనిల్ బోండే, ఐసీఏఆర్ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. దేశంలోని 731 కేవీకేలు, ఐసీఏఆర్ సంస్థల్లో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వేలాది మంది రైతులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1842093)
Visitor Counter : 205