గనుల మంత్రిత్వ శాఖ

ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ ఐకానిక్ వారోత్స‌వాల‌ను దేశ‌భ‌క్తీయుత ఉత్సాహంతో నిర్వ‌హిస్తున్న‌ జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా

Posted On: 15 JUL 2022 4:46PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ (75 సంవ‌త్స‌రాల భార‌త స్వాతంత్య్ర సంబ‌రాల‌ ) సంద‌ర్భంగా జియోలాజిక‌ల్‌సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ ఐ) , కోల్ క‌తాలోని త‌న కేంద్ర కార్యాల‌యంతో పాటు దేశవ్యాప్తంగా గ‌ల 32 జిఎస్ఐ కార్యాల‌యాల‌లో  అత్యంత ఉత్సాహంతో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది. ఆజాదికా అమృత్ మ‌హోత్స‌వ్ ఐకానిక్ వారోత్స‌వాల‌లో భాగంగా 2022 జూలై 11న మొద‌లు పెట్టి ఈ ఐకానిక్ వారోత్స‌వాల‌ను కేంద్ర గ‌నుల శాఖ నిర్వ‌హిస్తోంది. ఈ ఉత్స‌వాలు ఈనెల 17 వ‌ర‌కు జ‌రుగుతాయి. ఐకానిక్ వారోత్స‌వాల‌ను దేశ‌వ్యాప్తంగా మంత్రిత్వ‌శాఖ కింద‌గ‌ల‌ అన్ని విభాగాలు, సంస్థ‌లు నిర్వ‌హిస్తున్నాయి.

 ఇందుకు సంబంధించిన ప్ర‌ధాన కార్య‌క్ర‌మాన్ని కోల్‌క‌తాలో గ‌ల జిఎస్ ఐ కేంద్ర కార్యాల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేశారు. రోజంతా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మం, ఇండియ‌న్ మ్యూజియం అసుతోష్ శ‌త‌జ‌యంతి హాల్‌లో ఎగ్జిబిష‌న్ ప్రారంభంతో మొద‌లైంది. ఆరు బ‌య‌లు ప్రాంగ‌ణంలో 75 బ‌లూన్లు ఎగుర‌వేయ‌డం, పాట్ గ్యాల‌రీ ప్రారంభం, మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని జిఎస్‌.ఐ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ ఎస్ .రాజు చేప‌ట్ట‌డం ముఖ్య‌మైన విశేషాలుగా చెప్పుకోవ‌చ్చు.
డాక్ట‌ర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ ఆడిటోరియంలో  డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్‌, డాక్ట‌ర్ ఎస్‌.రాజు జ్యోతి వెలిగించి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అతిథుల‌ను ఆహ్వానించి , వందేమాత‌రం గీతాన్ని ఆల‌పించారు. ఇండియాకు సంబంధించి యాక్టివ్ ఫాల్ట్ కాంపెండియం, రికార్డ్స్ ఆఫ్ జిఎస్ ఐ, వాల్యూం 155 పార్ట్ 2, ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ జియో సైన్సెస్ వాల్యూం 76, నెంబ‌ర్ 1, మ‌రో రెండు ఆన్ లైన్ ఈ ప‌బ్లికేష‌న్ల‌ను , ఇండియ‌న్ ఆప్ షోర్ స‌బ్ మెరైన్ ఫీచ‌ర్ల‌పై అట్లాస్‌, జియోటూరిజం మ్యాప్ ఆఫ్ ఇండియా, ల‌ను డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్  ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిఎస్ ఐ కి చెందిన రిటైర్డ్ అధికారుల‌ను డి.జి స‌త్క‌రించారు.

కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారినుద్దేశించి మాట్లాడుతూ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ ఎస్ .రాజు, జాతీయ‌, అంత‌ర్జాతీయ సామాజిక‌, ఆర్ధిక ప‌రిస్థితుల‌లో చోటుచేసుకుంటున్న మార్పుల నేప‌థ్యంలో జిఎస్ఐ దార్శ‌నిక‌త‌, ల‌క్ష్యం, వ్యూహ ప్రాధాన్య‌త గురించి వివ‌రించారు. జిఎస్ఐ భ‌విష్య‌త్ కార్య‌క‌లాపాల‌ను ఆయ‌న వివ‌రిస్తూ, ప్ర‌త్యేకంగా ఖ‌నిజాల అన‌వేష‌ణ‌లో, ప్ర‌జాహిత భూగ‌ర్భ‌శాస్త్రంలో,రానున్న సంవ‌త్స‌రాల‌లో జిఎస్ ఐని భ‌విష్య‌త్‌కు స‌న్న‌ద్ధం చేయ‌డం గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. భార‌త‌దేశాన్ని  ఆత్మ‌నిర్భ‌ర్ చేసేందుకు జిఎస్ ఐ చేప‌డుతున్న వ్యూహాత్మ‌క కీల‌క ఖ‌నిజ అన్వేష‌ణ గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

అశుతోష్ శ‌త‌జ‌యంతి హాల్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్ లో వివిధ ర‌కాల రాళ్లు, ఖ‌నిజాలు, గ‌నుల‌లో ల‌భించిన ముడి ఖ‌నిజాలు, వివిధ శిలాజాలు ప్ర‌ద‌ర్శించి వాటి ప్రాధాన్య‌త‌ను సంద‌ర్శ‌కులు, అతిథులు, ప్ర‌ముఖుల‌కు వివ‌రించారు. గ‌త 75 సంవ‌త్స‌రాల‌లో జిఎస్ఐ కార్య‌క‌లాపాలు, సాధించిన విజ‌యాలను బ్యాన‌ర్లు, పోస్ట‌ర్లు, డిజిట‌ల్ డిస్‌ప్లే ల ద్వారా ప్ర‌ద‌ర్శించారు. భార‌త స్వాతంత్రంపై న‌, జిఎస్ ఐ సాధించిన చెప్పుకోద‌గిన విజ‌యాలపైన విద్యార్థుల‌కు, ఉద్యోగుల‌కు క్విజ్ పోటీని ఏర్పాటు చేశారు. వివిధ సాంస్కృతిక బృందాలు భార‌త స్వాంత‌త్ర స‌మ‌ర ఘ‌ట్టాలు, మ‌హిళా సాధికార‌త‌పై కార్య‌క్ర‌మాలు ప్ర‌ద‌ర్శించారు. వీటిని అంద‌రూ అభినందించారు.


 

****



(Release ID: 1842001) Visitor Counter : 180


Read this release in: English , Urdu , Hindi