పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

14 రాష్ట్రాల్లో ఏర్పాటైన 166 సి.ఎన్.జి. కేంద్రాలు!


కేంద్రమంత్రి హర్‌దీప్ పూరి చేతుల మీదుగా జాతికి అంకితం

Posted On: 15 JUL 2022 5:17PM by PIB Hyderabad

   దేశంలోని 14 రాష్ట్రాల్లో నెలకొల్పిన 166 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సి.ఎన్.జి.) కేంద్రాలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ఈ రోజు జాతికి అంకితం చేశారు. సహజవాయు ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలను సాకారం చేసే కృషిలో భాగంగా ఈ సి.ఎన్.జి. కేంద్రాలను ఏర్పాటు చేశారు. 14 రాష్ట్రాల్లోని 41 భౌగోళిక ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ఆధ్వర్యంలో ఈ సి.ఎన్.జి. కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గెయిల్ సిటీ గ్రూపు పంపిణీ సంస్థల్లో (సి.జి.డి.లలో) 9 కంపెనీలు ఈ సి.ఎన్.జి. కేంద్రాల్లో ఏర్పాటులో పాలుపంచుకున్నాయి.

 (https://ci5.googleusercontent.com/proxy/Z33Ho-e5VsLgGx-SWRsnHzkSi9HUZoCfc1JE-0RbKCsxVNaAnCDeSYZuAAMjBS-QVRBy2zoPPnZ18mCOdoIMws5dmogAp0jz_0KlfBJ7olRSL8aNcbl5xPh7Qw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001F959.jpg

https://ci5.googleusercontent.com/proxy/sELmvKx2E5i-Gwisg8sr79Jm4TtR1QYfNuwqIuSNANMtyH56nQqJUhzSy3LP6kAvL1eBqzfkpBQHr9jvDnQNlDfvvw3WrzrxyFq6o2EuTA1z3SU28b95BCEKOw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FXLW.jpg

  ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీడియో లింక్ ద్వారా కొత్త సి.ఎన్.జి. కేంద్రాలన్నింటినీ కేంద్రమంత్రి పూరి జాతికి అంకితం చేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయవు, కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలీ, పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్,త పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ, ఆయిల్ గ్యాస్ కంపెనీల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా కేంద్రమంత్రి పూరి మాట్లాడుతూ, సి.ఎన్.జి. కేంద్రాల వ్యవస్థ విస్తరణను చేపట్టిన గెయిల్‌కు, ఆ సంస్థకు సంబంధించిన సి.జి.డి.లకు అభినందనలు తెలిపారు. రూ. 400కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ సి.ఎన్.జి. కేంద్రాలతో గ్యాస్ ఆధారిత మౌలిక సదుపాయాల వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, దేశంలో స్వచ్ఛమైన ఇంధనం మరింతగా అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. 2014లో దేశవ్యాప్తంగా 900 సి.ఎన్.జి. కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం సి.ఎన్.జి. కేంద్రాల సంఖ్య 4,500 దాటిందని అన్నారు. రానున్న రెండేళ్లలో వీటి సంఖ్య 8,000కు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇక దేశంలో 2014 నాటికి 24లక్షల పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు (పి.ఎన్.జి.లు) అందుబాటులో ఉండగా, వాటి సంఖ్య ఇపుడు 95లక్షలకు చేరిందన్నారు. ఇంత భారీ స్థాయిలో సి.ఎన్.జి. అందుబాటులోకి రావడంతో సి.ఎన్.జి. వాహనాలకు మార్కెట్ అవకాశాలపరంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని, దీనితో దేశంలో ఆ తరహా వాహనాల తయారీ, నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన కూడా భారీగా పెరుగుతుందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సి.ఎన్.జి. కేంద్రాలు నేరుగా దాదాపు వెయ్యిమందికి ఉపాధి కల్పిస్తాయన్నారు.

https://ci6.googleusercontent.com/proxy/XsUFPzJEf5ZkQcrJKHwavNjS3EGXyQCa18pJiotZlEjtQmceIkDFec8xFBXpV1AM1vVRFDtQ85N92Tf7_WX4OVms5YgIWLSxFxwq7ZRmt2ZWkP3RSuaKF1nUHw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032CRL.jpg

    దేశంలో సి.ఎన్.జి. కేంద్రాల ఏర్పాటులో కీలకపాత్ర వహించిన బృందానికి కేంద్ర పెట్రోలియం, సహజవాయవు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ కూడా తన ప్రసంగంలో అభినందనలు తెలిపారు. దేశ వ్యాప్తంగా పర్యావరణహితమైన ఇంధన వినియోగాన్ని మరింత విస్తృత స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. సి.ఎన్.జి., ద్రవీకృత సహజవాయువు (ఎల్.ఎన్.జి.) ఆధారిత స్వచ్ఛ ఇంధన సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్.ఐ.ఎ.ఎం.) ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కూడా కేంద్రమంత్రి పూరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోటారు వాహనాల రంగంలో మరింత స్వచ్ఛమైన ఇంధనాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినయోగించడం ద్వారా వాహనాలనుంచి వెలువడే కాలుష్యాన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అఖిల భారత స్థాయిలో సి.ఎన్.జి., ఎల్.ఎన్.జి. ఇంధనాన్ని మరిన్ని ఎక్కువ సంఖ్యలో వాహనాలకు వర్తింపజేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

https://ci6.googleusercontent.com/proxy/6kY8fND5LTb7n6tXZAzuFBfWoexscqRZrTanYQPRvmg8a3y7G3fDx6Gb-aGip96OnQKjDumA3WA94JfRYjVpBsUOFYTSe_uI7p02m7Kp6RV_Thqb4uhMIei3yA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004NBKJ.jpg

   గెయిల్ సిటీ గ్రూపు పంపిణీ సంస్థల అభివృద్ధి కోసం పెట్రోలియం, సహజవాయు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలు, పనులు పూర్తికాగానే,  దేశంలోని 98శాతం మంది ప్రజలకు, 88శాతం భౌగోళిక ప్రాంతానికి సహజవాయువుతో అనుసంధానం ఏర్పడుతుంది. రవాణా రంగానికి, గృహోపయోగానికి, పరిశ్రమలకు పర్యావరణ హితమైన సహజవాయు ఇంధనాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు జరిగే కృషిలో ఈనాటి సి.ఎన్.జి. కేంద్రాల ప్రారంభోత్సవాన్ని ఒక కీలకమైన ముందడుగుగా చెప్పవచ్చు. ప్రస్తుతం సంప్రదాయబద్ధంగా వినియోగిస్తున్న అనేక ఇంధనాలకంటే సహజవాయు ఇంధనం ఎంతో సురక్షితమైనదే కాక, ఖర్చుపరంగా ఎంతో పొదుపైనది.

   దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఒక బృహత్తరమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో భాగంగా ప్రధానంగా వినియోగంలో ఉన్న ఇంధనం వాటాలో సహజ వాయు వినియోగం వాటాను15శాతం వరకూ పెంచాలని ప్రధానమంత్రి నిర్దేశించారు. 2070వ సంవత్సరానికల్లా నెట్‌జీరో సాధించాలని భారతదేశె నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

 

****



(Release ID: 1841999) Visitor Counter : 160


Read this release in: Marathi , English , Urdu , Hindi