భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను ఏజియాస్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ NV కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపిన సీసీఐ

प्रविष्टि तिथि: 15 JUL 2022 5:48PM by PIB Hyderabad
ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను ఏజియాస్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ ఎన్ వి కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. 
ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో మరిన్ని వాటాలను కొనుగోలు చేసేందుకు  ఏజియాస్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ ఎన్ వి  (అక్వైరర్) ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. 
ఏజియాస్ గ్రూప్  అంతిమ హోల్డింగ్ కంపెనీగా ఏజియాస్ పనిచేస్తోంది.   అంతర్జాతీయ బీమా సంస్థ అయిన  ఏజియాస్ యూరప్ మరియు ఆసియాలో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. జీవిత భీమా సేవలు, 
సాధారణ జీవితేతర బీమా సేవలు, రీ ఇన్సూరెన్స్ సేవలు మరియు బీమా ఉత్పత్తుల రంగంలో ఏజియాస్ సేవలు విస్తరించి ఉన్నాయి. 
భారతదేశంలో టర్మ్ ప్లాన్, చైల్డ్ ప్లాన్, ULIP ప్లాన్, సేవింగ్ ప్లాన్, రిటైర్మెంట్ సొల్యూషన్స్, హెల్త్ ప్లాన్, గ్రూప్ ప్లాన్, ఆన్‌లైన్ ప్లాన్‌లు మొదలైన కేటగిరీ కింద జీవిత బీమా ఉత్పత్తులను అందించే వ్యాపారంలో ఏఎఫ్ఎల్ఐ  ఉంది. 

 
ఏఎఫ్ఎల్ఐలో ఏజియాస్ ప్రస్తుతం 49% వాటాను కలిగి ఉంది ఏఎఫ్ఎల్ఐ కార్యకలాపాలను ఇతర వాటాదారులైన ఐడీబీఐ మరియు ఫెడరల్ బ్యాంక్‌తో పాటు ఏఎఫ్ఎల్ఐ  సంయుక్తంగా నియంత్రిస్తున్నది.  
దీనికి సంబంధించిన సీసీసీ  వివరణాత్మక ఉత్తర్వులు విడుదల అవుతాయి.

 

***


(रिलीज़ आईडी: 1841997) आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी