ఆర్థిక మంత్రిత్వ శాఖ
మోసపూరితంగా ఐటిసిని ఉపయోగించుకుని, రూ. 52.04 కోట్ల జిఎస్టీని ఎగవేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసిన గురుగ్రాం డిజిసిఐ
Posted On:
13 JUL 2022 3:27PM by PIB Hyderabad
సరుకులు లేని ఇన్ వాయిస్‌ల తోడ్పాటుతో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ( ఉత్సాదక పన్ను రుణం)ను ఉపయోగించుకున్నందుకు జిఎస్‌టి చట్టంలోని ప్రొవిజన్ల కింద డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ)కు చెందిన గురుగ్రాం జోనల్ యూనిట్ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.
ఇన్‌వాయిస్ లో పేర్కొన్న వస్తువులను సరఫరా చేయకుండానే నకిలీ బోగస్ ఐటిసీలను ఉపయోగించడం & జారీ చేయడంలో ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజియాబాద్, ఇండస్ట్రియల్ ఏరియా, బులంద్‌షహర్ రోడ్డు ఎస్- 1 & ఎస్-15లో గల ఎం/ ఎస్ ఎకెఎస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిమగ్నమై ఉన్నట్టు డిజిసిఐ గురుగ్రాం జోనల్ యూనిట్ అధికారులు ఇంటెలిజెన్స్‌ను పోగు చేశారు. అంతేకాకుండా, ఉనికిలో లేని వివిధ సంస్థల నుంచి అనర్హమైన ఐటిసిని పొందడంపై కార్యాలయం ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన ఎం/ఎ స్ అభిషేక్ ఇండస్ట్రీస్ నుంచి ఒక నిర్ధిష్ట సంవత్సరంలో భారీ కొనుగోళ్ళు చేసిన విషయాన్ని కనుగొన్నారు.
ధ్రువీకరణలు, ఆధారాలు, రికార్డు చేసిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ఘాజియాబాద్‌లోని ఎం/ఎ స్ ఎకెఎస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వస్తవులు లేకుండానే ఎం/ ఎస్ అభిషేక్ ఇండస్ట్రీస్ సహా పలు సంస్థల నుంచి వాస్తవంలో వస్తువుల సరఫరా లేకుండానే ఇన్‌వాయిస్‌లను తోడ్పాటుతో ఆమోదయోగ్యం కాని ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను ఉపయోగించుకోవడంలో నిమగ్నమై ఉందని బహిర్గతమైంది. ఎం/ ఎస్ ఎకెఎస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆమోదయోగ్యం కాని ఐటిసిని ప్రాధమికంగా ఉపయోగించుకున్న మొత్తం రూ. 52 కోట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఎం/ ఎస్ ఎకెఎస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డైరెక్టర్‌ను 06.07.2022న అరెస్టు చేయగా అతడిని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారు.
***
(Release ID: 1841293)