పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఢిల్లీ- ఎన్ సి ఆర్ లో వాయు కాలుష్య ముప్పును తగ్గించడానికి సమగ్ర విధానాన్ని రూపొందించిన సి ఏ క్యు ఎం


సమగ్ర విధానం తో థర్మల్ పవర్ ప్లాంట్ లు, పరిశుభ్రమైన ఇంధనాలు ,ఎలక్ట్రిక్ మొబిలిటీ, ప్రజా రవాణా, రోడ్డు ట్రాఫిక్ మేనేజ్ మెంట్, డీజిల్ జనరేటర్ లు , బాన సంచా కాల్చడం వంటి అంశాల నిర్వహణ

ఇతర ఉపశమన చర్యలతో పాటు
పచ్చదనం ,పెద్ద ఎత్తున మొక్కల పెంపకం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడంపై దృష్టి

Posted On: 13 JUL 2022 12:57PM by PIB Hyderabad

ఎన్ సిఆర్,  దాని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ (సిఎ క్యూఎమ్) ఢిల్లీ-ఎన్ సిఆర్ లో వాయు కాలుష్య ముప్పును తగ్గించడానికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించింది, ఇది విభిన్నమైన భౌగోళిక విధానం , కార్యాచరణ కాలవ్యవధుల ద్వారా జాతీయ రాజధాని ప్రాంత (ఎన్ సిఆర్) గాలి నాణ్యతను మొత్తంగా మెరుగుపరిచే దిశగా ఒక కీలకమైన చర్య. వాయు కాలుష్యాన్ని నిరోధించడానికి, నియంత్రించడానికి , తగ్గించడానికి పరిశ్రమలు, వాహనాలు/ రవాణా, నిర్మాణం, కూల్చివేత (సి అండ్ డి), రోడ్లు ,బహిరంగ ప్రదేశాల నుండి దుమ్ము, మునిసిపల్ ఘన వ్యర్థాలను కాల్చడం, పంట అవశేషాలను కాల్చడం మొదలైన రంగాల వారీగా సిఫార్సులు ఈ విధానం లో ఉన్నాయి. .థర్మల్ పవర్ ప్లాంట్లు (టీపీపీ), పరిశుభ్రమైన ఇంధనాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ప్రజారవాణా, రోడ్డు ట్రాఫిక్ మేనేజ్ మెంట్,  డీజిల్ జనరేటర్లు (డీజీ), టపాసులు పేల్చడం, పచ్చదనం, మొక్కల పెంపకం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అంశాలను  కూడా సీఏ క్యూఎం రూపొందించిన విధానంలో పొందుపరిచారు.

సిఎ క్యూఎమ్ రూపొందించిన ఈ సమగ్ర ప్రణాళిక పరిధి ప్రధానంగా ఢిల్లీ , ఎన్ సిఆర్ లలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం. ఎన్ సి ఆర్ ఉప-ప్రాంతాల (సబ్ రీజియన్)లో మౌలిక సదుపాయాలు, వ్యవస్థలలో లోటు, బేస్ లైన్ చర్యలలో విస్తృత వ్యత్యాసాలు ,వివిధ స్థాయిల పట్టణీకరణ కారణంగా, వివిధ ఉప-ప్రాంతాలకు ఒక భిన్నమైన విధానం కాలవ్యవధులు సూచించబడ్డాయి. ఈ సబ్ రీజియన్ లలో గల ప్రాంతాలు:

*ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్ సి టి)

*ఢిల్లీ సమీపంలోని ఎన్ సిఆర్ జిల్లాలు - గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఝజ్జర్, రోహ్ తక్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ మరియు బాగ్ పట్

*ఇతర ఎన్ సి ఆర్ జిల్లాలు

*ప్రధానంగా వ్యర్థాలను కాల్చడం వంటి అంశాలను పరిష్కరించడానికి -పంజాబ్ రాష్ట్రం మొత్తం , హర్యానాలోని నాన్-ఎన్.సి.ఆర్ జిల్లాలు,

ఆదిత్య దూబే (మైనర్), ఏఎన్ఆర్ వర్సెస్ యూఓఐ అండ్ ఓర్స్ విషయంలో 2020 డబ్ల్యూపీ (సివిల్) నెం.1135లో 16.12.2021న భారత సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో -ఢిల్లీ, ఎన్ సిఆర్ లలో ప్రతి సంవత్సరం సంభవించే వాయు కాలుష్య ముప్పుకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే ఉద్దేశ్యంతో, సాధారణ ప్రజల నుండి అలాగే ఈ రంగంలోని నిపుణుల నుండి సలహాలను ఆహ్వానించవచ్చని సిఎక్యూఎమ్ ను ఆదేశించింది.

ఆ పై , సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కమిషన్ 7.1.2022 నాటి ఉత్తర్వు ద్వారా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అందిన సూచనలను నిపుణుల బృందం పరిగణనలోకి తీసుకుంది, మధ్యవర్తులు ,నిపుణులతో పాటు వివిధ వాటాదారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సంభాషించింది.

నిపుణుల బృందం అందిన సూచనలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా, వివిధ రంగాలలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత శాస్త్రీయ అంశాలు , సంబంధిత విధానాలు, నిబంధనలు, కార్యక్రమాలు ,నిధుల వ్యూహాలు, ప్రస్తుత కార్యాచరణ స్థితి ,ఉత్తమ ఆచరణ విధానాలను సమీక్షించి, పరిశీలించింది. పౌర సమాజం, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, నిపుణులు, విద్యావేత్తలు, వ్యక్తులు మొదలైన వారి నుండి అందుకున్న సలహాలు ,వాయు కాలుష్యం, వాయు నాణ్యత నిర్వహణ, పర్యవేక్షణ ఫ్రేమ్ వర్క్ అమలు కోసం సంస్థాగత బలోపేతానికి సంబంధించిన కీలక రంగాలలో ఉపశమనానికి సంబంధించినవి.

పరిశ్రమలు, పవర్ ప్లాంట్లు, వాహనాలు, రవాణా, డీజిల్ జనరేటర్ సెట్లు, నిర్మాణం / కూల్చివేత ప్రాజెక్టులు / రోడ్లు ,బహిరంగ ప్రాంతాలు వంటి ధూళి వనరులు, మునిసిపల్ ఘన వ్యర్థాలు / బయోమాస్ దహనం, వ్యర్థాలను కాల్చడం, బాణసంచా కాల్చడం ఇంకా ఇతర చెదరగొట్టిన వనరులు ఈ బహుళ-రంగ మదింపు పరిధి లో ఉన్నాయి.వాటాదారుల తో సంప్రదింపుల పరంపర ద్వారా  అందుకున్న ఇన్ పుట్ లు,  సూచనలను సంబంధిత విభాగాల్లో సముచితంగా పొందుపరిచారు. ఈ భాగస్వామ్య విధానం ఢిల్లీ-ఎన్ సిఆర్ లో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఒక సమగ్ర విధానాన్ని సూచించే ప్రక్రియను సుసంపన్నం చేసింది.

ఇందులో ఇమిడి ఉన్న సమస్యలు ,సంక్లిష్టతలను పరిగణనలోకి తీసుకొని, నిపుణుల బృందం స్వల్పకాలిక (ఒక సంవత్సరం వరకు), మధ్యకాలిక (ఒకటి-మూడు సంవత్సరాలు), దీర్ఘకాలిక (మూడు-ఐదు సంవత్సరాలు, ప్రాధాన్యతగా) చర్యలను సూచించింది.ఈ కాలపరిమితి వివిధఉప-ప్రాంతాలు/ప్రాంతాలు/జిల్లాలు/నగరాల కోసం మరింత విభిన్నంగా ఉంటుంది, ఇది సాధారణ గాలి నాణ్యత లక్ష్యాన్ని చేరుకోవడానికి , రూపాంతరం చెందడానికి అందరికీ వీలు కల్పిస్తుంది. స్థూలంగా, జాతీయ పరిసర గాలి నాణ్యతా ప్రమాణాలను చేరుకోవడానికి ఉద్దేశించిన కీలక మార్పు అంశాలు ఇలా ఉన్నాయి.

*పరిశ్రమ, రవాణా ,గృహాల్లో భరించగ స్థాయిలో పరిశుభ్రమైన ఇంధనాలు , సాంకేతిక పరిజ్ఞానానికి విస్తృత ప్రాప్యత

*మాస్ ట్రాన్సిట్, వాహనాల విద్యుదీకరణ, వాకింగ్, సైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, వ్యక్తిగత వేహికల్ వినియోగాన్ని తగ్గించడం మొదలైన వాటితో సహా మొబిలిటీ ట్రాన్సిషన్

*వ్యర్థాల డంపింగ్ ,బర్నింగ్ నిరోధించడం కొరకు వ్యర్థాల నుంచి మెటీరియల్ రికవరీ కోసం సర్క్యులర్ ఎకానమీ

*సి అండ్ డి కార్యకలాపాలు, రోడ్లు/రైట్ ఆఫ్ వేస్ (ఆర్ ఓ డబ్ల్యూ), బహిరంగ ప్రాంతాల నుంచి తగిన టెక్నాలజీతో ధూళి నియంత్రణ యాజమాన్యం,

*మౌలిక సదుపాయాలు ,పచ్చదనం చర్యలను

కఠినమైన కాలపరిమితితో అమలు చేయడం,

మెరుగైన పర్యవేక్షణ , కట్టుబాటు సమ్మతి.

ఎన్ సిఆర్ లో వాయు కాలుష్యాన్ని అరికట్టే విధానంపై సమగ్ర చర్యలు తీసుకోవడానికి కమిషన్ ఇప్పటికే ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్ మెంట్ లు, ఎన్ సిఆర్ రాష్ట్ర ప్రభుత్వాలు, జిఎన్ సిటిడి ,వివిధ ఏజెన్సీలతో పంచుకుంది. పాలసీ డాక్యుమెంట్ ని కమిషన్ వెబ్ సైట్ caqm.nic.in.నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు,

 

*******(Release ID: 1841219) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi , Tamil