వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కాగితం దిగుమతి పర్యవేక్షణ వ్యవస్థ ( పిఐఎంఎస్ )

Posted On: 12 JUL 2022 6:29PM by PIB Hyderabad

ప్రధాన కాగితపు ఉత్పత్తుల దిగుమతి విధానాన్ని 'ఉచిత' నుండి ' పిఐఎంఎస్ కింద నిర్బంధ రిజిస్ట్రేషన్‌కు లోబడి ఉచితంగా'కి సవరించడం ద్వారా పేపర్ దిగుమతి పర్యవేక్షణ వ్యవస్థ ( పిఐఎంఎస్ )ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీ ఎఫ్ టీ ) ప్రవేశపెట్టింది.  పిఐఎంఎస్ అక్టోబర్ 12022 నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం 15 జూలై 2022 నుంచి అందుబాటులోకి వస్తుంది. 

న్యూస్‌ప్రింట్,చేతితో చేసిన కాగితం , కోటెడ్ పేపర్అన్‌కోటెడ్ పేపర్లిథో మరియు ఆఫ్‌సెట్ పేపర్టిష్యూ పేపర్టాయిలెట్ పేపర్కార్టన్‌లు వంటి 201 ఉత్పత్తులు  పిఐఎంఎస్ పరిధిలోకి వస్తాయి.  దేశానికి చెందిన ఏదైనా ఒక సంస్థ దిగుమతి చేసుకునే  కాగితపు ఉత్పత్తులకు   పిఐఎంఎస్   వర్తిస్తుంది. లేబుల్‌లు మొదలైనవి. అయితేకరెన్సీ పేపర్బ్యాంక్ బాండ్ మరియు చెక్ పేపర్సెక్యూరిటీ ప్రింటింగ్ పేపర్ మొదలైన కాగితపు ఉత్పత్తులు తప్పనిసరి రిజిస్ట్రేషన్ నుండి మినహాయించబడ్డాయి.

  పిఐఎంఎస్ నిబంధనల ప్రకారం వస్తువులను దిగుమతి చేసుకునేవారు   500 రూపాయలను చెల్లించి  ఆన్‌లైన్ విధానంలో ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందవలసి ఉంటుంది. దిగుమతి చేసుకొంటున్న ఉత్పత్తి చేరే తేదీకి 75వ రోజు కంటే ముందు లేదా  దిగుమతి సరుకు వచ్చే అంచనా తేదీ కంటే 5వ రోజు కంటే ముందు ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందవలసి ఉంటుంది. ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను 75 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది.   రిజిస్ట్రేషన్ చెల్లుబాటు వ్యవధిలో అదే రిజిస్ట్రేషన్ నంబర్‌తో  బహుళ సరుకుల బిల్ ఆఫ్ ఎంట్రీ (BoEs)   అనుమతించబడిన పరిమాణంలో అనుమతించబడుతుంది.

ఇంతేకాకుండా   ప్రత్యేక ఆర్థిక జోన్/ఫ్రీ ట్రేడింగ్ వేర్‌హౌసింగ్ జోన్‌లోని యూనిట్ ద్వారా దిగుమతి చేసుకునే సమయంలో లేదా  పిఐఎంఎస్ పరిధిలోకి వచ్చే  వస్తువులను ఎగుమతి ఆధారిత యూనిట్ ద్వారా దిగుమతి చేసుకునే సమయంలో కూడా పిఐఎంఎస్ నిబంధనల కింద రిజిస్ట్రేషన్ అవసరం. అయితే, ప్రత్యేక ఆర్థిక జోన్/ఫ్రీ ట్రేడింగ్ వేర్‌హౌసింగ్ జోన్‌  /ఈఓయూ కి చేరే వస్తువులు  పిఐఎంఎస్ రిజిస్ట్రేషన్ కలిగి ప్రాసెసింగ్ జరగకుండా ఉండే   సదరు కాగితపు వస్తువులు ప్రత్యేక ఆర్థిక జోన్/ఫ్రీ ట్రేడింగ్ వేర్‌హౌసింగ్ జోన్‌  /ఈఓయూ  నుంచి డొమెస్టిక్ టెరిటరీ ఏరియా (DTA) లోకి వచ్చే  సమయంలో కస్టమ్స్ క్లియరెన్స్ పొందే సమయంలో తిరిగి రిజిస్ట్రేషన్ చేయవలసిన  ఉండదు . 

"ఇతరులు" కేటగిరీ టారిఫ్ లైన్‌ల క్రింద దిగుమతులను అరికట్టడానికి దేశీయ కాగితం పరిశ్రమ డిమాండ్ ఆధారంగా  పిఐఎంఎస్ విధానం రూపొందించబడింది.  తక్కువ ఇన్‌వాయిస్ చూపించడం ద్వారా దేశీయ మార్కెట్లోకి అవసరానికి మించి  కాగితం ఉత్పత్తులను తీసుకురావడం తప్పుగా ప్రకటించడం ద్వారా నిషేధించబడిన వస్తువులను దిగుమతి చేసుకోవడంవాణిజ్య ఒప్పందాల పేరిట  ఇతర దేశాల ద్వారా వస్తువులను రీ-రూటింగ్ చేయడం లాంటి అక్రమ విధానాలకు తెరదించాలన్న లక్ష్యంతో పిఐఎంఎస్ విధానం అమలులోకి వస్తుంది. దీనివల్ల  ఈ తరగతిలో  'మేక్ ఇన్ ఇండియామరియు 'ఆత్మనిర్భర్'  కార్యక్రమాలకు ప్రోత్సాహం అందుతుంది. 

అయితే ప్రత్యేక ఆర్థిక జోన్/ఫ్రీ ట్రేడింగ్ వేర్‌హౌసింగ్ జోన్‌  /ఈఓయూలో 8-అంకెల  HS కోడ్‌లో మార్పుతో ప్రాసెసింగ్ జరిగితేప్రాసెస్ చేయబడిన వస్తువు  పిఐఎంఎస్ పరిధిలోకి  201 టారిఫ్ లైన్‌లలో దేనికైనా వస్తే డొమెస్టిక్ టెరిటరీ ఏరియా   దిగుమతి దారు  పిఐఎంఎస్   కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

 

***


(Release ID: 1841127) Visitor Counter : 273