సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రసాయన శాస్త్రవేత్త మరియు స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే చేసిన సేవలపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు విజ్ఞాన భారతి (విభ)

Posted On: 11 JUL 2022 8:23PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ మరియు విజ్ఞాన భారతి (విభ)తో కలిసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగంలో 'రసాయన శాస్త్రవేత్త మరియు స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే సేవలు' అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సుకు సంబంధించిన సన్నాహక సదస్సును ఢిల్లీలో నిర్వహించింది.

కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీల డీన్ ప్రొఫెసర్ బలరామ్ పాణి ప్రారంభించారు. కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ అశోక్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే యొక్క శాస్త్రీయ సహకారాన్ని జాబితా చేశారు. డాక్టర్ అరవింద్ రానడే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,ఐఎన్‌ఎస్‌ఏ మరియు సెక్రటరీ విజ్ఞాన భారతి (విభ) ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే యొక్క సామాజిక సహకారాన్ని ప్రేక్షకులకు వివరించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో 2022 ఆగస్టు 2-3 తేదీల్లో ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే 161వ జయంతి సందర్భంగా ఈ సమావేశం జరుగుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ తన శతాబ్ది సంవత్సరాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయంతో పాటు జరుపుకుంటుంది మరియు విజ్ఞాన భారతి (విభ) ఇంద్రప్రస్థ విజ్ఞాన భారతి, న్యూఢిల్లీ మరియు  భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.


image.png


ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే  161 వ జయంతి సందర్భంగా రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు యొక్క లక్ష్యాలు..సమాజంలో ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే యొక్క వారసత్వం మరియు సహకారాన్ని విస్తరింపజేయడం మరియు దాని ప్రాముఖ్యతతో పాటు సాధారణ అవగాహన మరియు నేపథ్యాన్ని పెంచడం.  భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 80ల నాటి సాంప్రదాయ భావన నుండి ఎస్‌డీజీ4తో సహా 21వ శతాబ్దపు విద్య ఆకాంక్షాత్మక లక్ష్యాలకు అనుగుణంగా భారతదేశ సంప్రదాయాలు మరియు విలువ వ్యవస్థలను నిర్మించడం ద్వారా విద్యా వ్యవస్థను అప్‌డేట్ చేయడం సముచితమే. దీనికి సంబంధించిన వివరాలు     www.pcray.inలో     అందుబాటులో ఉన్నాయి.


image.png

 

image.png


ఈ సందర్భంగా విజ్ఞాన భారతి సెక్రటరీ శ్రీ ప్రవీణ్ రాందాస్ మాట్లాడుతూ..విభ మరియు కాన్ఫరెన్స్ లక్ష్యం గురించి స్థూలంగా వివరించారు. కాన్ఫరెన్స్ సందర్భంగా నిర్వహించాల్సిన విభిన్న కార్యక్రమాల గురించి ప్రొఫెసర్ రాజీవ్ సింగ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రొఫెసర్ బి. కె. సింగ్ కాన్ఫరెన్స్ వెబ్‌సైట్ నావిగేషన్ మరియు వర్క్‌ఫ్లోను ప్రేక్షకులకు పరిచయం చేశారు. రెండు రోజుల కాన్ఫరెన్స్‌ను ప్రోత్సహించడానికి మరియు ప్రచారం కల్పించడానికి చేపట్టిన "రసాయన శాస్త్రవేత్తగా ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే  సేవలు"పై పోటీ మరియు ప్రదర్శన కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.

 

***(Release ID: 1840838) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi , Bengali