ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ మరియు బర్ధమాన్‌లలో ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ పాయింట్లు


ఆర్థిక కార్యకలాపాలకు మరియు ఆన్‌లైన్‌లో వివిధ సేవలను పొందేందుకు ఇంటర్నెట్ జీవనాధారంగా మారింది : రాజీవ్ చంద్రశేఖర్

7 సంవత్సరాల డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భారతదేశం ప్రాథమికంగా టెక్నాలజీ వినియోగదారు దేశం నుండి ప్రపంచానికి విశ్వసనీయ సాంకేతిక భాగస్వామిగా, మేకింగ్ ఇన్ ఇండియా - ఫర్ ది వరల్డ్‌గా పరివర్తన చెందింది: రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 10 JUL 2022 3:47PM by PIB Hyderabad

కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయమంత్రి శ్రీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ బర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ సభ్యుడు శ్రీ ఎస్‌ఎస్‌ అహ్లువాలియా సమక్షంలో  10 జూలై 2022న దుర్గాపూర్‌లో ఎన్‌ఐఎక్స్‌ఐ చెందిన రెండు కొత్త ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ పాయింట్లను (ఐఎక్స్‌పీ) ప్రారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్‌ అయిన ప్రతి భారతీయుడిని ఓపెన్, సురక్షితమైన & విశ్వసనీయ మరియు జవాబుదారీ ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేయడం మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) విజన్ 1000 రోజుల్లో భాగంగా ఈ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజీలను ప్రారంభించడం జరిగింది.

ఈ ప్రారంభ కార్యక్రమానికి దుర్గాపూర్ మేయర్ అనిందితా ముఖర్జీ, శ్రీ ప్రదీప్ కేఆర్‌.మజుందార్, దుర్గాపూర్ ఎమ్మెల్యే పుర్బా, శ్రీ లక్ష్మణ్ చంద్ర ఘోరుయ్, ఎమ్మెల్యే దుర్గాపూర్ పశ్చిమ్ మరియు శ్రీ ఖోకన్ దాస్ ఎమ్మెల్యే బర్ధమాన్ దక్షిణ్ మరియు శ్రీ పరేష్ చంద్ర సర్కార్, బర్ధమాన్ మేయర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మరియు పౌర సమాజ ప్రతినిధులు  హాజరయ్యారు.

రాష్ట్రాలలోని ఇంటర్నెట్ ఎక్స్ఛేంజీలు పశ్చిమ బెంగాల్ మరియు పొరుగు ప్రాంతాలలో ఇంటర్నెట్ మరియు బ్రాడ్‌బ్యాండ్ సేవలను మెరుగుపరచడానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఐఎస్‌పీలు దాని తుది వినియోగదారులకు అందించే మెరుగైన ఇంటర్నెట్ సేవలతో ప్రయోజనం పొందుతాయి. తద్వారా ప్రజల జీవితాల్లో మార్పును తీసుకువస్తుంది.

ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ"ఇంటర్నెట్ నేడు అన్ని ఆర్థిక కార్యకలాపాలకు జీవనాధారంగా మారింది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే పబ్లిక్ మరియు ప్రైవేట్ సర్వీస్‌లను యాక్సెస్ చేయడం చాలా అవసరం. ఇంటర్నెట్ ఎక్స్ఛేంజీలు పశ్చిమ బెంగాల్‌లోని డిజిటల్ నాగ్రిక్‌లకు మెరుగైన ఇంటర్నెట్ అనుభవాన్ని నిర్ధారిస్తాయి." అని చెప్పారు.

2015లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన 7 సంవత్సరాల డిజిటల్ ఇండియా కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ" ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు నేను ప్రేక్షకుల్లో ఉన్నాను. టెక్నాలజీలో దాదాపు 3 దశాబ్దాల అనుభవంతో భారతదేశం ఇంత దూరం ప్రయాణించి డిజిటల్ పవర్‌హౌస్‌గా ఆవిర్భవిస్తుందని నాకు కూడా తెలియదు. నేను 1990లలో భారతదేశపు అతిపెద్ద సెల్యులార్ నెట్‌వర్క్‌ను నిర్మించినప్పుడు, మనం దాదాపు ప్రతి పరికరాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకున్నాము. నేడు మనం 5 జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించబోతున్నందున, భారతదేశంలోని మెజారిటీ భాగాల రూపకల్పన మరియు తయారీకి స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేసాము. మేము టెక్ కన్స్యూమర్ నుండి ప్రపంచంలోని విశ్వసనీయ సాంకేతిక భాగస్వామిగా మారాము " అని వెల్లడించారు.

లోక్‌సభ సభ్యుడు శ్రీ ఎస్‌.ఎస్‌ అహ్లువాలియా మాట్లాడుతూ " ఈ రోజు ఇంటర్నెట్ అనేది ఒక కమ్యూనిటీకి వెన్నెముక - వ్యాపారాలు మరియు సేవలతో మాత్రమే కాకుండా ఒకరికొకరు ప్రజలను కలుపుతోంది. బర్ధమాన్ మరియు దుర్గాపూర్‌లో జంట ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్‌ల ప్రారంభోత్సవంలో భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను. ఈరోజు ఎన్‌ఐఎక్స్‌ఐ ద్వారా దుర్గాపూర్ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మణ్ ఘోరుయ్‌తో కలిసి మరియు నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నాకు సహాయం చేసినందుకు గౌరవనీయులైన కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్‌కి ధన్యవాదాలు. ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీజీ కలలు కన్న  డిజిటల్ ఇండియా మనది మనందరిది. ముఖ్యంగా దేశంలోని ఈ ప్రాంత ప్రజలకు ఫలవంతం కావాలి " అని ఆకాంక్షించారు.

మన గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాను ప్రతి పౌరుడు అనుసంధానించబడిన భారతదేశంగా ఊహించారు. వారు ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభుత్వాన్ని యాక్సెస్ చేయగలగడం మరియు విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధితో పాటు వ్యవస్థాపకత కోసం వారికి అవకాశాలను కల్పించాలని ఆకాంక్షించారు.

'డిజిటల్ అంతరాయాలను'ను మనం అధిగమించేలా మరియు మన దేశంలోని అత్యంత మూలలో ఉన్న మన దేశ ప్రజలు ప్రధాని అందించిన మార్గదర్శక నినాదంతో పాటు ఎనేబుల్ చేయడమే కాకుండా, సాధికారత పొందేలా చూడ్డం మా ప్రభుత్వ చొరవ. ప్రధానమంత్రి చేపట్టిన సబ్‌కాసాథ్, సబ్‌కావికాస్, సబ్‌కా విశ్వాస్ మరియు సబ్‌కాప్రయాస్‌లు మనల్ని నడిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మన 'ఆజాదికా అమృతమహోత్సవ్' జరుపుకునే ముఖ్యమైన యుగంలో రాబోయే దశాబ్దాలుగా ప్రపంచ ప్రకృతి దృశ్యంలో మన దేశానికి స్థానం కల్పిస్తాయి.

ఎన్‌ఐఎక్స్‌ఐ గురించి:

ఎన్‌ఐఎక్స్‌ఐ  అనేది కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 ప్రకారం లాభాపేక్ష లేని సంస్థ. 19 జూన్, 2003న నమోదు చేయబడింది. ఎన్‌ఐఎక్స్‌ఐ అనేది ఐఎస్‌పీల గురించి ఏర్పాటు చేయబడింది.

దేశీయ ట్రాఫిక్‌ను యూఎస్‌/విదేశాలకు తీసుకువెళ్లే బదులు దేశంలోని దేశీయ ట్రాఫిక్‌ను రూట్ చేయడం దీని ఉద్దేశ్యం. తద్వారా అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను ఆదా చేయడం ద్వారా ఐఎస్‌పీల కోసం మెరుగైన నాణ్యత సేవ (తగ్గిన జాప్యం) మరియు బ్యాండ్‌విడ్త్ ఛార్జీలు తగ్గుతాయి. ఎన్‌ఐఎక్స్‌ఐ తటస్థ ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాల కోసం ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా నిర్వహించబడుతుంది.

 

Website Link:https://nixi.in/en/home/

 

image.png

 

 

image.png



(Release ID: 1840647) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi , Bengali