పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ బహిరంగ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ బిడ్ రౌండ్-VIIIని ప్రారంభించింది
Posted On:
08 JUL 2022 11:25AM by PIB Hyderabad
హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ (హెల్ప్) 30 మార్చి 2016న ప్రకటించబడింది. అప్పటి నుండి ఏడు రౌండ్‌ల ఓపెన్ ఏకేజ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ (ఓఏఎల్‌పి) ఇప్పటికే ముగిసింది. 19 అవక్షేప బేసిన్లలో విస్తరించి ఉన్న 2,07,691 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కూడిన 134 ఎక్స్‌ప్లోరేషన్ & ప్రొడక్షన్ బ్లాక్‌లు అందించబడ్డాయి.
ఈ&పి కార్యకలాపాలను వేగవంతం చేయాలన్న నిర్ణయానికి కొనసాగింపుగా ప్రభుత్వం ఇప్పుడు ఓఏఎల్‌పీ బిడ్ రౌండ్-VIIIని ప్రారంభించింది. జూలై 7, 2022న అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ కోసం 10 బ్లాక్‌లను అందిస్తోంది. బిడ్‌లను ఆన్‌లైన్ ఇ-బిడ్డింగ్ పోర్టల్ ద్వారా సెప్టెంబరు 6, 2022 1200 గంటల వరకు సమర్పించవచ్చు. రౌండ్-VIII బ్లాక్‌ల విజయవంతమైన అవార్డు మరో 36,316 చ.కి.మీ. అన్వేషణ విస్తీర్ణాన్ని జోడిస్తుంది మరియు ఓఏఎల్‌పీ పాలనలో సంచిత అన్వేషణ విస్తీర్ణం 2,44,007 చ.కి.మీకి పెంచబడుతుంది.
ప్రస్తుత బిడ్ రౌండ్‌లో ఉన్న పది బ్లాక్‌లు 9 అవక్షేపణ బేసిన్‌లలో విస్తరించి ఉన్నాయి. ఇందులో రెండు ఆన్‌ల్యాండ్ బ్లాక్‌లు, నాలుగు నిస్సార వాటర్ బ్లాక్‌లు, రెండు డీప్ వాటర్ బ్లాక్‌లు మరియు రెండు అల్ట్రా-డీప్ వాటర్ బ్లాక్‌లు ఉన్నాయి. ఓఏఎల్‌పీ రౌండ్ VIII తక్షణ అన్వేషణ పని నిబద్ధత దాదాపు 600-700 మిలియన్ల అమెరికా డాలర్ల విలువ చేసే ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయబడింది.
హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ & లైసెన్సింగ్ పాలసీ (హెల్ప్), రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ మోడల్‌ను అవలంబిస్తుంది. ఇది భారతీయ అన్వేషణ మరియు ఉత్పత్తి (ఈ & పీ) రంగంలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ని మెరుగుపరచడానికి ఒక పెద్ద అడుగు. వీటికి తగ్గించిన రాయల్టీ రేట్లతో పాటు చమురు సెస్సు లేదు. కేటగిరీ-II మరియు III బేసిన్‌లలోని బ్లాక్‌లకు ఆదాయ వాటా బిడ్డింగ్ లేదు. మార్కెటింగ్ మరియు ధరల స్వేచ్ఛ, ఏడాది పొడవునా బిడ్డింగ్, పెట్టుబడిదారులకు వారి ఆసక్తి ఉన్న బ్లాక్‌లను అన్వేషించడానికి స్వేచ్ఛ వంటి ఆకర్షణీయమైన మరియు ఉదారవాద నిబంధనలతో వస్తుంది. సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర హైడ్రోకార్బన్ వనరులను కవర్ చేయడానికి ఒకే లైసెన్స్ ఉంటుంది. మొత్తం కాంట్రాక్ట్ వ్యవధిలో అన్వేషణ అనుమతి మరియు సులభమైన, పారదర్శకమైన మరియు వేగవంతమైన బిడ్డింగ్ మరియు అవార్డింగ్ ప్రక్రియ కలిగి ఉంది.
ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఎల్) సమర్పణ కోసం XIIIవ విండో ప్రస్తుతం జూలై 31, 2022 వరకు తెరిచి ఉంది.
ఆఫర్‌లో ఉన్న బ్లాక్‌ల వివరాలు (ఓఏఎల్‌పీ బిడ్ రౌండ్-VII)
క్రమ సంఖ్య
|
బ్లాక్ పేరు
|
ప్రాంతం (చ. కి.మీ.)
|
బేసిన్
|
వర్గం
|
రకం
|
1
|
సిబి-ఓఎన్‌హెచ్‌పీ -2022/1
|
188.52
|
క్యాంబే
|
I
|
భూమి మీద
|
2
|
ఏఎస్- ఓఎన్‌హెచ్‌పీ -2022/1
|
2057.63
|
అస్సాం షెల్ఫ్
|
I
|
భూమి మీద
|
3
|
ఎంబీ- ఓఎస్‌హెచ్‌పీ -2022/1
|
6059.94
|
ముంబై ఆఫ్‌షోర్
|
I
|
లోతులేని నీటిలో
|
4
|
జీకే- ఓఎస్‌హెచ్‌పీ -2022/1
|
765.54
|
కచ్
|
II
|
లోతులేని నీటిలో
|
5
|
కేకే- ఓఎస్‌హెచ్‌పీ -2022/1
|
6717.56
|
కేరళ కొంకణ్
|
III
|
లోతులేని నీటిలో
|
6
|
బిపీ- ఓఎస్‌హెచ్‌పీ -2022/1
|
5754.92
|
బెంగాల్-పూర్నియా
|
III
|
లోతులేని నీటిలో
|
7
|
జీఎస్-డిబ్ల్యూహెచ్‌పి -2022/1
|
2742.7
|
సౌరాష్ట్ర
|
II
|
లోతైన నీటిలో
|
8
|
కేకే- డిబ్ల్యూహెచ్‌పి -2022/1
|
1112.71
|
కేరళ కొంకణ్
|
III
|
లోతైన నీటిలో
|
9
|
కేజీ-యూడిబ్ల్యూహెచ్‌పి -2022/1
|
1199.64
|
కృష్ణ-గోదావరి
|
I
|
అల్ట్రా-డీప్ వాటర్
|
10
|
ఎంఎన్- యూడిబ్ల్యూహెచ్‌పి -2022/1
|
9717.34
|
మహానది
|
II
|
అల్ట్రా-డీప్ వాటర్
|
|
మొత్తం
|
36,316.50
|
|
|
|
***
(Release ID: 1840305)
Visitor Counter : 180