రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఉత్తరప్రదేశ్‌లో జాతీయ ర‌హ‌దారి ప్రాజెక్టులు

Posted On: 07 JUL 2022 12:33PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని బుద్ధ భగవానుడి పరినిర్వాణ స్థలం ఖుషీనగర్ వద్ద రూ.42.67 కోట్ల వ్య‌యంతో 2.5 కి.మీ. పొడవుతో రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జీల‌ నిర్మాణ ప‌నుల‌ను మంజూరు చేసిన‌ట్టు తెలిపారు. ఈ ఫ్లై ఓవర్లను 18 నెలల్లో పూర్తి చేస్తామని ఆయన త‌న వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. వీటి నిర్మాణంతో దేశ, విదేశీ పర్యాటకుల రాక సులభతరం అవుతుందని, స్థానిక ప్రజల ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. రూ.2,414.67 కోట్ల మేర బడ్జెట్‌తో ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలో భారతమాల ప్రాజెక్టు కింద గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో డీఎన్‌డీ ఫరీదాబాద్ - బల్లాభాగ్ బైపాస్ కేఎంపీ లింక్ నుండి జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేని కలుపుతూ) గ్రీన్‌ఫీల్డ్ కనెక్టివిటీ నిర్మాణాన్ని చేప‌ట్టిన‌ట్టుగా శ్రీ గడ్కరీ వివ‌రించారు. మొత్తం 31.425 కి.మీ .పొడవుతో ఈ రహదారిని తాము హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో నిర్మిస్తామని తెలిపారు. నిర్మాణ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది మరియు ఇది ఆగ్రా, మథుర మరియు పశ్చిమ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ల‌ను కూడా కలుపుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.
                                                                                     

****



(Release ID: 1839967) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi , Punjabi