ఉక్కు మంత్రిత్వ శాఖ
కేంద్ర ఉక్కుమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ జ్యోతిరాదిత్య సింథియా పౌర విమానయాన శాఖకు అదనంగా కొత్త బాధ్యతలు
Posted On:
07 JUL 2022 5:23PM by PIB Hyderabad
పౌర విమానయాన శాఖకు అదనంగా కేంద్ర మంత్రిగా శ్రీ జ్యోతిరాదిత్య సింథియా గురువారం నాడు ఉద్యోగ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంత్రికి ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ సింగ్ ఆహ్వానం పలికారు.
కొత్తగా అప్పగించిన ఉక్కుమంత్రిత్వ శాఖ బాద్యతలను స్వీకరించిన తర్వాత దేశం, ప్రధానమంత్రి చూపిన విశ్వాసాన్ని, అంచనాలను నెరవేరుస్తానంటూ శ్రీ జ్యోతిరాదిత్య సింథియా తన నిబద్ధతను ప్రకటించారు. దేశ నిర్మాణంలో ఉక్కురంగం కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందేనని మంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతలో బలమైన వృద్ధి యంత్రంగా మారేందుకు ఈ రంగాన్ని అత్యధిక సంభ్యావత దిశగా తీసుకువెళ్ళడమే లక్ష్యమని చెప్పారు.
పార్లమెంటులో రాజ్యసభ సభ్యునిగా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సింథియా, పౌరవిమానయాన శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలకు కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన నాలుగు సార్లు లోక్ సభ్య సభ్యునిగా (2002-04, 2004-09, 2009-14, 2014- 19) సహా ఐదు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. తన ప్రజా సేవ ప్రయాణాన్ని శ్రీ సింథియా 2002లో ప్రారంభించారు. ఆయన 2008లో టెలికమ్యూనికేషన్స్, పోస్ట్స్ & ఐటి సహాయమంత్రిగాను, 2009లో వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రిగాను, తర్వాత 2012లో విద్యుత్తు (ఇండిపెండెంట్ చార్జ్) మంత్రిగా సేవలందించారు.
శ్రీ సింథియా అమెరికాలోని హార్వార్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనమిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీని, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబిఎ డిగ్రీని పొందారు.
***
(Release ID: 1839966)
Visitor Counter : 180