వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఎన్.ఎఫ్.ఎస్.ఎ. అమలు జనరల్ కేటగిరీ..
అగ్రశ్రేణిలో ఒడిశా, యు.పి., ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు!
ప్రత్యేక కేటగిరీలో త్రిపుర, హిమాచల్,
సిక్కింలకు టాప్ ర్యాంకులు..
‘ఆయుష్మాన్ భారత్’ కార్డు జారీకోసం
పి.డి.ఎస్.ను వినియోగించుకోవాలి..
తద్వారా ఆహార, ఆరోగ్య భద్రత కల్పించాలి
రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సూచన..
ఆగస్టు 15లోగా రాష్ట్రాలు క్లెయిములు
సమర్పించాలని వినతి
Posted On:
05 JUL 2022 6:40PM by PIB Hyderabad
‘జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.) అమలుకు సంబంధించిన రాష్ట్రాల ర్యాంకింగ్ సూచిక’లో ఒడిశా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానం సాధించింది. ఇక ఇందుకు సంబంధించి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సూచిక విభాగంలో త్రిపుర ప్రథమ ర్యాంకులో నిలవగా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం వరుసగా తదుపరి స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఇక ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డి.బి.టి.) పనితీరుకు సంబంధించి మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రా-నాగర్ హవేళీ, డామన్-డయ్యూ అగ్రస్థానంలో నిలిచింది.
జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.) అమలుకు సంబంధించిన వివిధ రాష్ట్రాల ర్యాంకింగ్ వివరాలతో కూడిన సూచిక మొదటి ఎడిషన్‌ను కేంద్ర వినియోగదార్ల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జవుళి, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు. ‘భారతదేశంలో పౌష్టికాహారం, భద్రత’ అనే అంశంపై వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార శాఖల మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గోయల్ ఈ ర్యాంకులను వెలువరించారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర వినియోగదార్ల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, ఆ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 8రాష్ట్రాల ఆహార శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా ఎన్.ఎఫ్.ఎస్.ఎ. తదితర సంస్కరణల అమలులో వివిధ రాష్ట్రాలు సాధించిన ప్రగతిని తెలియజెప్పేందుకు “ఎన్.ఎఫ్.ఎస్.ఎ. రాష్ట్రాల ర్యాంకింగ్ సూచిక” ద్వారా ప్రయత్నం జరిగింది. ఆహార భద్రతా చట్టం అమలులో వివిధ సంస్కరణలను అమలు చేయడంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టిన చర్యలను గురించి ఈ సూచిక ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఎన్.ఎఫ్.ఎస్.ఎ. చట్టం కింద చేపట్టిన ప్రజాపంపిణీ ప్రక్రియపైన మాత్రమే ప్రస్తుతానికి ఈ సూచిక ఎక్కువగా తన దృష్టిని కేంద్రీకరించింది. అయితే భవిష్యత్తులో ఆహార ధాన్యాల సేకరణ, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పి.ఎం.జ.కె.ఎ.వై) పథకంకింద ఆహార ధాన్యాల పంపిణీపై కూడా ఈ సూచిక దృష్టిపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధానంగా నిర్దేశిత లక్ష్యంతోకూడిన ప్రజాపంపిణీ వ్యవస్థ (టి.డి.పి.ఎస్.) ద్వారా ఎన్.ఎఫ్.ఎస్.ఎ. అమలుకు సంబంధించిన మూడు ముఖ్యమైన అంశాల ప్రాతిపదికపై ఈ సూచికను రూపొందించారు. అవి : i) ఎన్.ఎఫ్.ఎస్.ఎ.-వర్తింపు, లక్ష్యం, చట్టం నిబంధనల అమలు, ii) బట్వాడా వేదిక, iii) పౌష్టికాహార చర్యలు. ఇక ఎన్.ఎఫ్.ఎస్.ఎ. అమలుకు సంబంధించిన వివిద రాష్ట్రాల ర్యాంకింగ్ వివరాలను అనుబంధం-1లో చూడవచ్చు.
జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.)ను 2013వ సంవత్సరం జూలై 5వ తేదీన ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి వచ్చిన జూలై 5వ తేదీని దృష్టిలో ఉంచుకుని, ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. జాతీయ భద్రత, ఆహార భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థ అమలుకు సంబంధించిన ఉత్తమ విధానాలు, పంటల వైవిధ్యం, ఆహార భద్రత, ఆహారం నిల్వ రంగంలో సంస్కరణలు తదితర అంశాలపై చర్చించేందుకు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి గోయల్ మాట్లాడుతూ, ‘ఒక దేశం, ఒకే రేషన్ కార్డు (ఒ.ఎన్.ఒ.ఆర్.సి.)’ పథకం కింద భారతదేశం ఇపుడు వందశాతం అనుసంధానం సాధించిందన్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఇతర సంబంధి భాగస్వామ్య వర్గాలకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అయినా రేషన్ కార్డుదారుడు రేషన్ తీసుకునే స్వేచ్చను కల్పించే ప్రక్రియలో ఇప్పటివరకూ 45కోట్లమేర లావాదేవీలు జరిగాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఒకదేశం ఒకే రేషన్ కార్డు(ఒ.ఎన్.ఒ.ఆర్.సి.) పథకం,.. కోవిడ్ వైరస్ వ్యాప్తి సంక్షోభ సమయంలో వలసదారులకు, వలస కూలీలకు ఎంతగానో అండగా నిలిచిందన్నారు. డిజిటల్ పరిజ్ఞానంతో ఆధార్ అనుసంధాన ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, ఇకపై ఆయుష్మాన్ కార్డు జారీ చేసేందుకు కూడా ఈ వ్యవస్థను వినియోగిస్తామని కేంద్రమంత్రి గోయల్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డును జారీ చేసేందుకు ఇదే పద్ధతిని వినియోగిస్తున్నట్టు ఆయన ప్రస్తావించారు. పౌష్టికాహార భద్రతతో పాటుగా, ఆరోగ్య భద్రతను కూడా కల్పించేందుకు ఈ వ్యవస్థను వినియోగించే విషయం ఇతర రాష్ట్రాలు పరిశీలించాలని గోయల్ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవస్థ ద్వారా వలస కూలీల పిల్లలకు చేపట్టాల్సిన వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని అనుసంధానం చేసి, వారికి వైద్యచికిత్సా సదుపాయాలను కల్పించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాలకు కల్పించే ఆహార సబ్సిడీకి సంబంధించి 2019-20 వరకూ పెండింగ్‌లో ఉన్న క్లెయిములు సమర్పించడానికి 2022 ఆగస్టు 15 వరకూ గడవు ఉందని గోయల్ అన్నారు. బకాయిలపై వచ్చే క్లెయిములను గడువు ముగిసిన తర్వాత పరిశీలించబోమని ఆయన పునరుద్ఘాటించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పెండింగ్ బిల్లులను 2022 ఆగస్టు 15వ తేదీలోగా తగిన పత్రాలతో సమర్పిస్తే వాటిని పరిశీలిస్తామన్నారు. ఆతర్వాత 60 రోజుల్లో అంటే 2022 అక్టోబరు 15వ తేదీలోగా క్లెయిములకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. అయితే, వచ్చే మూడు నెలల్లో అంటే 2022 జూలైనుంచి సెప్టెంబరు వరకూ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బిల్లులు సమర్పిస్తే, వాటికి 2023 జనవరి నెలాఖరులోగా చెల్లింపులు జరుగుతాయని అన్నారు. క్లెయిములు సమర్పణకు అంతకు మించి సమయం తీసుకునే రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎలాంటి వడ్డీని చెల్లించబోమన్నారు. సబ్సిడీ క్లెయిముల పెండింగ్‌లో నిలిచిపోవడానికి కేంద్రంవద్ద నిధుల కొరత కారణం కాదని, ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన సమాచారం పొందుపరచకపోవడమే కారణమని గోయల్ చెప్పారు. ఇక, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తనిఖీల్లో జాప్యం గురించి సమావేశంలో పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు ప్రస్తావించగా, తనిఖీలు నిరాటంకంగా జరిగేలా కాగ్ వ్యవస్థతో సంప్రదింపులు జరపవలసిందిగా సంబంధిత అధికారులను కేంద్రమంత్రి గోయల్ ఆదేశించారు. 2020 ఏప్రిల్ తర్వాత వచ్చిన క్లెయిములన్నింటినీ డిజిటల్ పరిజ్ఞానంతో నిక్షిప్తంచేస్తామని చెప్పారు. కార్యక్రమానికి తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పశ్చమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలు హాజరు కాకపోవడం బాధాకరమన్నారు.
ఆహార భద్రత, ఆహార వ్యవస్థను వైవిధ్యంగా తీర్చిదిద్దడం, వరిపంటను మరింత పరిపుష్టం చేయడం తదితర అంశాలపై చర్చతో అంతకు ముందు సమావేశం ప్రారంభమైంది. చర్చకు సమన్వయకర్తగా బీహార్ ప్రభుత్వ ఆహార, వినియోగదార్ల హక్కుల రక్షణ శాఖ కార్యదర్శి వినయ్ కుమార్ వ్యవహరించారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీమతి మమతా శంకర్, అఖిల భారత వైద్య విజ్ఞాన అధ్యయన సంస్థ (ఎయిమ్స్) కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ కపిల్ యాదవ్, ప్రపంచ ఆహార పథకం పౌష్టికాహార విభాగం అధిపతి డాక్టర్ షరీఖా యూనుస్, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.)-జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.ఎస్. రాధిక, ఐక్యరాజ్య సమతి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఒ.) భారతీయ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ కొండారెడ్డి చవ్వా ఈ చర్చలో పాలుపంచుకున్నారు.
రాష్ట్రాల ర్యాంకింగ్: 2022
జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సాధించిన ర్యాంకులు, స్కోర్లు
రాష్ట్రం, లేదా కేంద్రపాలిత ప్రాంతం
|
సూచిక స్కోరు
|
ర్యాంకు
|
ఒడిశా
|
0.836
|
1
|
ఉత్తరప్రదేశ్
|
0.797
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
0.794
|
3
|
గుజరాత్
|
0.790
|
4
|
దాద్రా-నాగర్ హవేళీ, డామన్ డయ్యూ
|
0.787
|
5
|
మధ్యప్రదేశ్
|
0.786
|
6
|
బీహార్
|
0.783
|
7
|
కర్ణాటక
|
0.779
|
8
|
తమిళనాడు
|
0.778
|
9
|
జార్ఖండ్
|
0.754
|
10
|
కేరళ
|
0.750
|
11
|
తెలంగాణ
|
0.743
|
12
|
మహారాష్ట్ర
|
0.708
|
13
|
పశ్చిమ బెంగాల్
|
0.704
|
14
|
రాజస్థాన్
|
0.694
|
15
|
పంజాబ్
|
0.665
|
16
|
హర్యానా
|
0.661
|
17
|
ఢిల్లీ
|
0.658
|
18
|
చత్తీస్‌గఢ్
|
0.654
|
19
|
గోవా
|
0.631
|
20
|
*ఎన్.ఎఫ్.ఎస్.ఎ. అమలులో కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానాగర్ హవేళీ-డామన్, డయ్యూను ప్రత్యక్ష నగదు బదిలీ పథకం పట్టణ ప్రాంత కేటగిరీ కింద, అదే కేటగిరీలో ఇతర ప్రాంతాల కింద పరిగణించారు.
స్పెషల్ 2 కేటగిరీలకు చెందిన రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు ((ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాలు, ద్వీప ప్రాంతాలు) సాధించిన ర్యాంకులు, స్కోర్లు
రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం
|
సూచిక స్కోరు
|
ర్యాంకు
|
త్రిపుర
|
0.788
|
1
|
హిమాచల్ ప్రదేశ్
|
0.758
|
2
|
సిక్కిం
|
0.710
|
3
|
నాగాలాండ్
|
0.648
|
4
|
ఉత్తరాఖండ్
|
0.637
|
5
|
మిజోరాం
|
0.609
|
6
|
అస్సాం
|
0.604
|
7
|
అరుణాచల్ ప్రదేశ్
|
0.586
|
8
|
లక్ష ద్వీప్
|
0.568
|
9
|
జమ్ము-కాశ్మీర్
|
0.564
|
10
|
అండమాన్-నికోబార్ దీవులు
|
0.562
|
11
|
మణిపూర్
|
0.522
|
12
|
మేఘాలయ
|
0.512
|
13
|
లడఖ్
|
0.412
|
14
|
ప్రత్యక్ష నగదు బదిలీ (డి.బి.టి.) పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించే కేంద్రపాలిత ప్రాంతాలు సాధించిన ర్యాంకులు, స్కోర్లు.
కేంద్రపాలిత ప్రాంతం
|
సూచిక స్కోరు
|
|
ర్యాంకు
|
|
దాద్రా-నాగర్ హవేళీ, డామన్ డయ్యూ
|
|
0.802
|
|
1
|
పుదుచ్చేరి
|
|
0.709
|
|
2
|
చండీగఢ్
|
|
0.680
|
|
3
|
2. భౌగోళికపరమైన పరిమితుల కారణంగా సేవలను పొందుపరిచడంలో ఎదురయ్యే సంక్లిష్టత ప్రాతిపతికగా
జాతీయ స్థాయిలో సమగ్ర సూచిక 3
రాష్ట్రం, లేదా కేంద్రపాలిత ప్రాంతం
|
సూచిక స్కోరు
|
ర్యాంకు
|
ఒడిశా
|
0.836
|
1
|
ఉత్తరప్రదేశ్
|
0.797
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
0.794
|
3
|
గుజరాత్
|
0.790
|
4
|
త్రిపుర
|
0.788
|
5
|
దాద్రా-నాగర్ హవేళీ,..డామన్ డయ్యూ
|
0.787
|
6
|
మధ్యప్రదేశ్
|
0.786
|
7
|
బీహార్
|
0.783
|
8
|
కర్ణాటక
|
0.779
|
9
|
తమిళనాడు
|
0.778
|
10
|
హిమాచల్ ప్రదేశ్
|
0.758
|
11
|
జార్ఖండ్
|
0.754
|
12
|
కేరళ
|
0.750
|
13
|
తెలంగాణ
|
0.743
|
14
|
సిక్కిం
|
0.710
|
15
|
మహారాష్ట్ర
|
0.708
|
16
|
పశ్చిమ బెంగాల్
|
0.704
|
17
|
రాజస్థాన్
|
0.694
|
18
|
పంజాబ్
|
0.665
|
19
|
హర్యానా
|
0.661
|
20
|
ఢిల్లీ
|
0.658
|
21
|
చత్తీస్‌గఢ్
|
0.654
|
22
|
నాగాలాండ్
|
0.648
|
23
|
ఉత్తరాఖండ్
|
0.637
|
24
|
గోవా
|
0.631
|
25
|
మిజోరాం
|
0.609
|
26
|
అస్సాం
|
0.604
|
27
|
అరుణాచల్‌ప్రదేశ్
|
0.586
|
28
|
లక్షద్వీప్
|
0.568
|
29
|
జమ్ము-కాశ్మీర్
|
0.564
|
30
|
అండమాన్-నికోబార్ దీవులు
|
0.562
|
31
|
మణిపూర్
|
0.522
|
32
|
మేఘాలయ
|
0.512
|
33
|
లడఖ్
|
0.412
|
34
|
3. ప్రత్యక్ష నగదు బదిలీ (డి.బి.టి.) వ్యవస్థ అమలులో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్‌ను, పుదుచ్చేరిని జాతీయ స్థాయి సూచికలో పొందుపరచలేదు. స్కోర్లను లెక్కించే పద్ధతిలో వైరుధ్యమే ఇందుకు కారణం. అయితే అన్ని కేటగిరీల్లోని జాబితాల్లోనూ ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకు విడిగా స్కోర్లను కల్పించారు.
****
(Release ID: 1839498)
Visitor Counter : 714