శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ, ప్రపంచ స్థాయిలో తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాల కోసం సహకార పరిశోధనలకు ప్రోత్సాహం ఇందుకు ఐఐటీ హైదరాబాద్‌లో అటానమస్ నావిగేషన్ కోసం ' టిహాన్ ' ఒక పరీక్ష వేదికన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఐఐటీ హైదరాబాద్‌లో అటానమస్ నావిగేషన్ కోసం టిహాన్ టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అకాడెమియా, పరిశ్రమలు, ఆర్ అండ్ డీ లాబ్ ల అధిక నాణ్యత గల పరిశోధన కోసం టిహాన్ టెస్ట్‌బెడ్ ఒక ప్రత్యేకమైన వేదిక
తద్వారా భారతదేశాన్ని స్వయంప్రతిపత్త నావిగేషన్ టెక్నాలజీలలో గ్లోబల్ లీడర్‌గా చేస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

టిహాన్-ఐఐటీహెచ్ స్మార్ట్ మొబిలిటీపై కొత్త బహు-శాస్త్రాంతర 2-సంవత్సరాలఎంటెక్ ప్రోగ్రామ్‌ను అందించనుంది, ఇది దేశంలోనే మొట్టమొదటిది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 04 JUL 2022 2:31PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్, టెక్నాలజీ; ఎర్త్ సైన్సెస్ (ఇంచార్జి) సహాయ మంత్రి;పీఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణు శక్తి, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్  హైదరాబాద్‌ ఐఐటీలో  అటానమస్ నావిగేషన్ కోసం  టిహాన్  పరీక్ష వేదిక - టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించారు, జాతీయ, తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాల కోసం సహకార పరిశోధనలను ప్రోత్సహించడానికి. గ్లోబల్ స్థాయిలో ఇది పని చేస్తుంది. ఈ సందర్బంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సాంకేతిక దార్శనికత స్ఫూర్తితో టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అటానమస్ నావిగేషన్ ఫౌండేషన్ (టిహాన్) -ఐఐటీహెచ్  మొబిలిటీ సెక్టార్‌లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇప్పటికే అనేక  కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యాసంస్థలు, పరిశ్రమలు,  ఆర్ అండ్ డి ల్యాబ్‌ల  అధిక నాణ్యతా పరిశోధనల కోసం టిహాన్  టెస్ట్‌బెడ్ ఒక ప్రత్యేక వేదికను అందిస్తుందని తెలిపారు. తద్వారా స్వయంప్రతిపత్త నావిగేషన్ టెక్నాలజీలలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మారుస్తుందని ఆయన అన్నారు.

టెరెస్ట్రియల్, వైమానిక వాహనాల కోసం విశ్వసనీయ, సమర్థవంతమైన స్వయంప్రతిపత్త నావిగేషన్,  డేటా సేకరణ వ్యవస్థలను ఉపయోగించుకునే తదుపరి తరం స్మార్ట్ మొబిలిటీ టెక్నాలజీల కోసం గ్లోబల్ ప్లేయర్‌గా మారడమే  టిహన్-ఐఐటీహెచ్  లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. మానవరహిత వైమానిక వాహనాలు , రిమోట్‌గా నిర్వహించే వాహనాలు వంటి వ్యవస్థలపై టిహన్ దృష్టి సారిస్తుందని, ఐఐటీ హైదరాబాద్‌కు డిఎస్టి ఈ కార్యక్రమాన్ని మంజూరు చేసిందని ఆయన అన్నారు.

 


ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి టిహన్ స్మార్ట్ మొబిలిటీపై కొత్త ఇంటర్ డిసిప్లినరీ 2-సంవత్సరాల ఎంటెక్ ప్రోగ్రామ్‌ను రూపొందించిందని, ఇది దేశంలోనే తొలిసారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. స్వయంప్రతిపత్తి  నావిగేషన్‌ల ఈ ప్రాంతంలో వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలకు టిహన్-ఐఐటీహెచ్ మద్దతు ఇస్తుందని కూడా ఆయన తెలిపారు.

భారతదేశ చలనశీలత రంగం ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటని, టిహాన్ - ఐఐటీహెచ్ భవిష్యత్తులో సాంకేతికతను రూపొందించే  స్వయంప్రతిపత్త వాహనాలకు మూలం అవుతాయని తెలిపారు. అటానమస్ నావిగేషన్స్ (ఏరియల్ & టెరెస్ట్రియల్)పై  టిహాన్ - ఐఐటీహెచ్ టెస్ట్‌బెడ్ తదుపరి తరం స్వయంప్రతిపత్త నావిగేషన్ టెక్నాలజీలను ఖచ్చితంగా పరీక్షించడానికి అనుమతిస్తుందని చెప్పారు. వేగవంతమైన సాంకేతికత అభివృద్ధి,  ప్రపంచ మార్కెట్ చొచ్చుకుపోయేలా చేస్తుందని కేంద్ర మంత్రి  తెలిపారు. భారతదేశంలో, స్వయంప్రతిపత్తితో  వాహన పనితీరును అంచనా వేయడానికి ప్రస్తుతం అలాంటి టెస్ట్‌బెడ్ సౌకర్యం లేదని,  ఈ టిహన్ టెస్ట్‌బెడ్ అవసరం ఏర్పడుతుందని మంత్రి వివరించారు. .

 

 

మన దూరదృష్టి గల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాంకేతికంగా చాలా పురోగమించిందని, భవిష్యత్ సాంకేతికతలకు భారతదేశాన్ని అగ్రగామిగా, గమ్యస్థానంగా మార్చడానికి అనేక కార్యక్రమాలు ప్రారంభించామని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద దేశవ్యాప్తంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ ) ద్వారా 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేయడం అటువంటి అనేక కార్యక్రమాలలో ఒకటని తెలిపారు. 

ప్రత్యేకించి, టిహన్ ఈ దశాబ్దపు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక అప్లికేషన్‌ల కోసం గ్రౌండ్/సర్ఫేస్ వెహికల్స్‌ని ఉపయోగించుకునే రియల్-టైమ్ సీపీఎస్ ని అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ పరీక్షలో అల్గారిథమ్‌లు, ప్రోటోటైప్‌ల నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్‌ను అనుమతించే అనుకరణ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. అలాగే, అనేక వాస్తవ-ప్రపంచ దృశ్యాలను టెస్ట్‌బెడ్‌లో అనుకరించవచ్చు. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి  డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ టెస్టింగ్ ఫెసిలిటీలో ఎయిర్‌స్ట్రిప్, సాఫ్ట్ ల్యాండింగ్ ఏరియా, కీపింగ్‌డ్రోన్స్ కోసం హ్యాంగర్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ (జిసిఎస్), పనితీరుసమీక్ష కోసం టెలిమెట్రీ స్టేషన్ కూడా ఉన్నాయని తెలిపారు. లైడార్, రాడార్, కెమెరా మొదలైన పేలోడ్‌ల పనితీరు సమీక్ష జరుగుతుందని తెలిపారు. మానవరహిత వాహనాల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, భారతీయ దృష్టాంతంలో వివిధ అప్లికేషన్‌ల కోసం నిబంధనలు, నిర్వహణ విధానాలను తెలియజేయడంలో గణనీయంగా సహాయపడతాయని చెప్పారు. 

అటానమస్ నావిగేషన్ ఫౌండేషన్ (టిహన్)పై ఎన్ఎంఐసిపిఎస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, డిజైన్, లిబరల్ ఆర్ట్స్ లోని పరిశోధకులు సహా బహుళ-క్రమశిక్షణా చొరవ గా చేపట్టారు. సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం ద్వారా టిహన్ ఒక సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఆర్ఓ)గా గుర్తించారు. డాక్టర్ బి.వి.ఆర్. మోహన్ రెడ్డి (ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ఐఐటి హైదరాబాద్), ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి (డైరెక్టర్, ఐఐటీ  హైదరాబాద్), సీనియర్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

<><><><><> 


(Release ID: 1839098) Visitor Counter : 262


Read this release in: English , Urdu , Hindi , Manipuri