జౌళి మంత్రిత్వ శాఖ

జవుళి రంగంలో భారత్ పురోగతికి పి.ఎల్.ఐ., పి.ఎం.మిత్రా దోహదం!


ప్రపంచ జవుళి మార్కెట్లో ఇక బలమైన పోటీదారుగా
భారత్ ఆవిర్భావం: కేంద్రమంత్రి జర్దోష్

గుజరాత్‌లోని కొత్త యూనిట్‌తో ఇజ్రాయెల్‌నుంచి 100శాతం ఎఫ్.డి.ఐ., టెక్నాలజీ బదిలీ

Posted On: 30 JUN 2022 3:42PM by PIB Hyderabad

   ఉత్పాదకతతో అనుసంధానించిన ప్రోత్సాహకాల (పి.ఎల్.ఐ.) పథకానికి, పి.ఎం. మిత్రా పార్కులకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిస్పందన లభిస్తోంది. ఇజ్రాయెల్‌లోని అవ్గాల్ నాన్‌వూవెన్ కంపెనీకి చెందిన కొత్త తయారీ యూనిట్‌ను గుజరాత్‌లోని హలోల్ ప్రాంతంలో కేంద్ర జవుళి, రైల్వే శాఖ సహాయమంత్రి దర్శనా జర్దోష్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శనా జర్దోష్ మాట్లాడుతూ, మానవ తయారీ జవుళి నూలు తయారీలో భారతదేశానికి ప్రపంచ మార్కెట్‌లో 25శాతం భాగస్వామ్యం ఉందని అన్నారు. ఈ భాగస్వామ్యాన్నిపెంచేందుకు పి.ఎల్.ఐ. పథకాన్ని, పి.ఎం. మిత్రా పార్కులను ప్రారంభించినట్టు చెప్పారు. ఉత్పత్తిలో ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు, జవుళి పరిశ్రమను విస్తరింపజేసేందుకు, ప్రపంచ మార్కెట్‌లో భారతదేశం బలమైన పోటీదారుగా నిలిచేందుకు ఈ పథకాలు ఎంతగానో దోహదపడతాయని ఆమె అన్నారు. ఇంగ్లీషులో ఎఫ్ అనే అక్షరంతో మొదలయ్యే ఐదు అంశాలపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించిందన్నారు. ఫైబర్ టు ఫార్మ్ టు ఫాబ్రిక్ టు ఫ్యాషన్ టు ఫారిన్ అంటూ ఆమె ఈ పదాలను వివరించారు. వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ.) కింద ఇండోరమా సింథటిక్ కంపెనీ హలోల్ ప్లాంటులో పెట్టుబడి పెట్టిందని ఆమె చెప్పారు.

.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Y75H.jpg

  సులభతర వాణిజ్య నిర్వహణకు తగిన సానుకూల వాతావరణాన్ని కల్పించడంలో పి.ఎల్.ఐ. పథకం, పి.ఎం. మిత్రా పార్కులు ఎంతగానో దోహదపడుతున్నాయని కేంద్రమంత్రి అన్నారు. దీనితో జవుళి పరిశ్రమ దేశంలో కొత్త శిఖరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. బహుళ నమూనాల అనుసంధానం లక్ష్యంగా గతిశక్తి పేరిట  ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన మాస్టర్ ప్లాన్‌తో ప్రభుత్వ పాలనా ప్రక్రియలో నూతన అధ్యాయం మొదలు కాబోతోందని దర్శనా జర్దోష్  అన్నారు. డిజిటల్ వేదిక అయిన గతిశక్తితో రైల్వే, రహదారుల శాఖలతో సహా 16మంత్రిత్వ శాఖలు ఒక్కతాటిపైకి వస్తాయని, సమగ్ర ప్రణాళికను అమలు చేసేందుకు, మౌలిక సదుపాయాల అనుసంధాన ప్రాజెక్టులను సమన్వయంతో అమలు చేసేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.

  స్వదేశీ ఉత్పత్తులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును జర్దోష్ ప్రస్తావిస్తూ, స్థానిక, స్వదేశీ వ్యాపారులకు, జవుళి రంగానికి సంబంధించిన పనివారికి ఇది ఎంతగానో సహాయపడిందన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021SFL.jpg

  స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర భారతదేశాన్ని నిర్మించాలని, ప్రపంచ జవుళిపటంలో దేశాన్ని బలంగా నిలబెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్న కలలను సాకారం చేసే లక్ష్యంతో పి.ఎం. మిత్రా పార్కు పథకాన్ని చేపట్టినట్టు కేంద్రమంత్రి చెప్పారు. జవుళి ఉత్పాదనలకోసం,.. భారత ప్రభుత్వం ఉత్పాదనతో అనుసంధానించిన ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించిందని చెప్పారు. ఎం.ఎం.ఎఫ్. దుస్తులు, బట్టలు, సాంకేతిక జవుళి ఉత్పాదనలు లక్ష్యంగా ఈ పథకాన్ని చేపట్టినట్టు చెప్పారు. భారతదేశపు ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరింపజేసి, ఎగుతులను పెంచే లక్ష్యంతో ఐదేళ్ల వ్యవధిలో రూ. 10,683కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పథకాన్ని చేపట్టినట్టు చెప్పారు. జవుళి రంగంలో మరింత అభివృద్ధిని సాధించే లక్ష్యంతో నూలు దిగుమతిపై సుంకాన్ని కూడా ప్రభుత్వం తొలగించిందన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034C03.jpg

  భారతదేశం తొలిసారిగా 20 వర్ధమాన దేశాల కూటమి (జి-20) శిఖరాగ్ర సమావేశాన్ని కూడా నిర్వహించబోతోందని, అనేక దేశాలు ఈ శిఖరాగ్ర సమవేశంలో పాల్గొనబోతున్నాయని కేంద్రమంత్రి జర్దోష్ చెప్పారు. విద్యారంగ అంశాలు, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చంచేందుకు తగిన వేదికను ఈ శిఖరాగ్ర సమావేశం కల్పిస్తుందన్నారు. జవుళి పరిశ్రమతో అవినాభావ సంబంధం కలిగిన భారతీయ సంస్కృతిని ప్రపంచ స్థాయిలో ఎలా ముందుకు తీసుకెళ్లగలమన్న అంశాన్ని ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చంచ బోతున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు.

  కొత్తగా ప్రారంభించిన తయారీ యూనిట్‌కు 12 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని 3 హైస్పీడ్ లైన్ల వరకూ యూనిట్‌ను విస్తరించేందుకు ఇది సరిపోతుందని అన్నారు. తొలిదశలో 12 నెలల వ్యవధిలో దాదాపు రూ. 175కోట్లను పెట్టుబడిగా పెట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉత్పాదనకు ఈ ప్లాంటు సిద్ధంగా ఉందన్నారు.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004504Q.jpg

    ఇజ్రాయెల్‌నుంచి వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అదే దేశంనుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీతో ఈ నిధులను పెట్టుబడి పెట్టినట్టు  చెప్పారు. ప్రత్యేకించి నాన్ వూవెన్ వస్త్రాల ప్రత్యేకతతో కూడిన ఈ ప్లాంటు సంవత్సరానికి 10,000మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ. 200కోట్ల ఆదాయాన్ని ఆర్జించ గలదని అన్నారు. దేశంనుంచి సంవత్సరానికి 2.5కోట్ల అమెరికన్ డాలర్ల విలువైన దిగుమతులకు ప్రత్యామ్నాయంగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఈ ప్లాంటు దోహదపడుతుందన్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ పథకాలను సాకారం చేసేందుకు ఇది దోహపడుతుందన్నారు. భారతీయ హరిత నిర్మాణ మండలి (ఐ.జి.బి.సి.) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాంటు భవనాన్ని నిర్మించారని, ప్లాటినం రేటింగ్‌తో కూడిన సర్టిఫికేషన్ లక్ష్యంగా నిర్మాణం జరిగిందని చెప్పారు.

***



(Release ID: 1838491) Visitor Counter : 115