నీతి ఆయోగ్
భవిష్యత్తులో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రవేశంపై నీతి ఆయోగ్, TIFAC నివేదిక విడుదల
2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి ఆశావహ దృక్పథంతో 100% ప్రవేశించనున్నట్లు అంచనా; 2031 నాటికి 72%, 2024 నాటికి ప్రస్తుత ప్రోత్సాహకాల ఉపసంహరణ
Posted On:
29 JUN 2022 4:26PM by PIB Hyderabad
‘భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రవేశ అంచనాలపై’ నీతి ఆయోగ్ మరియు TIFAC జూన్ 28న ఒక నివేదిక సమర్పించింది.
నీతి ఆయోగ్, TIFAC పలు సాధనాలను ఉపయోగించి, దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల భవిష్యత్ ప్రవేశాలను విశ్లేషించడానికి ఎనిమిది అంశాలను పరిగణలోకి తీసకున్నారు.
2026-27 ఆర్థిక ఏడాదిలోగా, భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 100% చొచ్చుకుపోయే అవకాశం ఆశావహంగా ఉందని నివేదిక అంచనా వేసింది. మరో వివరణలో, ఈ సాంకేతికత ప్రధాన కాలంలో 2024 నాటికి ప్రస్తుత ప్రోత్సాహకాలను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నివేదిక 2031 నాటికి 72% వాహనాలు ప్రవేశించనున్నట్లు అంచనా వేసింది.
నివేదికను ప్రారంభించిన సందర్భంగా, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, “ఈ నివేదిక పరిశ్రమకు, పరిశోధకులు, విద్యావేత్తలు మరియు విధాన రూపకర్తలకు వివిధ దృశ్యాలను విశ్లేషించడానికి మరియు ప్రతిస్పందించడానికి చాలా అవసరమని తెలిపారు. నాలుగు చక్రాల వాహనాలు వంటి ఇతర విభాగాలలో కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా దీన్ని సులభంగా పునరావృతం చేయవచ్చు అని ఆయన తెలిపారు.
నివేదిక పరిగణించిన ఎనిమిది అంశాలు:
1. ఛాలెంజ్డ్ డిఫ్యూజన్
2. పనితీరు ఆధారితం
3. తక్కువ బ్యాటరీ ధర
4. టెక్నాలజీ ఆధారితం
5. ప్రోత్సాహక ఆధారితం
6. బ్యాటరీ ధర సవాలు
7. అదే పనితీరు
8. ఆశావహం
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వ్యాప్తిని ప్రభావితం చేసే మూడు ప్రధాన అంశాల ఆధారంగా భవిష్యత్ అంశాలు నిర్మించబడ్డాయి: (i) డిమాండ్ ప్రోత్సాహకాలు (ii) బ్యాటరీ ధర (iii) శ్రేణి మరియు శక్తి రెండింటిలోనూ వాహన పనితీరు.
ఇప్పటికే వ్యవస్థాపించిన వాహన తయారీ సామర్థ్యం మరియు అందుబాటులో ఉన్న ఛార్జింగ్ అవస్థాపన పరంగా పై ఎనిమిది అంశాల కోసం నాలుగు విస్తృత నిరోధక స్థాయిలు కూడా గుర్తించబడ్డాయి: (i) పూర్తి పరిమితి (వాహన ఉత్పత్తి మరియు ఛార్జింగ్ అవస్థాపన రెండూ అడ్డంకులుగా ఉంటాయి) (ii) ఉత్పత్తి పరిమితి (వాహనం మాత్రమే ఉత్పత్తి అనేది ఒక పరిమితి) (iii) ఛార్జ్ పరిమితి (ఇక్కడ ఛార్జింగ్ అవస్థాపన మాత్రమే ప్రతిబంధకంగా ఉంటుంది) (iv) పరిమితి లేదు.
ప్రధానాంశాలు:
- 'టెక్నాలజీ డ్రైవెన్' అంశంలో, ఒక పరిశోధనాభివృద్ధి కార్యక్రమం 2023–24 మరియు 2025–26 ఆర్థిక సంవత్సరం మధ్య ఏటా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పరిధి, శక్తిని 5% అదేవిధంగా 2026–2027 ఆర్థిక సంవత్సరంలో 10% పెంచగలిగితే, అప్పుడు 2031–32 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్-ద్విచక్రవాహనాల వ్యాప్తి 72%కి చేరవచ్చు. (డిమాండ్ ప్రోత్సాహకాలను పొడిగించనప్పటికీ).
- 2028–29 ఆర్థిక సంవత్సరంలో ‘ఆశావాదం’, ‘అదే పనితీరు’ మరియు ‘బ్యాటరీ కాస్ట్ ఛాలెంజ్డ్’ పరిస్థితులలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయం 220 లక్షల యూనిట్లను దాటవచ్చు. 'టెక్నాలజీ-డ్రైవెన్' అంశంలో ఇది 180 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చు. 'ఇన్సెంటివ్ డ్రైవ్' అంశంలో, 2031 ఆర్థిక ఏడాదిలో విక్రయం 55 లక్షల యూనిట్లకు మాత్రమే చేరుతుందని అంచనా.
- ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు ఛార్జింగ్ మౌలిక సదూపాయం, తగినంత నిర్మాణ సామర్థ్యం ఉన్నట్లయితే, అమ్మకాలు (చివరికి దాదాపు 250 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది) ఏదో ఒక సమయంలో 'ఆశావాదం', 'అదే పనితీరు' మరియు 'బ్యాటరీ ధర సవాలుతో కూడిన అంశాలలో ఉత్పత్తిని అధిగమించవచ్చు.
వివిధ ప్రాంతంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, తయారీ సామర్థ్యం, విధానాలు మరియు సాంకేతికత-అభివృద్ధి ప్రాధాన్యతలపై నివేదిక ముఖ్యమైన అంశాలను పొందుపర్చింది.
ప్రభుత్వ విధానాలు, మార్కెట్ తీరు మరియు సాంకేతిక అభివృద్ధి వ్యూహాల సాక్ష్యం-ఆధారంగా విశ్లేషణ కోసం ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు మరియు విద్యా/ పరిశోధనాభివృద్ధి సంస్థలు ఈ నివేదికను ఉపయోగించవచ్చు.
పూర్తి రిపోర్టును ఇక్కడ చదవండి : https://www.niti.gov.in/sites/default/files/2022-06/ForecastingPenetration-ofElectric2W_28-06.pdf
***
(Release ID: 1838283)
Visitor Counter : 204