సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇస్రో మాజీ శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించిన సమాచార, ప్రసార శాఖ
Posted On:
27 JUN 2022 12:56PM by PIB Hyderabad
త్వరలో విడుదల కానున్న 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రం ప్రత్యేక ప్రదర్శనను న్యూఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చిత్ర రచయిత, నిర్మాత, దర్శకుడు శ్రీ ఆర్. మాధవన్ నేతృత్వంలోని రాకెట్రీ బృందం హాజరైంది. తొలిసారిగా దర్శకత్వ భాద్యతలు వహించిన శ్రీ ఆర్. మాధవన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. సీబీఐ మాజీ డైరెక్టర్ శ్రీ డీఆర్ కార్తికేయన్, సీబీఐ మాజీ ఐజీ శ్రీ పీఎం నాయర్, భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు ప్రత్యేక ప్రదర్శనలో చిత్రాన్ని చూసారు. శ్రీ నంబి నారాయణన్ జీవితాన్ని ఆధారంగా రూపొందిన చిత్రం కథ , ఎడిటింగ్, నటన రంగాలలో ప్రేక్షేకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ ఆర్.మాధవన్ అంతరిక్షం, ఐటీ రంగాల్లో భారతదేశం సాధించిన సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని చిత్రం అద్దం పట్టిందని అన్నారు. శ్రీ నంబి నారాయణన్ అభివృద్ధి చేసిన 'వికాస్' ఇంజన్ ఒక్కసారి కూడా విఫలం కాలేదు. ఈ చిత్రం శ్రీ నంబి నారాయణన్‌కి ఘనమైన నివాళిగా రూపొందింది. మానవ వనరుల నైపుణ్యం మరియు శాస్త్రీయ నైపుణ్యానికి సంబంధించి భారతదేశం సాధించిన ప్రగతి సందేశాన్ని చిత్రం ప్రపంచానికి అందిస్తుంది.
రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ :
1994లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన మాజీ శాస్త్రవేత్త మరియు ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ తెరకెక్కింది. జీవితకధ ఆధారిత డ్రామా చిత్రంగా దీనిని నిర్మించారు. 75 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ ' రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' వరల్డ్ ప్రీమియర్ షో జరిగింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన సమాచార, ప్రసార శాఖ శ్రీ అపూర్వ చంద్ర సినిమా అందరినీ అలరించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా ఉందన్నారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమ విజయం కోసం తమ జీవితాంతం అంకితం చేసిన శ్రీ నంబి నారాయణన్‌తో సహా వేలాది మంది శాస్త్రవేత్తలకు ఈ చిత్రం నివాళులు అర్పిస్తుందని ఆయన తెలిపారు.
సీబీఐ మాజీ ఐజీ శ్రీ పిఎం నాయర్ మాట్లాడుతూ సినిమా వినోదాత్మకంగా, ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉందన్నారు. ఇది సైన్స్, టెక్నాలజీ మరియు భావోద్వేగాల సంపూర్ణ కలయిక అని ఆయన అన్నారు. ఈ చిత్రానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
చిత్రం నిర్మాణం భారతదేశం, జార్జియా, రష్యా, సెర్బియా మరియు ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాలలో జరిగింది. ఈ చిత్రం తమిళం, హిందీ మరియు ఆంగ్లంలో ఏకకాలంలో విడుదల అవుతుంది. తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల డబ్బింగ్ వెర్షన్‌లలో కూడా విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని 1 జూలై 2022 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
****
(Release ID: 1837395)
Visitor Counter : 133