ఉక్కు మంత్రిత్వ శాఖ

బౌద్ధ గయలోని మహాబోధి ఆలయం వ‌ద్ద‌ నిర్వ‌హించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలొ పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి


- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా 75 ప్రముఖ ప్రదేశాలలో యోగా దినోత్స‌వ వేడుక‌లు

- జీవితాన్ని ఆరోగ్యంగా మరియు ఆనందంగా మార్చడానికి యోగా సహాయపడుతుంది: శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్

Posted On: 21 JUN 2022 12:31PM by PIB Hyderabad

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2022ను 'మానవత్వం కోసం యోగా' అనే ఇతివృత్తంతో నిర్వ‌హించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుక‌లు నిర్వ‌హిస్తున్న ఈ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 75 ప్రముఖ ప్రదేశాలలో ఐడీవై నిర్వ‌హించ‌డం జ‌రిగింది.  కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ బీహార్‌లోని బౌద్ధ‌ గయలోని మహాబోధి ఆలయంలో వెయ్యి మందికి పైగా యోగా ఔత్సాహికుల‌తో క‌లిసి పాల్గొని కామన్ యోగా ప్రోటోకాల్ (సీవైసీ)ని అభ్యసించడం ద్వారా ఐడీవై వేడుకల‌ను ప్రారంభించారు. బౌద్ధ గయలో జరిగిన  యోగా కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో మనస్సు, శరీరం మరియు ఆత్మకు యోగా వ‌ల‌న క‌లిగే వివిధ ర‌కాల  ప్రయోజనాలను గురించి తెలియ‌జేశారు. మ‌న దేశ  పురాతన భారతీయ అభ్యాసాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వేడుకగా మార్చినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రికి దేశం కృతజ్ఞతలు తెలియ‌
చేస్తున్న‌ట్టుగా శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ అన్నారు. ప్ర‌ధాన మంత్రి క్రియాశీల‌క నాయ‌క‌త్వ‌లో ప్రారంభ‌మైన అనేక ర‌కాల కొత్త ప్రారంభాల‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక‌ట‌ని మంత్రి వివ‌రించారు. ఇది భార‌త విశిష్ఠ‌త‌ను కొన్ని ద‌శాబ్ధాల వ‌ర‌కు కూడా అంత‌ర్జాతీయ అవ‌నిక‌పై నిలిపి ఉంచుతుంద‌ని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బీహార్ విభాగం ఈ కార్య‌క్ర‌మానికి స‌మన్వ‌య‌
క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించింది. ఇది ఈవెంట్‌ సులభంగా విజ‌య‌వంతం అయ్యేలా చేసింది. ఈ సంస్థ‌కు చెందిన శిక్షకుడి పర్యవేక్షణలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రదర్శించబడింది.

***

 



(Release ID: 1835984) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Hindi , Tamil