సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
100 ఏళ్ల భారత స్వాతంత్య్రం సందర్భంగా దేశాన్ని ‘విశ్వ గురువు’గా మార్చేందుకు వచ్చే 25 ఏళ్లపాటు రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు దేశ యువత కీలక పాత్ర పోషించాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
ఎనిమిదేళ్ల మోదీ ప్రభుత్వం దేశంలో 'యువశక్తి' మరియు 'నారీ శక్తి'లకు కొత్త దిశను నిర్దేశించింది, వారి ఆకాంక్షలు, లక్ష్యాలు ప్రాధాన్యతనిచ్చింది: డా. జితేంద్ర సింగ్
డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్ము కశ్మీర్‌లో స్టార్టప్ మార్గాలను పొందడం కోసం యువతను ఉద్దేశించి ప్రగంగించారు. పాట్నిటాప్‌లో జరిగిన యువజన, మహిళా సదస్సులో పాల్గొన్నారు.
‘సురక్ష, సువిధ, సమ్మాన్’ అనేది మహిళల కోసం ఈ ప్రభుత్వ మంత్రం: డా.జితేంద్ర సింగ్
Posted On:
19 JUN 2022 8:31PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయమంత్రి(స్వతంత్ర) ; ఎర్త్ సైన్సెస్ సహాయమంత్రి (స్వతంత్ర); ప్రధానమంత్రి కార్యాలయ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్ముకశ్మీర్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి రంగంలో అంకర సంస్థలు భారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, జమ్మూ కశ్మీర్‌లో నూతన స్టార్టప్ మార్గాలను అన్వేషించడం కోసం యువత, పురుషులు, మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.
జమ్మూలోని పట్నిటాప్‌లో జరిగిన ఈ యువజన, మహిళా సదస్సులో మంత్రి ' యువత కోసం 8 ఏళ్ల మోదీ ప్రభుత్వం’ అనే అంశంపై ప్రసంగించారు.
డా.జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి 2015లో ఎర్రకోట నుండి “స్టార్ట్‌అప్ ఇండియా, స్టాండ్‌అప్ ఇండియా” పిలుపు కారణంగా భారతదేశంలో స్టార్టప్‌ల సంఖ్య దాదాపు 300-400 నుండి 70,000కి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇది వివిధ అంకుర సంస్థలను ప్రారంభించాలనుకునే జమ్ము కశ్మీర్ యువతకు సంతోషకరమైన విషయం. ఈ అంకుర సంస్థలు జమ్ము కశ్మీర్ తో సహా భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నిర్ణయించబోతోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు.
గత ఎనిమిదేళ్ల నుండి ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు యువతకు అనుకూలమైనవని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. గెజిటెడ్ అధికారులచే డాక్యుమెంట్ల ధృవీకరణ, నాన్ గెజిటెడ్ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేయడం, ఖాళీల భర్తీ, సింగిల్ విండో, సింగిల్ పోర్టల్, సింగిల్ ఎగ్జామ్ సిస్టమ్, ఫిర్యాదుల కోసం కంప్యూటరైజ్డ్ CPGRAMS, తక్షణ ఆర్టీఐ దాఖలు మొదలైనవి ప్రధానమైనవని తెలిపారు.
ప్రస్తుతం దేశాభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్న మహిళలకు ‘సురక్ష, సువిధ, సమ్మాన్’ ప్రభుత్వ మంత్రమని మంత్రి తెలిపారు. ఈ దేశంలో ఇటీవలి కాలంలో శాస్త్ర సాంకేతికత, సివిల్ సర్వీసెస్, మెడిసిన్, స్పేస్ టెక్నాలజీ మొదలైన అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని డా.జితేంద్రసింగ్ పేర్కొన్నారు.
డా.జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ ఎనిమిదేళ్లో దేశ సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ దేశ అభివృద్ధికి, యువత పురోగతికి ఆటంకంగా ఉన్న 1600 పాత చట్టాలను రద్దు చేయడం అని అన్నారు.
ఒకే పరీక్షా విధానంలో ఈ ఏడాది కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (క్యాట్) నిర్వహించబడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలోని యువతకు ఒక స్థాయిని అందిస్తుందన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రంతో, 22 అధికారిక భాషలలో నిర్వహించబడుతుంది. ఇలాంటి విధానం ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదని తెలిపారు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ దేశంలోని మహిళలకు ఒక వరం, వారు ఇప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా హాజరుకావచ్చు, ఎందుకంటే వారికి పరీక్షా కేంద్రాలు చాలా దగ్గరగా ఉంటాయి. భాష వారికి ఎటువంటి అడ్డంకి కాదు అని మంత్రి తెలిపారు.
CPGRAMS కంప్యూటరైజేషన్ వల్ల ఫిర్యాదుల సంఖ్య చాలా రెట్లు పెరిగిందని, ఇది సంవత్సరానికి 2 లక్షలకు మించకుండా ఉండేదని, ప్రస్తుతం 25 లక్షలకు పెరిగిందని మంత్రి తెలిపారు. ఇది ప్రజలకు ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారంపై ఉన్న నమ్మకమని తెలిపారు.
కేంద్రమంత్రి డా. జితేంద్ర సింగ్ జమ్ము కశ్మీర్లో యువత కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, CUJలో అంతరిక్ష విభాగం ఏర్పాటు, కథువాలో పారిశ్రామిక బయోటెక్ పార్క్, కథువాలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, జమ్మూలో వెదురు క్లస్టర్లు, లావెండర్ ఫెస్టివల్, డెయిరీ ఏర్పాటు, వ్యవసాయం మొదలైనవి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడి యువతకు అంకురాలు, పరిశోధనలు, స్వయం సహాయక బృందాలు మొదలైన వాటి ద్వారా ఉపాధి పరంగా ఎక్కువ అవకాశాలను లభిస్తాయని అన్నారు.
జమ్ముకశ్మీర్‌లో అంకుర సంస్థల సంస్కృతి ఇప్పుడు అభివృద్ధి చెందుతోందని, ప్రతి రంగంలో మహిళలు తమ స్టార్టప్‌లను నిర్మించడం సానుకూల విషయమని ఇతరులను స్టార్ట్‌అప్‌ల వైపు ప్రోత్సహిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
'అగ్నిపథ్' పథకం ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని, ఈ పథకం సాయుధ దళాలలో పని చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపాధి అందిస్తుందని, వారిని నైపుణ్యం, శిక్షణ పొంది తిరిగి ఇతర రంగాలలో ఉపాధి పొందేలా చేస్తుందని మంత్రి అన్నారు
మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు తమ ఆకాంక్షలు, లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తూ దేశంలో ‘యువశక్తి’, ‘నారీ శక్తి’లకు కొత్త దిశానిర్దేశం చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
జన్‌ధన్, ఎస్బీఎం, ఉజ్వల మొదలైన ప్రభుత్వ పథకాల నుండి, మహిళలలు ఉత్తమమైన వాటిని పొందడం ద్వారా, లబ్ధిదారులుగా మారడం ద్వారా వివిధ మార్గాల్లో సాధికారత పొందుతున్నారు.
డా.జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భారతదేశం ఇతర దేశాలతో పోల్చితే డెబ్బై శాతం జనాభాతో కూడిన యువ శక్తిని కలిగి ఉందన్నారు. "సేవ, సుశాసన్ & గరీబ్ కళ్యాణ్"లో యువత కీలక పాత్ర పోషిస్తారు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ముందు ఉంటారు, తద్వారా ఈ దేశ సంక్షేమంలో ప్రధాన స్థానాన్ని పొందుతారని, డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
భారతదేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే సమయంలో భారత్‌ను 'విశ్వ గురువు'గా మార్చడానికి రాబోయే 25 సంవత్సరాలకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి దేశంలోని యువత కీలక పాత్ర పోశించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
***
(Release ID: 1835443)