గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఉత్తరాఖండ్, హరిద్వార్‌లోని హర్ కి పౌరీలో ఎనిమిదవ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహించనున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్
సహాయ మంత్రులు శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ పగోడా (నామ్‌సాయ్)లో 8వ ఐడివై 22 వేడుకలకు నాయకత్వం వహిస్తుండగా, సాధ్వీ నిరంజన్ జ్యోతి లక్నోలోని రెసిడెన్సీలో జరుగనున్న సామూహిక యోగ ప్రదర్శనలో పాల్గొంటారు
Posted On:
19 JUN 2022 5:24PM by PIB Hyderabad
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోపాత్సవం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో జరుపుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడివై) దేశవ్యాప్తంగా ఉన్న 75 జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మకమైన ప్రాంతాలలో అంతర్జాతీయ వేదికపై బ్రాండ్ ఇండియా పై దృష్టిపెట్టి ఆ ప్రతిష్ఠాత్మక ప్రాంతాలను ప్రదర్శిస్తూ ఉత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ 21 జూన్ 2022న ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్రమైన హర్ కి పౌరిలో జరుగనున్న 8వ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహించనున్నారు.
అంతేకాకుండా, కేంద్ర గ్రామీణాభివృద్ధి, స్టీల్ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ పగోడా (నామ్‌సాయ్)లో నాయకత్వం వహించనుండగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి లక్నోలోని రెసిడెన్సీలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మార్గదర్శనం చేస్తారు.
అంతర్జాతీయ యోగదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నాయకత్వంలో నిర్వహించనున్న సామూహిక యోగ ప్రదర్శన ప్రధాన కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్న కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్ నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దేశానికి మార్గదర్శనం చేస్తారు.
***
(Release ID: 1835387)
Visitor Counter : 127