బొగ్గు మంత్రిత్వ శాఖ
దేశంలో 16 జూన్, 2022 నాటికి 28% పెరిగిన బొగ్గు ఉత్పత్తి
మే 31,2022-23 నాటికి 138 టన్నులకు చేరిన మొత్తం బొగ్గు ఉత్పత్తి
బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు అవసరాల మేరకు బొగ్గు సరఫరా
24 రోజుల బొగ్గు అవసరాలకు సరిపడే విధంగా వివిధ బొగ్గు గనుల్లో 52 మిలియన్ టన్నుల వరకు ఉన్న నిల్వలు
బొగ్గు దిగుమతి కోసం స్వల్ప, దీర్ఘ కాల టెండర్లు పిలిచిన కోల్ ఇండియా లిమిటెడ్
Posted On:
19 JUN 2022 10:56AM by PIB Hyderabad
దేశంలో 2021-22 లో రికార్డు స్థాయిలో 777 మిలియన్ టన్నుల మేరకు జరిగిన బొగ్గు ఉత్పత్తిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పెరుగుదల నమోదు చేసింది. 2022-23 లో 2022 మే 31 నాటికి బొగ్గు ఉత్పత్తి 137.85 మిలియన్ టన్నులకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి బొగ్గు ఉత్పత్తి 104.83 మిలియన్ టన్నులుగా ఉంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి 28.6% మేరకు పెరిగింది. 2022 జూన్ నెలలో కూడా బొగ్గు ఉత్పత్తి పెరిగింది. గత ఏడాది జూన్ నెలలో జరిగిన బొగ్గు ఉత్పత్తి తో పోల్చి చూసే ఈ ఏడాది జూన్ నెలలో( 2022 జూన్ 16 నాటికి) కోల్ ఇండియా లిమిటెడ్ 28% బొగ్గును అధికంగా ఉత్పత్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 911 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. గత ఏడాది జరిగిన బొగ్గు ఉత్పత్తి కంటే ఇది 17.2% ఎక్కువ.
బొగ్గు ఆధారంగా పనిచేస్తున్న విద్యుత్ కేంద్రాలు (డీసీబీ) వినియోగిస్తున్న స్వదేశీ బొగ్గులో కలిపి వినియోగించడానికి విదేశాల దిగుమతి చేసుకుంటున్న బొగ్గు 8.11 మిలియన్ టన్నుల వరకు తగ్గింది. ఇంత తక్కువ మొత్తంలో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి కావడం గత ఎనిమిది సంవత్సరాలలో ఇదే తొలిసారి. స్వదేశంలో బొగ్గు ఉత్పత్తి పెరిగి అవసరాల మేరకు బొగ్గు సరఫరా కావడం వల్ల ఇది సాధ్యమయ్యింది.
విదేశీ బొగ్గుపై ఆధారపడి పనిచేస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు (ఐసీబీ) తమ అవసరాల కోసం 2016-17 నుంచి 2019-20 వరకు ఏడాదికి 45 మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు దిగుమతి చేసుకున్నాయి. అయితే, 2021-22 లో ఐసీబీలు అతి తక్కువ మొత్తంలో బొగ్గు దిగుమతి చేసుకోవడం జరిగింది. 2021-22 లో ఈ కేంద్రాలు దిగుమతి చేసుకున్న బొగ్గు దిగుమతులు 18. మిలియన్ టన్నుల వరకు ఉన్నాయి. ఐసీబీల ఉత్పత్తి 2021-22 లో 39.82 బియూ లకు తగ్గింది. గతంలో ఈ కేంద్రాల్లో ఉత్పత్తి 100 బియూ లకు మించి జరిగింది. విదేశీ బొగ్గు ధర ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది కూడా వీటి ఉత్పత్తి తక్కువగా ఉంది.
గత ఐదేళ్లలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వార్షిక వృద్ధి( CAGR) 1.82% గా నమోదయింది. అయితే విద్యుత్ రంగానికి దేశీయ బొగ్గు సరఫరా మెరుగుపడటంతో మొత్తం వార్షిక వృద్ధి రేటు 3.26% కి చేరింది. బొగ్గు ఆధారిత విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా విద్యుత్ ఉత్పత్తికి మించి జరిగింది. ప్రస్తుత సంవత్సరం కూడా పరిస్థితి అదే విధంగా కొనసాగుతోంది.
ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్‌ఎస్‌ఎ) కింద చేయాల్సిన సరఫరా కంటే ఎక్కువగా బొగ్గు 2021-22 సంవత్సరంలో సిఐఎల్ నుంచి డిసిబి పవర్ ప్లాంట్‌లకు సరఫరా జరిగింది. సిఐఎల్ 540 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసింది. దీనిలో ఎఫ్‌ఎస్‌ఎ కింద 483 మిలియన్ టన్నుల బొగ్గు గా సరఫరా అయ్యింది. 2021-22 సంవత్సరంలో డిసిబి పవర్ ప్లాంట్లు 69% పిఎల్ఎఫ్ వద్ద పనిచేయడానికి ఈ బొగ్గు సరిపోతుంది. అయితే, డిసిబి పవర్ ప్లాంట్లు 61.3% పిఎల్ఎఫ్ వద్ద ఉత్పత్తి సాగిస్తున్నాయి. పవర్ ప్లాంట్లు 2022-23 సంవత్సరంలో ఎఫ్‌ఎస్‌ఎ ప్రకారం సిఐఎల్ తన అనుసంధానిత పవర్ ప్లాంట్‌లకు (85% పిఎల్ఎఫ్ వద్ద) 120.67 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. అయితే, సిఐఎల్ 129.58 మిలియన్ టన్నుల బొగ్గు (16.06.22 వరకు) సరఫరా చేసింది. 85% పిఎల్ఎఫ్ వద్ద పని చేస్తే ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన సరఫరా కంటే ఈ సరఫరా 7.4% ఎక్కువ. దాదాపు 70% పిఎల్ఎఫ్ వద్ద ఉత్పత్తి జరిగినప్పుడు అవసరమయ్యే బొగ్గు కంటే ఎఫ్‌ఎస్‌ఎ కింద అనుబంధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సిఐఎల్ నుంచి సరఫరా అవుతున్న బొగ్గు అవసరాల కంటే 30.4% ఎక్కువగా ఉంది.
ఉత్పత్తితో పాటు సిఐఎల్ నుంచి విద్యుత్ రంగానికి రవాణా అవుతున్న రైళ్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. విద్యుత్ రంగానికి 2020-21లో రోజుకు 215.8 రైళ్లలో బొగ్గు సరఫరా అయ్యేది. 2021-22లోఈ సంఖ్య 26% వృద్ధిని నమోదు చేసి రోజుకు 271.9కి పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో (16 జూన్ 2022 వరకు ) విద్యుత్ రంగానికి సిఐఎల్ సరఫరా చేస్తున్న రైళ్ల సంఖ్య గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 25% పెరిగింది. అదే సమయంలో, బొగ్గు నిల్వలు సుదూర ప్లాంట్ల కంటే పిట్ హెడ్ పవర్ ప్లాంట్ల వద్ద ఎక్కువగా ఉన్నాయి.
జూన్ 2022 నెలలో (జూన్ 16, 2022 వరకు) డిసిబి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో రికార్డు స్థాయిలో రోజుకు 3.3 బియూ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. . ఈ కాలంలో డిసిబి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గలేదు. బొగ్గు నిల్వలు 21.85 మిలియన్ టన్నుల (01.06.22 నాటికి) నుంచి 22.64 మిలియన్ టన్నులకు (16.06.22 నాటికి)పెరిగింది. ఇది వేగంగా సాగుతున్న బొగ్గు ఉత్పత్తిని మరియు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా తగినంత సరఫరాను ప్రతిబింబిస్తుంది. బొగ్గు నిల్వ 10 రోజుల కంటే ఎక్కువ అవసరాలకు సరిపోతుంది.
16 జూన్ 22 నాటికి వివిధ దేశీయ బొగ్గు గనులలో 52మిలియన్ టన్నులకు మించి బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇది విద్యుత్ ప్లాంట్ల 24 రోజుల అవసరాలకు సరిపోతుంది. దీనికి అదనంగా, వివిధ గూడ్‌షెడ్ సైడింగ్‌లు, ప్రైవేట్ వాషరీస్ మరియు పోర్ట్‌లలో సుమారు 4.5 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు విద్యుత్ ప్లాంట్‌లకు రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
వర్షాకాలంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వరదలు మరియు కన్వేయర్ వ్యవస్థలో తేమ చేరడం వంటి కారణాల వల్ల నిల్వ కేంద్రాలకు బొగ్గు రవాణా చేయడంలో సమస్యలను గనులు ఎదుర్కొంటాయి. రెండవ త్రైమాసికం ముగిసే సమయానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు సిఐఎల్ గనుల వద్ద బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. దేశీయ బొగ్గు ఉత్పత్తి సమస్య కాదు. ఎఫ్‌ఎస్‌ఎ అవసరాలకు మించి సిఐఎల్ నుంచి బొగ్గు సరఫరా ఎక్కువగా జరిగింది . అయితే, ఆసక్తిగల విద్యుత్ రంగ వినియోగదారుల (రాష్ట్ర జెన్కోలు మరియు ఐపీపి లు) బొగ్గును దిగుమతి చేసుకోవడానికి సిఐఎల్ అంగీకరించి మూడు నెలల్లో 2.4 మిలియన్ టన్నుల సరఫరా కోసం స్వల్పకాలిక టెండర్‌ను, ఏడాది కాలంలో ఆరు మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు దిగుమతి కోసం రెండు దీర్ఘకాలిక టెండర్‌లను సిఐఎల్ విడుదల చేసింది.
ఇంధనం మరియుపీపీఏ లకు సంబంధించిన సమస్యల కారణంగా ఐసిబి పవర్ ప్లాంట్లు మరియు గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు తక్కువ సామర్థ్యాలతో పనిచేస్తున్నాయి. అయినప్పటికీ, సిఐఎల్, ఇతర దేశీయ వనరుల నుంచి సరఫరా అయ్యే వర్షాకాలంలో విద్యుత్ ప్లాంట్‌లలో తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుతుంది.
***
(Release ID: 1835366)
Visitor Counter : 217