వ్యవసాయ మంత్రిత్వ శాఖ

బీహార్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యంలో జాతీయ స‌ద‌స్సును వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించిన కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ .


శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం గ‌త 8 సంవ‌త్స‌రాల‌లో వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి మున్నెన్న‌డూ లేనంత ప‌ని చేయ‌డం జ‌రిగింది - శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌.

వ్య‌వ‌సాయ రంగం నిల‌దొక్కుకునేలా చేయ‌డంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌కు ప్రాధాన్య‌త‌ ఇవ్వ‌డం జ‌రుగుతుందిః శ్రీ తోమ‌ర్‌

Posted On: 18 JUN 2022 3:12PM by PIB Hyderabad

కేంద్ర వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ఈ రోజు సాబోర్ లోని బీహార్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యంలో నిర్వ‌హించిన జాతీయ స‌ద‌స్సును వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. ఈ స‌ద‌స్సునుద్దేశించి ప్ర‌సంగిస్తూ శ్రీ తోమ‌ర్‌, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో , కేంద్ర ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాలు, కార్యక్ర‌మాల ద్వారా వ్య‌వ‌సాయ రంగప్రోత్సాహ‌కానికి కృషి చేస్తున్న‌ద‌న్నారు.  ఇది వ్య‌వ‌సాయ రంగంపై ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని అలాగే రైతుల రాబ‌డి పెంచుతున్న‌ద‌ని అన్నారు.
గ‌త 8 సంవ‌త్స‌రాల‌లో దేశంలొని వ్య‌వ‌సాయ రంగంలో మున్నెన్నడూ లేని స్థాయిలో ప‌నులు జ‌రిగాయ‌ని, వ్య‌వ‌సాయ‌రంగం నిల‌దొక్కుకునేందుకు ప్ర‌స్తుత స‌వాళ్ల‌ను ప్రాధాన్య‌తా ప్రాతిప‌దిక‌న ఎదుర్కోవ‌డం జ‌రుగుతోంద‌న్నారు.

సుస్థిర వ్య‌వ‌సాయం కోసం పౌష్టిక యాజ‌మాన్య వ్యూహాల‌లో ఇటీవ‌లి ప‌రిణామాలు :   భార‌తీయ నేప‌థ్యం అనే అంశంపై జ‌రిగిన స‌ద‌స్సులో మంత్రి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా పాల్గొన్నారు. రైతుల‌కు ఆదాయ మ‌ద్ద‌తు నిచ్చేందుకు గ‌ల ఏ అవ‌కాశాన్నీ కేంద్ర ప్ర‌భుత్వం విడిచిపెట్ట‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 11.5 కోట్ల మంది రైతుల ఖాతాల‌లో ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద రూ 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను డిపాజిట్ చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు..

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మొదీ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం తీసుకున్న ఈ చ‌ర్య ప్ర‌పంచంలోనే అతిపెద్ద కార్య‌క్ర‌మ‌మ‌ని అన్నారు.స్పెష‌ల్ పాకేజ్ కింద 1.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల స‌దుపాయాల‌ను వ్య‌వ‌సాయ రంగంలో అందుబాటులోకి తీసుకురావ‌డం జ‌రుగుతోంద‌ని , అలాగే 1 ల‌క్ష కోట్ల రూపాయ‌ల వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల నిధి ప్యాకేజ్ ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న రైతు స్నేహ‌పూర్వ‌క విధానాలు, రైతులు , శాస్త్ర‌వేత్త‌లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం వ‌ల్ల వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల విష‌యంలో ఇండియా ఇవాళ సుసంప‌న్న దేశంగా ఉంద‌ని , అన‌నుకూల ప‌రస్థితుల‌లో సైతం ఇండియా ఇత‌ర దేశాల‌కు ఆహార ధాన్యాలు అందించింద‌ని అన్నారు. చాలా వ‌ర‌కు వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల విష‌యంలో ఇండియా  ప్ర‌పంచంలోనే మొద‌టి లేదా రెండో స్థానంలో ఉంద‌ని ఆయ‌న అన్నారు. 3.75 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల వ్య‌వ‌సాయ ఉత్పత్తుల‌ను ఎగుమ‌తి చేయ‌డం ఒక రికార్డు గా మంత్రి చెప్పారు.

వ్య‌వ‌సాయ రంగంలో సాంకేతిక‌ను గ‌రిష్ఠ‌స్థాయిలో ఉప‌యోగించుకోవ‌డానికి, గిట్టుబాటు ల‌భించే పంట‌లు వేసేలా ఆక‌ర్షించ‌డానికి, వ్య‌వ‌సాయ ఖ‌ర్చులు త‌గ్గించ‌డానికి, రైతుల‌కు తాము పండించిన పంట‌కు మంచి ధ‌ర వ‌చ్చేలా చేయ‌డానికి, ఎరువుల‌పై ఆధార‌ప‌డ‌డం త‌గ్గించేలా చూడ‌డానికి, భూసార ప‌రిర‌క్ష‌ణ‌కు ప్రోత్స‌హించ‌డానికి, వ్య‌వ‌సాయ రంగంలో విద్యుత్ , నీటిని పొదుపు చేయ‌డానికి ఉత్పాద‌క‌త  పెంచ‌డానికి కృషి జ‌ర‌గాల‌ని శ్రీ తోమ‌ర్ అన్నారు. ఈ దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌తో సన్నిహితంగా క‌లిసి ప‌నిచేస్తున్న‌ద‌న్నారు.  ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ (ఐసిఎఆర్‌) , వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాలు ఇత‌ర సంస్థ‌ల‌తో క‌ల‌సి వేగ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ద‌ని అన్నారు. బీహౄర్ వ్య‌వ‌సాయ ప్రాధాన్య‌త గ‌ల రాష్ట్ర‌మ‌ని, ఈ రాష్ట్రానికి చెందిన 70 శాతం ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి ఉన్నార‌న్నారు. వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌త విష‌యంలో బీహార్ అద్భుత ప‌నితీరు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ద‌ని కూడా మంత్రి అన్నారు. ఎన్నో పంట ర‌కాలు ఇక్క‌డ అభివృద్ధి చేశార‌న్నారు. దీన‌వ‌ల్ల రాష్ట్రం మంచి రాబ‌డి పొంద‌డ‌మే కాక‌, దేశ వ్య‌వ‌సాయ ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డుతున్న‌ద‌న్నారు. పోష‌క విలువ‌లు గ‌లిగిన పంట‌లు ప్ర‌స్తుత అవ‌స‌ర‌మ‌ని చెబుతూ ఈ దిశ‌గా ఈ స‌ద‌స్సు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌ని అన్నారు.

అంత‌కు ముందు వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ అరుణ్ కుమార్ యూనివ‌ర్సిటీ ప్ర‌గ‌తికి సంబంధించిన నివేదిక‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌చురించిన సావ‌నీర్‌ను అతిథులు ఆవిష్క‌రించారు. 250 మందికి పైగా శాస్త్ర‌వేత్త‌లు, ప‌రిశోధ‌కులు, అధ్యాప‌కులు రెండు రోజుల పాటు నిర్వ‌హిస్తున్న ఈ స‌ద‌స్సులో పాల్గొంటున్నారు. ఈ స‌ద‌స్సు అభిప్రాయాల‌ను కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు విశ్వ‌విద్యాల‌యం స‌మ‌ర్పించ‌నుంది. ఈ నివేదిక ఆధారంగా సుస్థిర వ్య‌వ‌సాయానికి విశ్వ‌విద్యాల‌యం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుంది.

***



(Release ID: 1835235) Visitor Counter : 142


Read this release in: Punjabi , English , Urdu , Hindi