యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

KIYG క్రీడా పోటీల్లో పతకాలు గెలుచుకున్న ముగ్గురు కాయకష్టం చేసే కార్మికుల కుమార్తెలు, అందరి హృదయాలను గెలుచుకున్న వైనం


Posted On: 08 JUN 2022 6:24PM by PIB Hyderabad

క్రీడలలో రాణించాలనే ఏకైక  తీవ్ర కాంక్షతో పాటు,  ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ లో ఆంధ్రప్రదేశ్ తొలి పతక విజేతలుగా నిలిచిన  రజిత, పల్లవి,  శిరీషలు  విజేతలుగా నిలవడం తో పాటు  వీరి మధ్య  మరొక సారూప్యం  ఉంది.

 వారు ఒక్కొక్కరు హృదయ విదారక  పేదరికం నుంచి పరిస్థితులకు ఎదురొడ్డి ఇక్కడి వరకు  వచ్చారు.

 తమ ఆకాంక్షలను  సజీవంగా ఉంచుకోవడానికి కష్టపడటం పక్కన పెడితే, వారిని కన్న తల్లిదండ్రులు ఇప్పటికీ  తమ చిన్న చిన్న ఇళ్ళ లో  పొయ్యి వెలిగించడానికి  ఏళ్ల తరబడి  శ్రమిస్తునే  ఉన్నారు.

 మంగళవారం సాయంత్రం, ఆంధ్రప్రదేశ్   పతకాల వెల్లువ పొందిన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి జూన్ గల్యోట్ పట్టపగ్గాలు లేని సంతోషాన్ని పొందింది. "మా శిబిరం మొత్తం చాలా ఉత్సాహంగా ఉంది, మేము సాయంత్రం అంతా కలసి  వేడుకలు చేసుకున్నాం."అని  ఆమె చెప్పారు

 బాలికల 400 మీటర్ల పరుగులో రజిత స్వర్ణం సాధించగా, శిరీష కాంస్యం సాధించింది. పల్లవి 64 కేజీల  వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఏపీకి తొలి స్వర్ణం అందించింది.

“వారిలో ఒకొక్కరికి చెప్పడానికి ఇబ్బంది పడేంత విచారకరమైన కథ ఉంది. వారిది అట్టడుగు స్థాయి   పేదరిక జీవనం,” అని  క్రీడా  అధికారిని జూన్ విశ్లేషణ చేస్తూ . "ఇది అథ్లెటిక్స్‌ లో మాత్రమే జరిగే వింత  కాదు. ఇది అనేక ఇతర క్రీడలలో ఇదే కథ పునరావృతమౌతుంది." అని అన్నారు

తేలిక పరచే  ఏకైక అంశం ఏమిటంటే, ఈ ముగ్గురి వంటి ప్రతిభావంతులైన అమ్మాయిలు  వారి బాధలను మరచి క్రీడల మీద దృష్టి కేంద్రీకరించడానికి ఈ సందర్భం  ఒక అవకాశాన్ని అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఖేలో ఇండియా గేమ్స్ లో  అటువంటి మట్టిలో మాణిక్యాలను అసంఖ్యాకంగా వెలుగు చూశాయి. అలాంటి  వారికి  తగిన సహాయం  స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు, వాటిలో కొందరు అత్యున్నత స్థాయికి ఎదగడానికి కూడా ఈ ఆలంబన  సహాయపడింది.

 కోయ తెగకు చెందిన రజిత చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి భద్రమ్మ ఐదుగురు పిల్లలను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని ఒక మారుమూల  గ్రామమైన రామచంద్రపురంలో సాకాల్సి వచ్చింది.

 "ఆమె ఉదయం నుండి రాత్రి వరకు కూలీగా పనిచేసింది, కానీ ఇప్పటికీ మా అందరికీ తిండికి సరిపడా సంపాదించలేక పోతుంది. కిరోసిన్ సైతం  కొనుక్కోలేని కారణంగా మేమందరం ఎండబెట్టిన చెట్ల ఆకులు  కొమ్మలను సేకరించి, పొయ్యి వెలిగించుకుని మా ఆకలి  మంటలను ఆరబెట్టుకున్నాం, ”అని ఉద్వేగభరితంగా రజిత వెల్లడించారు. "ఇది మనుగడ కోసం రోజువారీ పోరాటం. కానీ నా తల్లి, నిజమైన యోధురాలిగా, నన్ను తీర్చిదిద్దింది , ”అన్నారామె.

 అయితే, అదృష్టవశాత్తూ, క్రీడలలో అవకాశం  అనుకోకుండా వచ్చింది. పరుగుపందాలలో ఆమె ప్రతిభను SAAP కోచ్‌లు వంశీ సాయి కిరణ్  కృష్ణ మోహన్ గుర్తించి ఆమె నైపుణ్యాలను మెరుగుపరిచారు. ఆ తర్వాత ఆమె టెన్విక్-SAAP ప్రాయోజిత శిబిరానికి ఎంపికైంది, అక్కడ ఆమెకు మైక్ రస్సెల్ వద్ద శిక్షణ పొందే అవకాశం లభించింది.

 వెంటనే రజిత జీవితం మారిపోయింది. రాష్ట్రస్థాయి ఈవెంట్లలో పాల్గొని పతకాలు సాధించడం ప్రారంభించింది. గౌహతిలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఆమె ప్రతిభ కనపరచింది, అక్కడ ఆమె మరో కీలక పతకాన్ని గెలుచుకుంది. ఆమె ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌బృందం లో భాగస్వామి.  ఇటీవలే నైరోబీలో పాల్గొన్న  భారత రిలే జట్టులో సభ్యురాలు.

 ఆమె ఇప్పుడు హైదరాబాద్‌లో ద్రోణాచార్య కోచ్ నాగపురి రమేష్ వద్ద శిక్షణ పొందుతుంది, కానీ అది ఆమె స్వంత ఖర్చుతో. దానికి తోడుగా  “నాగేంద్ర అనే పెద్దమనసున్న వ్యక్తి నేను క్రీడల్లో  కొనసాగడానికి నెలకు రూ. 10,000 విరాళంగా ఇస్తున్నారు . నేను ఇంటి అద్దెగా 6,000 చెల్లిస్తున్నాను,    మిగిలినది నా ఆహారానికి వెచ్చిస్తాను . ఇది ఒక పోరాటం, ” అని ఆమె చెప్పింది.

  శ్రీకాకుళం మందరాడ గ్రామానికి చెందిన శిరీషది ఎవరికైనా  కంటతడి పెట్టించే మరో కథ

 ఆమె తండ్రి కృష్ణం నాయుడు, కూలీ, 2019లో ఘోర ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుండి, ఆమె తల్లి గౌరీ కూలీ పనిని చేపట్టింది.

 “నా తండ్రి అనుకోకుండా  మరణించినప్పటికీ, నేను అథ్లెట్‌గా నా కెరీర్‌ను కొనసాగించాలని మా అమ్మ పట్టుబట్టింది. చాలా కాలంగా రెండు పూటల భోజనం దొరికితే అది మాకు గొప్ప విషయం ’’ అని కాంస్య పతకం సాధించాక కన్నీటి పర్యంతమై  శిరీష వెల్లడించింది.

  శిరీషకు తగ్గట్టు  14 సంవత్సరాల వయస్సులో అథ్లెటిక్స్‌ లో పాల్గొనమని ఆమె తండ్రి ప్రోత్సహించారు. "మొదటి ఖేలో గేమ్స్‌ లో అంత మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయిన తర్వాత ఖేలో ఇండియా గేమ్స్‌ లో ఇది నా మొదటి పతకం." అని ఆమె చెప్పింది.

 2018లో తిరుపతిలో జరిగిన జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుపొందడం తన తండ్రి కనీసం చూసినందుకు ఆమె తన అదృష్టానికి  కృతజ్ఞతలు చెప్పింది. అతని కళ్లలోని ఆనందం నన్ను మరింత రాణించేలా చేసింది,” అని శిరీష తండ్రిని తలచుకుంది. ప్రస్తుతం SAI అకాడమీ హైదరాబాద్‌లో  ట్రైనీగా, రమేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నది.

 పద్దెనిమిదేళ్ల ఎస్ పల్లవి కష్టాలపై విజయం సాధించిన ఇంకొక  కథ. ఈమె  వెయిట్ లిఫ్టింగ్‌లో 64 కిలోల బాలికల బంగారు పతక విజేత, ఈమె  విజయనగరం జిల్లా (ఆంధ్రప్రదేశ్) కొండవెలగాడకు చెందిన తాపీ మేస్త్రీ   కుమార్తె. ఆమె తండ్రి లక్ష్మీ నాయుడు,  తన కుమార్తె ఆహారం కోసం అదనపు గంటలు శ్రమ పడితే గాని ఈ మాత్రం అవకాశం పొందడం సాధ్యం తనకు  కాలేదు.

 “నా కోసం మా నాన్న ఏం త్యాగం చేశారో చెప్పలేను. ఈ రోజు, నేను ఆయన గౌరవార్థం ఈ పతకాన్ని నాన్నకి అంకితం చేస్తున్నాను, ”అని ఆమె చెప్పింది.

 ఆంధ్ర ప్రదేశ్ కి  చెందిన ఈ ముగ్గురు అమ్మాయిలు పరిస్థితులకు ఎదురునిలిచి గెలిచిన అసలు సిసలు విజేతలు.

***



(Release ID: 1834734) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Hindi