ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్ పాలసీ ముసాయిదాపై పబ్లిక్ కన్సల్టేషన్


భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గమనానికి దోహదపడే విధంగా డేటా గవర్నెన్స్ కోసం ఆధునిక ఫ్రేమ్వర్క్ను రూపొందించడం నరేంద్ర మోడీ ప్రభుత్వ దార్శనికత:
రాజీవ్ చంద్రశేఖర్

విస్తృత భాగస్వాముల నుండి విస్తృత ఇన్ పుట్ లతో విధానాలను అభివృద్ధి చేయడానికి ప్రజా సంప్రదింపులను అత్యంత సమర్థవంతమైన మార్గంగా ప్రధాన మంత్రి ప్రోత్సహిస్తున్నారు: రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 16 JUN 2022 3:25PM by PIB Hyderabad

నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్ పాలసీ ముసాయిదాపై 2022 జూన్ 14న న్యూ ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో ఒక భాగస్వామ్య సమావేశం జరిగింది.

పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్య, మేధో, అంతర్జాతీయ అలయెన్స్ , వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారుల నుండి 250 మంది వాటాదారులు ఇందులో పాల్గొన్నారు.

భారతదేశంలో ప్రభుత్వం, నాగ్రిక్‌ల వేగవంతమైన డిజిటలైజేషన్‌ను ,డేటా వాల్యూమ్‌లలో తదుపరి పెరుగుదల,  ఈ డేటా సంభావ్యతను ఉపయోగించుకోవడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ ఆవశ్యకత ను సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గమనానికి దోహదపడే విధంగా డేటా గవర్నెన్స్ కోసం ఆధునిక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం నరేంద్ర మోడీ ప్రభుత్వ దార్శనికత అని ఆయన పేర్కొన్నారు.

ఏఐ, డేటా ఆధారిత పరిశోధన, స్టార్టప్ ఎకోసిస్టమ్ ను  ఉత్ప్రేరకం చేస్తూ ప్రభుత్వ డేటా సేకరణ, నిర్వహణను ప్రామాణీకరించడమే ఎన్ డి జి ఎఫ్ పి లక్ష్యమని తెలిపారు.

మొత్తం మీద డేటా ఎకోసిస్టమ్ లో పాల్గొనడంలో ప్రైవేట్ వాటాదారుల ప్రాముఖ్యతను కూడా సహాయ మంత్రి వివరించారు.ఈ విధానం రూపకల్పన, దాని అమలు దిశగా సహకార , భాగస్వామ్య విధానాన్ని నిర్ధారించడంపై ప్రభుత్వం దృష్టిని నొక్కిచెప్పారు.విస్తృత భాగస్వాముల నుండి సమగ్ర సమాచారం తో విధానాలను అభివృద్ధి చేయడానికి ప్రజా సంప్రదింపులను ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రభావవంతమైన మార్గంగా ప్రోత్సహిస్తున్నారు. భారత అంతర్జాతీయ పోటీ దాయక డిజిటల్ ఎకానమీ,  స్టార్టప్‌ల కోసం ప్రపంచ ప్రామాణిక  చట్టాలను  తీసుకురావడానికి ఎలక్ట్రానిక్స్ , ఐటి మంత్రిత్వ శాఖ పబ్లిక్ కన్సల్టేషన్‌ను అనుసరిస్తుంది” అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ, డేటా గవర్నెన్స్ పట్ల పూర్తి-ప్రభుత్వ విధానాన్ని అనుసరించడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పే ముసాయిదా నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్ పాలసీ సంక్షిప్త స్వరూపం గురించి వివరించారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్, ముసాయిదా నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్ పాలసీ కీలక నిబంధనల గురించి సవిస్తరమైన అభిప్రాయాన్ని అందించారు.

ముసాయిదా విధానం , అది రూపొందిన బలమైన పునాది- ప్రభుత్వ డేటా భాగస్వామ్యం కోసం సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను మెరుగుపరచడం, డిజైన్ ద్వారా గోప్యత మరియు భద్రతకు సంబంధించిన సూత్రాలను ప్రచారం చేయడం, అనామక సాధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం,  ప్రభుత్వ , ప్రైవేట్ రంగాలు రెండింటికీ వ్యక్తిగతేతర డేటాకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడం పై దృష్టి పెడుతుంది.

 

ఐడిఎంఓ పనితీరును తెలియజేసే సంప్రదింపుల ప్రక్రియ కొనసాగింపు, ఇంటిగ్రేటెడ్ డేటాసెట్ల భవిష్యత్తు సంభావ్యతను ఉపయోగించుకునే నిబంధనలు , ప్రైవేట్ భాగస్వామ్య స్వభావం పై వివరణలు వంటి వివిధ సూచనలు ఉన్నాయి.ఇంకా, ఇండియా డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ కార్యకలాపాలపై సమాచారం , స్పష్టత, ఏ ఐ ఆవిష్కరణ కోసం అనాటెటెడ్ డేటాసెట్లకు ప్రాప్యత , డేటా సామర్థ్యాన్ని నిర్మించడానికి ప్రైవేట్ రంగం , సామాజిక ప్రభావ సంస్థలతో క్రియాశీల సహకారం గురించి కూడా సూచనలు వచ్చాయి.

 

*****



(Release ID: 1834673) Visitor Counter : 167