పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

అహ్మదాబాద్‌లోని ధోలేరాలో నూతన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 14 JUN 2022 4:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ గుజరాత్ లోని ధోలెరాలో నూతన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర యం మొదటి దశ అభివృద్ధి పనులను రూ.1305 కోట్ల అంచనా వ్యయంతో 48 నెలల్లో పూర్తి చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

51:33:16 నిష్పత్తిలో ఈక్విటీని కలిగి ఉన్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ), గుజరాత్ ప్రభుత్వం (జిఒజి) మరియు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసిడిఐటి) లతో కూడిన జాయింట్ వెంచర్ కంపెనీ అయిన ధోలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (డిఐఎసిఎల్) ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది.

ధొలేరా విమానాశ్రయం ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (DSIR) నుండి ప్రయాణీకులు మరియు కార్గో ట్రాఫిక్‌ను స్వీకరించనుంది మరియు పారిశ్రామిక రంగానికి సేవలందించేందుకు ప్రధాన కార్గో హబ్‌గా మారుతుందని భావిస్తున్నారు. ఈ విమానాశ్రయం సమీప ప్రాంతానికి కూడా సేవలందిస్తుంది మరియు అహ్మదాబాద్ కు రెండవ విమానాశ్రయంగా పనిచేస్తుంది.

ధోలేరా వద్ద నూతన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి 80 కి.మీ దూరంలో ఉంది. విమానాశ్రయం 2025-26 సంవత్సరం నుండి పని చేయడానికి ప్రణాళిక చేయబడింది మరియు ప్రారంభ ప్రయాణీకుల రద్దీ ఏటా 3 లక్షల మంది ప్రయాణీకులుగా అంచనా వేయబడింది, ఇది 20 సంవత్సరాల కాలంలో 23 లక్షలకు పెరుగుతుందని అంచనా. 2025-26 నుండి వార్షిక కార్గో ట్రాఫిక్ కూడా 20,000 టన్నులు ఉంటుందని అంచనా వేయబడింది, ఇది 20 సంవత్సరాల కాలంలో 273,000 టన్నులకు పెరుగుతుంది.

***



(Release ID: 1833920) Visitor Counter : 123