వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారుల సమస్యల పరిష్కారంపై పక్షంలోగా ప్రతిపాదనలు సమర్పించండి


ఈ కామర్స్ ఆహార వ్యాపార సంస్థలకు కేంద్రం ఆదేశం
ఆర్డరు చార్జీల వివరాలపై పారదర్శకంగా ఉండాలని సూచన

Posted On: 13 JUN 2022 5:53PM by PIB Hyderabad

   ఈ కామర్స్ వేదికపై ఆహార పదార్ధాల వాణిజ్యం నిర్వహించే ప్రధాన సంస్థలకు (ఎఫ్.బి.ఒ.లకు) కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పంపిణీ వ్యవస్థ వివరాలను, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాగాన్ని మెరుగుపరిచేందుకు తగిన ప్రతిపాదనలను రూపొందించి వాటిని 15 రోజులలోగా తమకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

  కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రముఖ ఈ-కామర్స్ ఆహార వాణిజ్య కంపెనీల సమావేశంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ కామర్స్ రంగంలో వినియోగదారుల ప్రయోజనాలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు.

   గత 12 నెలల కాలంలో జాతీయ వినియోగదారుల సహాయ కేంద్రం (1915) ద్వారా స్విగ్గీ సంస్థకు 3,631కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. జొమాటో సంస్థకు 2,828 ఫిర్యాదులు నమోదయ్యాయి. జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ భాగస్వామ్య సంస్థలుగా ఈ రెండు కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఫిర్యాదులకు సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.:-

కంపెనీ పేరుస్విగ్గీ

క్రమ సంఖ్య

సమస్య స్వభావం

నమోదైన డాకెట్లు

శాతం %

1

సేవల్లో లోపం

803

22

2

ఉత్పాదనల బట్వాడాలో జాప్యం, బట్వాడా లోపం

628

17

3

లోపాలతో కూడిన, దెబ్బతిన్న ఉత్పాదన బట్వాడా

456

13

4

ఆర్డర్ చేయని ఉత్పాతదన బట్వాడా కావడం

401

11

5

చెల్లింపు జరిగి రీఫండ్ కాకపోవడం

391

11

6

ఉత్పాదన / ఉత్పాదనా అనుబంధ వస్తువులు అచూకీ దొరక్కపోవడం

240

7

7

గరిష్ట చిల్లర ధర (ఎం.ఆర్.పి.)కి మించి ఎక్కువగా వసూలు

213

6

8

శాఖాహారం బదులు మాంసాహారం, మాంసాహారం బదులు శాఖాహారం బట్వాడా జరగడం

105

3

9

హామీ ప్రకారం గిప్ఢ్ ఇవ్వకపోవడం, లేదా తప్పుడు హామీలు

99

3

10

డబ్బు డెబిట్ అయినా, లబ్ధిదారు ఖాతాకు జమకాకపోవడం

58

2

11

ఇతర అంశాలు

135

4

12

సెక్టార్ విచారణ (సమస్య పరిష్కార నిర్వహణ ప్రక్రియపై)

102

3

 

మొత్తం

3631

100

 

కంపెనీ పేరు జొమాటో

క్రమ సంఖ్య

సమస్య స్వభావం

నమోదైన డాకెట్లు

శాతం %

1

సేవల్లో లోపం

707

25

2

లోపాలతో కూడిన, లేదా దెబ్బతిన్న సరుకు బట్వాడా

499

18

3

ఉత్పాదన బట్వాడాలో జాప్యం, లేదా బట్వాడాలో లోపం

319

11

4

చెల్లింపు జరిగి రీఫండ్ కాకపోవడం

307

11

5

ఆర్డర్ చెయ్యని సరకు రవాణా

298

11

6

ఉత్పాదన/ఉత్పాదనా అనుబంధ వస్తువులు అచూకీ లేకపోవడం

153

5

7

శాఖాహారం బదులు మాంసాహారం,.. మాంసాహారం బదులు శాఖాహారం బట్వాడా జరగడం

109

4

8

గరిష్ట చిల్లర ధర (ఎం.ఆర్.పి.)ను మించి వసూలు చేయడం.

90

3

9

హామీ ప్రకారం గిఫ్ట్ ఇవ్వకపోవడం, తప్పుడు హామీలు

78

3

10

ఖాతాలు బ్లాక్ చేయడం/సర్వీసు నిషేధం

20

1

11

ఇతర అంశాలు

112

4

12

సెక్టార్ విచారణ (సమస్య పరిష్కార నిర్వహణా వివరాలపై..)

136

5

 

మొత్తం

2828

100

 

   జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ ద్వారా వినియోగదారులు లేవనెత్తిన ప్రధాన సమస్యలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్వహించిన  ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సరకు బట్వాడాకు సంబంధించిన వాస్తవ లెక్కలు, ప్యాకింగ్ చార్జీలు, సదరు చార్జీల విధింపులో పాటించిన హేతుబద్ధత, ఈ కామర్స్ వేదికపై ప్రదర్శించిన ఆహార పదార్థాల పరిమాణం, రేట్లకు,  వాస్తవంగా వినియోగదార్లకు బట్వాడా చేసిన ఆహారం పరిమాణానికి, రేట్లకు మధ్య వ్యత్యాసాలు, వినియోగదారులు ఆర్డర్ నమోదు చేసినపుడు సూచించిన బట్వాడా వ్యవధి, బట్వాడా చేసేందుకు పట్టిన వాస్తవ వ్యవధి మధ్య తేడా తదితర అంశాలపై ఈ మావేశంలో విపులంగా చర్చించారు.

  వినియోగదారులపై సమాచారాన్ని ఈ కామర్స్ వాణిజ్య సంస్థలు తమకు తెలియజేయనందున, తాము వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవలందించలేకపోయామంటూ భారత జాతీయ రెస్టారెంట్ల సంఘం (ఎన్.ఆర్.ఎ.ఐ.) ఈ సమావేశంలో ఫిర్యాదు చేసింది. అలాగే ఉత్పాదనా బట్వాడా చార్జీలను ఈ కామర్స్ సంస్థలే నిర్దేశించి, వసూలు చేయడాన్ని కూడా రెస్టారెంట్ల సంఘం ప్రతినిధులు ప్రస్తావించారు. ప్రతి ఆర్డరుపైనా, 20శాతందాకా కమిషన్‌ను ఎఫ్.బి.ఒ.లు వసూలు చేయడం కూడా  సమావేశంలో చర్చకు వచ్చింది.

   ఈ సందర్భంగా, ఎఫ్.బి.ఒ.లకు వినియోగదారుల శాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అన్ని చార్జీల వివరాలను,.. అంటే బట్వాడా చార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులు, ధరల పెరుగుదల వంటి వివరాలను వినియోగదారులకు ఆర్డరులోనే వివరించాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎఫ్.బి.ఒ.లను ఆదేశించింది. వినియోగదారులు స్వయంగా వెలిబుచ్చిన అభిప్రాయాలను ఈ కామర్స్ వేదికపై ప్రదర్శించడంలో ఈ కామర్స్ వేదికలు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, ఏవో కొన్ని ఎంపిక చేసిన అభిప్రాయాలను మాత్రమే చూపించడం మానుకోవాలని వినియోగదారుల శాఖ స్పష్టం చేసింది. ఏదైనా తనకు నచ్చిన సరకును ఎంపిక చేసుకునేందుకు వినియోగదారుకు ఉండే హక్కును గౌరవించాల్సి ఉంటుందని సూచించారు. వినియోగదారులు వారంతట వారు కోరిన పక్షంలో వారి కాంటాక్ట్ సమాచారాన్ని రెస్టారెంట్లతో పంచుకునేందుకు ఎఫ్.బి.ఒ.లు తగిన అవకాశం ఇచ్చి తీరాల్సిందేనని వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో స్విగ్గీ, జొమాటో, భారత జాతీయ రెస్టారెంట్ల సంఘం ప్రతినిధులతో సహా ముఖ్యమైన ఆన్ లైన్ ఆహార వాణిజ్య సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి నిధీ ఖరే, సంయుక్త కార్యదర్శి అనుపమ్ మిశ్రా కూడా సమావేశానికి హాజరయ్యారు.

  ఈ సమావేశంలో ఈ కామర్స్ ఎఫ్.బి.ఒ. ప్రతినిదులు మాట్లాడుతూ, ఆహార పదార్ధాల ధరలను రెస్టారెంట్లు మాత్రమే నిర్ణయిస్తాయని, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఒక యంత్రాంగం తమకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

    వినియోగదారుల సమస్యలను మరింత నిశితంగా పరిశీలించి పరిష్కరించాల్సిన ఆవశ్యతను ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులంతా గుర్తించారు. ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్టమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. సమావేశంలో ప్రస్తావించిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని, 15 రోజుల గడువులోగా పారదర్శకమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రూపొంచి, దాన్ని వినియోగదారుల వ్యవహారాల శాఖకు తెలియజేస్తామని వారు ఈ సమావేశంలో హామీ ఇచ్చారు.  

 

****


(Release ID: 1833683) Visitor Counter : 172