రక్షణ మంత్రిత్వ శాఖ
జాతీయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి గొప్ప పౌర-సైనిక సమిష్టితనం తప్పనిసరి: ఎల్ బిఎస్ ఎన్ ఎఎలో 28వ జాయింట్ సివిల్-మిలటరీ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి
పౌర పరిపాలన అడ్డంకులను చేదించాలి: హైబ్రిడ్ బెదిరింపులను ఎదుర్కోవటానికి సాయుధ దళాలు సన్నద్ధంగా ఉండాలని పిలుపు
భారతదేశం శాంతి కాముక దేశం, కానీ ఎవరైనా చెడు చేయాలని చూస్తే తగిన సమాధానం ఇస్తుంది: రాజ్ నాథ్ సింగ్
Posted On:
13 JUN 2022 3:18PM by PIB Hyderabad
జాతీయ భద్రత ను మరింత బలోపేతం
చేయడానికి, నిరంతరం మారుతున్న ప్రపంచ పరిస్థితుల వల్ల ఎదురయ్యే భవిష్యత్తు సవాళ్ల ను ఎదుర్కోవడానికి పౌర పరిపాలన -
సాయుధ బలగాల సమష్ఠితనం మరింత పెంపొందాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.2022 జూన్ 13న ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్ బి ఎస్ ఎన్ ఎ ఏ))లో జరిగిన 28వ జాయింట్ సివిల్- మిలిటరీ శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న వారిని ఉద్దేశించి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. సైనిక దాడుల నుండి రక్షణకు సంబంధించిన ఎంతో సాధారణ అంశానికి అనేక సైనికేతర కోణాలు జోడించబడినందున జాతీయ భద్రత భావన విస్తృతమైందని రక్షణ మంత్రి అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ పరిస్థితులు, ఇతర ఇలాంటి సంఘర్షణలు ప్రపంచం సాంప్రదాయ యుద్ధానికి మించిన సవాళ్లను చూస్తున్న దనడానికి నిదర్శనమని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ‘‘ యుద్ధం , శాంతి ఇకపై రెండు ప్రత్యేక అంశాలు కాదు. అవి అనునిత్యం తప్పవు.శాంతి సమయంలో కూడా, అనేక రంగాలలో యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. పూర్తి స్థాయి యుద్ధం ఒక దేశానికి దాని శత్రువులకు ఎంత ప్రాణాంతకమో అంతే ప్రాణాంతకం. అందు వల్లనే గత కొన్ని దశాబ్దాలుగా పూర్తి స్థాయి యుద్ధాలు నివారించబడ్డాయి.వాటి స్థానంలో ప్రాక్సీలు , యుద్ధేతర ఘర్షణలు మొదలయ్యాయి.టెక్నాలజీ, సప్లై లైన్, ఇన్ఫర్మేషన్, ఎనర్జీ, ట్రేడ్ సిస్టమ్, ఫైనాన్స్ సిస్టమ్ మొదలైనవి ఆయుధాలుగా మారుతున్నాయి. వీటిని రాబోయే కాలంలో మనకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. భద్రతా సవాళ్ల విస్తృత పరిధిని ఎదుర్కోవడానికి ప్రజల సహకారం అవసరం" అని ఆయన అన్నారు, ఈ సవాళ్లను అధిగమించడానికి 'దేశం మొత్తం', 'మొత్తం ప్రభుత్వం' విధానాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును ఏర్పాటు చేయడం, డిపార్ట్ మెంట్ ఆఫ్ మిలటరీ అఫైర్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా పౌర-సైనిక సమిష్ఠితనం పూర్తి స్థాయి ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని రక్షణ మంత్రి చెప్పారు.
భవిష్యత్తు సవాళ్లకు దేశాన్ని సంసిద్ధం
చేయడం లో ఈ నిర్ణయాలు ఉపయోగ
పడుతున్నాయని ఆయన అన్నారు. సాయుధ దళాలను ఆధునీకరించడానికి, రక్షణ రంగాన్ని 'ఆత్మనిర్భర్'గా మార్చడానికి తీసుకున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత దేశం
'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వ ర ల్డ్' అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
దార్శనికతకు అనుగుణంగా తన సాయుధ దళాలకు అవసరమైన సామగ్రి ని తయారు చేయడమే కాకుండా, మిత్ర దేశాల అవసరాలను కూడా తీరుస్తోందని,
ఆయన అన్నారు.
హైబ్రిడ్ బెదిరింపులను ఎదుర్కోవడానికి పౌర పరిపాలన- సాయుధ దళాల అంతరాలను విచ్ఛిన్నం చేయకపోతే, భవిష్యత్తు సవాళ్లకు ప్రతిస్పందించడానికి దేశం తగినంత సన్నద్ధం కాలేదని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.అయితే, సమిష్టితనం అంటే ఒకరి స్వయంప్రతిపత్తిని మరొకరు ఉల్లంఘించడం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇంద్రధనుస్సులోని రంగుల మాదిరి ఒకరి గుర్తింపును ఒకరు గౌరవిస్తూ కలిసి పనిచేయడం దీని అర్థం అని వివరించారు.
'భారత్ శాంతిని ప్రేమించే దేశం, ఇది యుద్ధాన్ని కోరుకోదు. ఇది ఏ దేశం పైనా తనకు తానుగా దాడి చేయదు, లేదా ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోదు. అయితే ఎవరైనా వక్ర దృష్టి తో వ్యతిరేకంగా భారత్ పైకి వస్టే మనం తగిన గట్టి సమాధానం ఇస్తాము" అని రక్షణ మంత్రి అన్నారు.
ఎల్ బి ఎస్ ఎన్ ఎఎ లో జాయింటు సివిల్ మిలిటరీ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాలు ప్రస్తుత ప్రభుత్వం కింద మొదలైన పౌర -సైనిక
సమగ్రత ప్రయాణంలో కీలక మైన పాత్రను పోషిస్తాయ ని శ్రీ రాజ్ నాథ్ సింగ్ విశ్వాసం
వ్యక్తం చేశారు. జాతీయ భద్రతా రంగంలో
సమన్వయం,సహకారానికి సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవడం లో సివిల్ సర్వెంట్స్ కు, సాయుధ దళాల అధికారుల కు ఈ కార్యక్రమం ప్రయోజనం
కల్పించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్యానంతరం, భారతదేశం పాత పాలనా విధానాన్ని అనుసరించిందని, ఇది ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం వివిధ సామాజిక, ఆర్థిక , రాజకీయ సంస్థలు, మంత్రిత్వ శాఖలు / విభాగాలను సృష్టించడానికి దారితీసిందని రక్షణ మంత్రి అన్నారు. భారత దేశం వంటి సువిశాల దేశం సజావుగా గమనం సాగించేందుకు పని
విభజన తప్పనిసరి కావడం వల్ల కొంత కాలం పాటు విభాగాలు, మంత్రిత్వ శాఖలు పరిధుల్లో పనిచేయడం ప్రారంభించాయని ఆయన అన్నారు.
ఉమ్మడిగా పనిచేయడం పై దృష్టి సారించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎవరి పరిధి లో వారు పని చేసే విధానాన్ని మార్చారని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రభుత్వం
ప్రస్తుతం పనిచేస్తున్న ఈ కొత్త పద్ధతి దేశ సమగ్రాభివృద్ధికి దోహద పడిందని ఆయన పేర్కొన్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా ఎల్ బి ఎస్ ఎన్ ఎ ఎ దేశానికి అందించిన సేవలను
అసమానమైనవిగా అభివర్ణించిన రక్షణ మంత్రి, ఈ సంస్థ, తన శిక్షణ ద్వారా, దేశ వ్యవస్థ కు ఉక్కు చట్రంగా పిలువబడే సివిల్ సర్వీసెస్ అధికారులను తయారు చేయడం ద్వారా దేశ శ్రేయస్సుకు దోహదపడుతోందని చెప్పారు.
దేశ ఉద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు.
‘‘దేశంలో 'ఐక్యత', 'ఏకత్వం' అనే ఆలోచనను శాస్త్రి జీ గౌరవించారు. ప్రజల నుండి పరిపాలన వరకు, ఆయన పనిని ఐక్యత దృక్పథం నుండి చూడటాన్ని విశ్వసించారు. . గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ ఉమ్మడి పౌర- సైనిక కార్యక్రమం లాల్ బహదూర్ శాస్త్రి దార్శనికతను ముందుకు తీసుకెళ్తోంది" అని ఆయన అన్నారు.
జాతీయ భద్రతపై భాగస్వామ్య అవగాహన కోసం సివిల్ సర్వెంట్లు , సాయుధ దళాల అధికారుల మధ్య నిర్మాణాత్మక సందానాన్ని పెంపొందించే లక్ష్యంతో 2001 లో జాయింట్ సివిల్-మిలిటరీ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్, ఆర్మ్ డ్ ఫోర్సెస్ , సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి పార్టిసిపెంట్స్ ను తీసుకుంటారు. జాతీయ భద్రత నిర్వహణ, మారుతున్న బాహ్య , అంతర్గత భద్రతా వాతావరణం , ప్రపంచీకరణ ప్రభావం వంటి సవాళ్లను శిక్షణ లో పాల్గొనేవారికి పరిచయం చేయడం, ఈ విషయంపై పరస్పరం ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, పౌర-సైనిక సమన్వయం ఆవశ్యకతలను గ్రహించడానికి అవకాశం కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం;
***
(Release ID: 1833583)
Visitor Counter : 224