కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఇ.ఎస్.జి.-సి.ఎస్.ఆర్. ఉత్తమ విధానాలపై ఎగ్జిబిషన్!


'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా
ఐ.ఐ.సి.ఎ. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ..

Posted On: 12 JUN 2022 4:54PM by PIB Hyderabad

  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా, భారతీయ కార్పొరేట్ వ్యవహారాల అధ్యయన సంస్థ (ఐ.ఐ.సి.ఎ.) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక ప్రదర్శన వేలాదిమంది పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్.) పరిధిలోని మానెసార్ పారిశ్రామిక నమూనా టౌన్‌షిప్ ( ఐ.ఎం.టి.) ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 30 అగ్రశ్రేణి కంపెనీలు పాల్గొన్నాయి. సుస్థిర సామర్థ్యం, పర్యావరణ సామాజిక సుపరిపాలన (ఇ.ఎస్.జి.), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) వంటి అంశాల్లో తాము అనుసరిస్తున్న విధానాలను ఆయా కంపెనీలు ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించాయి.

  సమాజంపట్ల ఆయా కంపెనీలు మరింత బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో అన్న అంశంపై ఐ.ఐ.సి.ఎ.కి చెందిన స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఆయా కంపెనీలకు సూచనలు చేసింది. ఐ.ఐ.సి.ఎ. అనేది కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే నైపుణ్య సంస్థ. దేశవ్యాప్తంగా ఇ.ఎస్.జి., సి.ఎస్.ఆర్. అంశాలను బలోపేతం చేయడంతోపాటుగా, సంబంధిత ఇతర అంశాల పర్యవేక్షణకోసం ఈ సంస్థ కృషిచేస్తూ వస్తోంది.

https://ci6.googleusercontent.com/proxy/MdX2gHgA4_vQmtwY2XJIuQEfmizy67k6UPtGj9zR_VQoAaxk-xrqyzUNC-s4Jv4g7PktPEomxuUHzd-TQxfD9HVxiIiLj3RGrUFNIhM7Zwq50kU5ZgiwlBdrFg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Y6NO.jpg

 

   కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయమంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ ఈ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడతూ, కార్పొరేట్ సుపరిపాలనా ప్రక్రియను  ప్రోత్సహించేందుకు తమ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలతో దేశంలో సులభతర వాణిజ్య నిర్వహణ మరింత సజావుగా సాగుతోందన్నారు. 'కనీస స్థాయి  ప్రభుత్వ జోక్యం-గరిష్టస్థాయి పరిపాలనా ప్రక్రియ' ప్రజా విశ్వాసం, సులభతర వాణిజ్య నిర్వహణ వంటి అంశాలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే 25,000 ఆంక్షలను, దాదాపు 1,500కేంద్ర చట్టాలను రద్దు చేసిందన్నారు. అమృత్ కాలంలో సులభతర వాణిజ్య నిర్వహణ తదుపరి దశపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తుందన్నారు. పెట్టుబడి, మానవవనరుల ఉత్పాదకతా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు 'విశ్వాస ప్రాతిపదికన పరిపాలనా ప్రక్రియ'ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సుస్థిర అభివృద్ధి అనే అంశాన్ని ఇపుడు ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించినట్టు ఆయన చెప్పారు. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద సుస్థిర అభివృద్ధిని ప్రజలు తమ జీవితంలో ఒక అంతర్భాగంగా పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొందని అన్నారు. అందువల్ల సుస్థిర అభివృద్ధి అనే సూత్రానికి అనుగుణంగా వ్యవహరించడం రాజ్యాంగ నిర్దేశమే అవుతుందన్నారు. ఈ విషయంలో వ్యక్తిగా ప్రతి ఒక్కరికీ తమ భుజస్కందాలపై భారీ బాధ్యత ఉందని, వ్యక్తిగత ఆలోచనా ధోరణి మారనిదే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో భారీ విప్లవం సాధ్యం కానేకాదని కేంద్రమంత్రి అన్నారు.

  కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ వర్మ మాట్లాడుతూ, కంపెనీల చట్టం కింద కార్పొరేట్ సామాజిక బాధ్యత నిర్దేశాలను, సామాజిక, పర్యావరణ, ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన జాతీయ స్వచ్ఛంద మార్గదర్శక సూత్రాలను ప్రవేశపెట్టడంలో తమ మంత్రిత్వ శాఖ గణనీయమైన సేవలందిందని అన్నారు. అలాగే, బాధ్యతాయుత వాణిజ్య నిర్వహణపై జాతీయ మార్గదర్శక సూత్రాల (ఎన్.జి.ఆర్.బి.సి.) నవీకరణలో కూడా తమ మంత్రిత్వ శాఖ గట్టిచర్యలు తీసుకుందన్నారు. వెయ్యి లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజి బోర్డు వాణిజ్య బాధ్యత, సుస్థిరతా నియమాలను (బి.ఆర్.ఎస్.ఆర్.లను) నిర్దేశించిందని అన్నారు. బిజినెస్ రెస్పాన్సిబిలిటీ రిపోర్టింగ్ (బి.ఆర్.ఆర్.)పై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన సూత్రాల ప్రాతిపదికపైనే బి.ఆర్.ఎస్.ఆర్., బాధ్యాతాయుత వాణిజ్య నిర్వహణపై జాతీయ మార్గదర్శక సూత్రాలు రూపొందాయని అన్నారు.

  ఈ సందర్భంగా ఇ.ఎస్.జి-సి.ఎస్.ఆర్. ప్రమాణాల నిర్ధారణ అనే శీర్షికన రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆవిష్కరించారు.  ఇ.ఎస్.జి., సి.ఎస్.ఆర్. పద్ధతుల ద్వారా వివిధ కంపెనీలు చేపట్టిన సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుల సంకలనంతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. డాక్టర్ గరిమా దధీచ్, డాక్టర్ రవిరాజ్ అత్రే  సంపాదకత్వంలో ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా ఒక వ్యాసరచనా పోటీని కూడా ఐ.ఐ.సి.ఎ. నిర్వహించింది. ఈ పోటీలో తమ ఉత్తమ వ్యాస రచనతో బహుమతులు గెలిచిన ముగ్గురు విజేతలకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అవార్డులు ప్రదానం చేశారు.

  కార్పొరేట్ పరిపాలనా ప్రక్రియపై నిర్వహించిన ప్యానెల్ చర్చాగోష్టిలో మొదటి సాంకేతిక సదస్సుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి ఇందర్‌దీప్ సింగ్ ధరీవాల్ అధ్యక్షత వహించారు. కార్పొరేట్ పరిపాలనా ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తేవడంలో యువత అందించిన సేవల గురించి ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. చర్చాగోష్టిలో రెండవ సాంకేతిక సదస్సుకు సంయుక్త కార్యదర్శి మనోజ్ పాండే అధ్యక్షత వహించారు. మహిళల ఆర్థిక అక్షరాస్యత ఆవశ్యకత గురించి ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు.  

 

https://ci4.googleusercontent.com/proxy/6tNxZnSwY0xsYBkrgG4uccpwbZ1hNDivLSlOObSuPpAiWmdgQvnn7nYyLdYSCDQgu2fl-Xb-zQIKGpLX--pgEmPdh-GnCFh2NkCOY6pBYEe2zqs2IDOM6j4gag=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002S6T8.jpg

  ఐ.ఐ.సి.ఎ. డైరెక్టర్ జనరల్, సి.ఇ.ఒ. ప్రవీణ్ కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. ఏదేశానికైనా ఆర్థిక వ్యవస్థే వెన్నెముక అని అందరికీ తెలుసుసని, ఆర్థిక వ్యవస్థ ఛోదక శక్తుల్లో ఒకటిగా  కార్పొరేట్ రంగమే వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదిగేలా తాము తమ ప్రత్యేక సేవలను కొనసాగిస్తూనే ఉంటామన్నారు. జాతీయ అభివృద్ధి సాధనకు పటిష్టవంతమైన సేవలందించేలా కార్పొరేట్ కంపెనీలకు తగిన శక్తిసామర్థ్యాలను కార్పొరేట్ వ్యవహారాల మత్రిత్వ శాఖ అందిస్తుందని అన్నారు. దేశంలో కార్పొరేట్ వ్యవహారాలను బలోపేతం చేసే ఏకైక సంస్థ ఐ.ఐ.సి.ఎ. మాత్రమేనని అన్నారు.

   పర్యావరణ సామాజిక సుపరిపాలన (ఇ.ఎస్.జి), సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్,డి.జి.), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) వంటి అంశాల్లో తాము అనుసరిస్థున్న పద్ధతులను ప్రదర్శిస్తూ 30 కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎగ్జబిషన్‌ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్ వర్మ ప్రారంభించారు.  ఈ సందర్భంగా జరిగిన సాంకేతిక సదస్సుల్లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహాహాల సలహాదారు నందితా మిశ్రా, తదితర ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

   ప్రారంభోత్సవం సందర్భంగా, వ్యాసరచన పోటీల్లో విజేతల పేర్లను ప్రకటించారు. కార్పొరేట్ పరిపాలనా ప్రక్రియ-నవభారతానికి దార్శనికతా పరిణామం అన్న అంశంపై హిందీ, ఇంగ్లీషు భాషల్లో నిర్వహించిన ఈ పోటీలో 30ఏళ్ల లోపు విద్యార్థులకు, వృత్తి నిపుణులకు అవకాశం కల్పించారు. ఈ పోటీకి ఎంట్రీల రూపంలో అద్భుతమైన ప్రతిస్పందన లభించింది. సత్రాజ్ సింగ్‌కు తృతీయ బహుమతి, నందినీ అగర్వాల్‌కు ద్వితీయ బహుమతి, సమ్యక్ సంఘ్వీకి ప్రథమ బహుమతి లభించాయి. పోటీలో విజేతలుగా నిలిచిన వారిని నగదు బహుమతులతో, యోగ్యతా పత్రాలతో సత్కరించారు.

  పర్యావరణ సామాజిక పరిపాలనా ప్రక్రియలో కార్పొరేట్ సామాజిక బాధ్యత అనే అంశంపై జరిగిన సాంకేతిక సదస్సుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనితా షా ఆకెళ్ల అధ్యక్షత వహించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతా చర్యల ద్వారా సమాజ సంక్షేమంకోసం తగిన సేవలందించడంలో కార్పొరేట్ సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు సి.ఎస్.ఆర్.నుంచి ఇ.ఎస్.జి. వరకూ పరవర్తన దశలో కొనసాగుతున్నాయని అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత, పర్యావరణ, సామాజిక పరిపాలనా ప్రక్రియల  గురించి మనం మాట్లాడుకున్నపుడు, ఏ కార్యక్రమానికికైనా మహిళా ప్రయోజనకరమైన ధోరణి అవసరమవుతుందని అన్నారు. చర్చలో ప్యానెల్ సభ్యులుగా ప్రసంగించిన వక్తలుగా నైనా లాల్ కిద్వాయ్, నమితా వికాస్, డాక్టర్ ఇందర్‌జీత్ సింగ్, శ్రబ్జీద్సహోతా, డాక్టర్ సురాంజలీ టాండన్, నీతు ఆహుజా, డాక్టర్ గరిమా దధీచ్ పాల్గొన్నారు. ఇ.ఎస్.జి., సి.ఎస్.ఆర్. ప్రక్రియల్లో ఆశించిన పెనుమార్పులు ఐ.ఐ.సి.ఎ. చేపట్టే కృషి ద్వారానే సాధ్యమవుతుందని చర్చలో పాల్గొన్న వక్తలు తీర్మానించారు. ఇ.ఎస్.జి. విషయంలో, ఐ.ఐ.సి.ఎ. త్వరలో చేపట్టబోయే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోర్చు,..అతిముఖ్యమైన కోర్సుగా నిలిచిపోగలదని పేర్కొన్నారు.

   ఈ ప్రదర్శన సందర్భంగా నిర్వహించిన మరో సాంకేతిక సదస్సులో ఆర్థిక సమ్మిళిత ప్రక్రియ, మహిళల ఆర్థిక అక్షరాస్యత గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహిళా సాధికారత, ఆర్థిక ఆక్షరాస్యత ప్రాధాన్యం గురించి డాక్టర్ నవీన్ శిరోహీ ప్రసంగించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్ పాండే, సుస్మితా ఫుకాన్, సీమా సింగ్, నమితా వికాస్ వక్తలుగా పాలుపంచుకున్నారు.

 యునిసెఫ్ ఇండియా ఉప ప్రతినిధి అర్జన్ డే వఖ్త్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు నందితా మిశ్రా, ఆర్థిక వ్యవహారాల శాఖ సలహాదారు అగ్రిమ్ కుశాల్, గురుగ్రామ్ అదనపు డిప్యూటీ కమిషనర్ విశ్రమ్  కుమార్ మీనా కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

   ప్రభావవంతమైన కార్పొరేట్ సామాజిక బాధ్యత, సుపరిపాలన అనే శీర్షికన నీతీ ఆయోగ్, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ, యునిసెఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అధినేత్రి డాక్టర్ గరిమా దధీచ్, కె.ఆర్.సి సారథి డాక్టర్ లతా సురేష్, డాక్టర్ రవిరాజ్ ఆత్రే, సుధా రాజగోపాలన్ హాజరయ్యారు. ఐ.ఐ.సి.ఎ. డైరెక్టర్ జనరల్, సి.ఇ.ఒ ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

  ప్రారంభోత్సవ సదస్సులో పుస్తకావిష్కరణ సందర్భంగా డాక్టర్ గరిమా దధీచ్, డాక్టర్ రవి రాజ్ ఆత్రే ఒక ఇంటర్వ్యూ ఇస్తూ,  తాము ఎంతో అంకిత భావంతో చేస్తున్న ఈ కృషి రేపు కార్పొరేట్ రంగంలో విప్లవాత్మక మార్పునకు దోహదపడుతుందని, ఆ తర్వాత మరిన్ని పెనుమార్పులకు కారణమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సందర్బంగా మీడియా సమన్వయకర్తగా డాక్టర్ లతా సురేష్ వ్యవహరించారు.

***



(Release ID: 1833385) Visitor Counter : 111


Read this release in: Tamil , English , Urdu , Hindi