జాతీయ ఆర్థిక నివేదన ప్రాధికార సంస్థ
azadi ka amrit mahotsav

రేపు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా “ఎఫెక్టివ్ ఇండిపెండెంట్ ఓవర్‌సైట్ ద్వారా హై క్వాలిటీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్”పై ఎన్ఎఫ్ఆర్ఏ నిర్వహించే సెమినార్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్


దేశీయ అంతర్జాతీయ రంగాల నుండి ఆడిట్ అకౌంటింగ్ ప్రమాణాల నియంత్రణలో నిపుణుల నుండి భాగస్వామ్యాన్ని చూడటానికి ఎన్ఎఫ్ఆర్ఏ ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Posted On: 10 JUN 2022 1:36PM by PIB Hyderabad

నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వారోత్సవాల్లో భాగంగా రేపు "ప్రభావవంతమైన స్వతంత్ర పర్యవేక్షణ ద్వారా హై క్వాలిటీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్" అనే అంశంపై సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర స్టాటిస్టిక్స్ & ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కోసం కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్లానింగ్  (ఎంఓఎస్), కార్పొరేట్ వ్యవహారాలు..రావు ఇంద్రజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారు.  కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి  రాజేష్ వర్మ గౌరవ అతిథిగా పాల్గొంటారు. డిసెంబర్-జనవరి, 2022లో ఎన్ఎఫ్ఆర్ఏ నిర్వహించిన ఆల్-ఇండియా స్థాయి క్విజ్ విజేతలను కేంద్ర  కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సత్కరిస్తారు. ఎన్ఎఫ్ఆర్ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేశీయ,  అంతర్జాతీయ రంగానికి చెందిన ఆడిట్  అకౌంటింగ్ ప్రమాణాల నియంత్రణలో నిపుణులు పాల్గొంటారు. జపాన్‌లోని సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్  ఆడిటింగ్ ఓవర్‌సైట్ బోర్డ్ నుండి ఒక నిపుణుడు "ఆడిట్ క్వాలిటీ  ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ గురించి గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్" అనే అంశంపై సెషన్‌లో ప్రసంగిస్తారు.

 

“ఇండిపెండెంట్ ఆడిట్ రెగ్యులేటర్స్-ఇండియా & గ్లోబల్ సినారియో”  “ఇండిపెండెంట్ ఓవర్‌సైట్ బాడీస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ క్వాలిటీ-రోల్ డెవెలప్మెంట్” అనే అంశంపై రెండు ప్యానెల్ చర్చలు అకడమిక్  కార్పోరేట్ సెక్టార్ నుండి ఉంటుంది. వివరణాత్మక ప్రోగ్రామ్ ఎన్ఎఫ్ఆర్ఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది (https://nfra.gov.in). ఏకమ్ వేడుకల్లో భాగంగా, దేశంలోని భాగస్వామ్యపక్షాలు  పౌరులలో ఆడిటింగ్  అకౌంటింగ్ స్టాండర్డ్స్‌పై చైతన్యం, అవగాహనను పెంపొందించడానికి ఎన్ఎఫ్ఆర్ఏ అక్టోబర్, 2021 నెలలో భారతదేశంలో అకౌంటింగ్  ఆడిటింగ్ ప్రమాణాలపై రెండు రోజుల వెబ్‌నార్‌ను నిర్వహించింది. వెబ్‌నార్  వెబ్‌కాస్ట్ ఎన్ఎఫ్ఆర్ఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది (https://nfra.gov.in/events). ఇదే ఏడాది భారత ప్రభుత్వం  మైగవ్ పోర్టల్‌లో ఆల్-ఇండియా స్థాయి క్విజ్ పోటీ కూడా నిర్వహించడం జరిగింది.  తద్వారా ఆడిట్ రెగ్యులేషన్  సమ్మతి అవసరాలలో యువకులను ప్రోత్సహించడానికి  27 వేల మందికిపైగా పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకమ్) వేడుకలను ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ మార్చి 2021లో ప్రారంభించారు. ఇది ఆగస్టు, 2022లో మన స్వాతంత్ర్యానికి  75 వసంతాలు నిండుతాయి.   ఒక సంవత్సరం పాటు అంటే.. ఆగస్టు 2023 వరకు వేడుకలు కొనసాగుతాయి. 

 

***


(Release ID: 1833384) Visitor Counter : 184


Read this release in: English , Urdu