సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
విప్లవ స్వాతంత్ర్య యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను రేపు సమీక్షించనున్న శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
11 JUN 2022 4:03PM by PIB Hyderabad
కీలకాంశాలు:
● జూన్ 12, 2022న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పర్యటించనున్న శ్రీ జి. కిషన్‌రెడ్డి
● ఏడాది పొడవునా జరుగనున్న వేడుకలలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివిద సామాజిక, ప్రజాసంఘాల నాయకులను కలుపుకుపోయేందుకు వారితో కేంద్రమంత్రి చర్చిస్తారు.
● మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుని అందించిన సేవలకు తగినట్టుగా ఈ సందర్భాన్ని సంస్మరించుకునేందుకు ఆమోదం తెలిపిన నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ( జాతీయ అమలు కమిటీ - ఎన్ఐసి)
● 4 జులై 2022 విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి
విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు 125 జయంతిని సంస్మరించుకునేందుకు జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, డిఒఎన్ఇఆర్ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి 12 జూన్ 2022న భీమవరంలో పర్యటించనున్నారు.కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలోని జాతీయ అమలు కమిటీ (ఎన్ఐసి) మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు అందించిన సేవలకు తగినట్టుగా ఈ సందర్భాన్ని సంస్మరించుకునేందుకు ఆమోదాన్ని తెలిపింది.
తన ఒకరోజు పర్యటనలో కేంద్ర మంత్రి మొగల్లులోని అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నమైన అల్లూరి ధ్యాన మందిరాన్ని సందర్శించడమే కాక ఏడాది పాటు సాగనున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సామాజిక, ప్రజానాయకులను కూడా కలుపుకుపోయేందుకు వారితో చర్చిస్తారు.
భారతీయ స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాలుపంచుకున్న భారతీయ విప్లవకారుడు శ్రీ అల్లూరి సీతారామరాజు. జులై 4, 1897న జన్మించిన ఆయనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, కర్ణాటక రాష్ట్రాలలో మన్యం వీరుడు లేక అడవి వీరుడు శ్లాఘించడమే కాక ఈ రాష్ట్రాలలో ఆయనది ప్రతి నోట్లో నానే పేరు.
ఆయన 125వ జయంతితో పాటుగా, సీతారామరాజు 1922 ఆగస్టు నుంచి మే 1924వరకు నాయకత్వం వహించిన రంపా స్వాతంత్ర్య పోరాటం 100వ సంవత్సరాన్నిభారత ప్రభుత్వం సంస్మరించుకోనుంది. ఈ తిరుగుబాటును అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారీ మొత్తంలో వనరులను వెచ్చించవలసి వచ్చింది.
***
(Release ID: 1833305)
Visitor Counter : 162