మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఎనిమిది సంవత్సరాల ప్రభుత్వంపై డిడి వార్తా సదస్సులో పాల్గొన్న శ్రీ పర్షోత్తమ్ రూపాల
Posted On:
10 JUN 2022 11:16AM by PIB Hyderabad
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా 8 జూన్, 2022న డిడి వార్తా సదస్సులో పాలుపంచుకున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిడి న్యూస్ ఎనిమిదేళ్ళ మోడీ సర్కారు: ఎన్నికలలు సాకారమయ్యాయి ( ‘आठ साल मोदी सरकार: सपने कितने हुए साकार’) అన్న ఇతివృత్తంతో 3 నుంచి 11 జూన్ 2022 వరకు నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అన్ని రంగాలలో, ముఖ్యంగా రైతాంగ సంక్షేమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఎప్పుడూ శాస్త్రీయ ఆవిష్కరణను, సాంకేతికతలను ప్రోత్సహించారని పర్షోత్తమ్ రూపాల పేర్కొన్నారు. ఇది ప్రభుత్వానికి ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉందని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించారని, ఆయన రైతులతో ప్రభావశీల సెషన్లను నిర్వహించేవారని, కృషి మహోత్సవ్ ఆయన ప్రారంభించిందేనని, దానితో పాటుగా పశువుల కోసం అంబులెన్సులను, మొబైల్ వెటర్నరీ యూనిట్లను ఆయన వివరించారు. ప్రస్తుతం పిఎం-కిసాన్ 11వ వాయిదా కింద రూ. 2 లక్షల కోట్లను డిబిటి ద్వారా నేరుగా లబ్ధిదారు అకౌంట్‌లోకి బదిలీ చేసినట్టు చెప్పారు.
పాడి పరిశ్రమలో సేవలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు, పశు పెంపక కేంద్రాలు, పాడిపరిశ్రమ యూనిట్లకు మద్దతుగా 50శాతం సబ్సిడీని ఇచ్చారని తెలిపారు. సహకార సంస్థల బలం గురించి మాట్లాడుతూ, అన్నింటికన్నా అత్యంత విజయవంతమైన ఉదాహరణ, భారత్‌లోని గ్రామాలకు రోజుకు 125 కోట్లకు పైగా గుజరాత్‌లోని అమూల్ పంపుతోందని అని శ్రీ పర్షోత్తమ్ రూపాలా చెప్పారు, దీనినే వ్యవసాయంలోనూ, మత్స్య రంగంలోని ఇతర రంగాలలో దీనిని సాధించేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రవేశపెట్టిందని, దీనివల్ల మత్స్యకారులకు తొలిసారి కిసాన్ క్రెడిట్ కార్డు పొందే అవకాశాన్ని ఇచ్చిందని చెప్పారు. దీనితో పాటుగా, వ్యవస్థాపకతను, మత్స్య రవాణా, జీవనోపాధి తదితరాలకు కూడా మద్దతును అందిస్తోందని వివరించారు.
***
(Release ID: 1833127)
Visitor Counter : 125