యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవం


8 స్వర్ణాలతో మహారాష్ట్ర ఆధిక్యం
బాలుర హాకీ ఫైనల్లో పంజాబ్, యు.పి. ఢీ!

Posted On: 09 JUN 2022 4:13PM by PIB Hyderabad

  ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవం, అథ్లెటిక్స్ పోటీల్లో మహారాష్ట్ర గురువారం తన ప్రతిభాపాటవాలను మరోసారి రుజువు చేసుకుంది. యూత్ గేమ్స్ చాంపియన్‌షిప్ పరుగు పందేల్లో మొత్తం నాలుగు పతకాలకు పోటీలు నిర్వహించగా ఏకంగా మూడింటిని మహారాష్ట్ర క్రీడాకారులే సొంతం చేసుకున్నారు.

  యువజన క్రీడోత్సవాల్లో భాగంగా నిర్వహించన ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో మహారాష్ట్ర 8 స్వర్ణపతకాలను, 3 రజత పతకాలను, ఒక కాంస్య పతకాన్ని సొంతంచేసుకుంది. దీనితో గురువారం ఉదయం పోటీలు ముగిసేసరికి మహారాష్ట్ర అథ్లెట్లు పతకాల పట్టికలో మరింత అగ్రభాగానికి పురోగమించారు. మహారాష్ట్ర మొత్తం 29 స్వర్ణపతకాలను గెలుచుకుంది. హర్యానా మహారాష్ట్రపై స్వల్ప ఆధిక్యంతో 30 స్వర్ణపతకాలు సొంతం చేసుకుంది.

  బాలికల 200 మీటర్ల విభాగంలో మహారాష్ట్ర బాలిక సుధేష్ణా శివాంక 24.29 సెకన్లలో గమ్యం చేరుకుంది. తన రాష్ట్రానికే చెందిన అవంతికా నరాలేని అధిగమించి స్ప్రింట్ టైటిల్స్‌లో హ్యాట్రిక్ సాధించింది. అంతకు ముందు,.. బాలికల 100మీటర్ల విభాగంలో, 4x100 మీటర్ల పరుగులో కూడా ఆమె స్వర్ణపతకాలు సొంతం చేసుకుంది.

  ఇక బాలుర 200 మీటర్ల విభాగంలో మహారాష్ట్ర క్రీడాకారుడు ఆర్యన్ కదం 21.82 సెకన్లలో గమ్యం చేరుకుని, టైటిల్ గెలుచుకున్నాడు. ఇక బాలికల 4x400మీటర్ల విభాగంలో రియా పాటిల్, ప్రాంజలీ పాటిల్, వైష్ణవీ కతూరే, శివేచ్ఛా పాటిల్‌లతో కూడిన జట్టు స్వర్ణపతకం సొంతం చేసుకుంది. తమ ప్రత్యర్థి పంజాబ్ జట్టుపై 50మీటర్ల తేడాతో వారు విజయం సాధించారు. పంజాబ్‌కు ఈ పోటీలో రెండవ స్థానం దక్కింది.

   మధ్యప్రదేశ్‌కు చెందిన అర్జున్ వాస్కలే డబుల్ టైటిల్స్ సాధించాడు. బాలుర 3,000మీటర్ల విభాగంలో 8:37.62సెకన్లలో గమ్యం చేరుకుని టైటిల్ గెలిచాడు. అంతకు ముందు అంటే పోటీల తొలి రోజునే 1,500మీటర్ల విభాగంలో కూడా అతను టైటిల్ సొంతం చేసుకున్నాడు.

  తమిళనాడుకు చెందిన ప్రదీప్ సెంథిల్‌కుమార్ (1:49.83) మరింత మెరుగైన ప్రతిభను ప్రదర్శించి ఎన్. శ్రీకిరణ్‌ నెలకొల్పిన ఇదివరకటి రికార్డును అధిగమించాడు. దాదాపు ఒక సెకండ్ వ్యవధి తేడాతో 800మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఈ పోటీలో హర్యానాకు చెందిన సోమనాథ్ చౌహాన్ (1:51.63)పై సెంథిల్‌ ఆధిక్యం సాధించాడు. 

   ఇక బాలికల 3,000 మీటర్ల విభాగంలో జార్ఖండ్‌కు చెందిన సుప్రీతి కచ్చాప్ 9:46.14తో గమ్యం చేరుకుని కొత్తరికార్డు నెలకొల్పింది. ఈ పోటీలో ఇదివరకు సీమా ఎం అనే బాలిక నెలకొల్పిన రికార్డు (9:50.54)ను సుప్రీతి అధిగమించింది. 

   ఇక ఈ యువజన క్రీడోత్సవాల బాలుర హాకీ ఫైనల్ పోటీలో పంజాబ్ జట్టు, ఉత్తప్రదేశ్ జట్టుతో తలపడుతుంది. తొలి సెమీ ఫైనల్ పోటీలో పంజాబ్ జట్టు 3-0 గోల్స్‌తో ఝార్ఖండ్‌పై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించగా, హోరాహోరీగా జరిగిన మరో సెమీఫైనల్ పోటీలో ఉత్తరప్రదేశ్ జట్టు 3-2గోల్స్ తేడాతో ఒడిశా జట్టుపై గెలిచి ఫైనల్ చేరింది. ఉత్తప్రదేశ్ తరఫున శారదానంద్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేయడంతో ఒడిశాపై ఉత్తరప్రదేశ్ జట్టు ఆధిక్యం సాధించి సెమీఫైనల్లో గెలిచింది. 

https://ci5.googleusercontent.com/proxy/oozImOdmDVttVH-tT4b-ujd8vg-okgjfmrv_qjMDAHcV6ngQX6DOSIeSFciw-TKUXDuD78jp097ybHDdbLzzCOT1QqODPrRedqW1qiha0MPTAqvSjkB9uHwrrA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00176KY.jpg

హర్యానా రాష్ట్రం, పంచకులలోని తావూ దేవీలాల్ స్డేడియంలో జరిగే ఖేలో ఇండయా యువజన క్రీడోత్సవం, బాలికల 3,000మీటర్ల పరుగు పోటీలో పతక విజేతలు

 

 

అన్ని ఫైనల్ పోటీల ఫలితాలు (ఉదయం పూట జరిగిన పోటీలు):

జి: గోల్డ్ (స్వర్ణపతకం), ఎస్: సిల్వర్ (రజత పతకం), బి: బ్రాంజ్ (కాంస్య పతకం)

 

అథ్లెటిక్స్:

బాలురు

3,000 మీటర్ల విభాగం జి-అర్జున్ వాస్కలే (మధ్యప్రదేశ్) 8:37.62; ఎస్-గగన్ సింగ్ (హర్యానా) 8:40.96; బి–సావన్ (హర్యానా) 8:44.01

800మీటర్ల విభాగం: జి-ప్రదీప్ సెంథిల్ కుమార్ (తమిళనాడు) *ఎన్.ఆర్.1:49.83; ఎస్-సోమనాథ్ చౌహాన్ (హర్యానా) 1:51.63; బి-శ్యామ్ మిలన్ బింద్ (మధ్యప్రదేశ్) 1:51.68

200 మీటర్ల విభాగం: జి-ఆర్యన్ కదం (మహారాష్ట్ర) 21.82; ఎస్-ఆర్యన్ ఎక్కా (ఒడిశా) 22.10; బి-అంకిత్ చౌదరి (తెలంగాణ) 22.27

లాంగ్ జంప్: జి: ఆర్యన్ చౌధరీ (ఢిల్లీ) 7.42, ఎస్: చంద్రశేఖర్ (ఉత్తరప్రదేశ్) 7.38, బి: ఎస్. దర్శన్ శక్తివేల్ (తమిళనాడు) 7.34

4x400 రిలే పరుగు: జి: తమిళనాడు 3:16.58, ఎస్: హర్యానా 3:19.88, బి: ఢిల్లీ 3:22.72

https://ci5.googleusercontent.com/proxy/Gl3B7HydqtGES5w8PebvPy8qJ5w0gmwpA_nWIDK9A8j1dr6ivlTd46bvle_oBpTwxFXAXTmiZqxhobJ2mHnjLYzJ71rpifVN6Kiu_d3viiG28KTA93A5SKjBnQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002LE2U.jpg

ఖేలో ఇండియా యవజన క్రీడోత్సవపు 4X400  బాలికల రిలే పరుగు పోటీలో పతక విజేతలు. ఈ పోటీలో మహారాష్ట్ర జట్టు స్వర్ణ పతకం గెలిచింది.

https://ci3.googleusercontent.com/proxy/tSJTODfgOjjqIWjaTqCnb6HPkm3QLkFj3J_UzkqnlTg5eaUGNaI_JxyEXR_crgYqJsmsSQZXLmsE_uYJX384E1XuYHP4QVVFFAlvcss-kOMrM6RPfLfzRQidPQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003RE8U.jpg

హర్యానా రాష్ట్రం, పంచకులలోని తావూ దేవీలాల్ స్టేడియంలో జరిగిన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవం బాలుర 3,000మీటర్ల పోటీలో పతక విజేతలు

 

బాలికలు

3,000 మీటర్ల విభాగం: జి-సుప్రీతీ కచ్చాప్ (ఝార్ఖండ్) *ఎన్.ఆర్. 9:46.14; ఎస్-రీనా (ఉత్తరప్రదేశ్) 10:07.47; బి-మమతా పాల్ (ఉత్తరప్రదేశ్) 10:07.50

800 మీటర్ల విభాగం: జి-ఆశాకిరణ్ బార్లా (జార్ఖండ్) 2:12.98; ఎస్-ఊర్వశి (హర్యానా) 2:13.42; బి- లక్షితా శాండిలియా (గుజరాత్) 2:14.04

200మీటర్ల విభాగం: జి-సుధేష్ణా శివాంక (మహారాష్ట్ర) 24.29; ఎస్-అవంతికా నరాలే (మహారాష్ట్ర) 24.75; ఎస్-మాయావతి నకరేకంతి (తెలంగాణ) 24.94

4x400 రిలే పరుగు: జి: మహారాష్ట్ర 4:02.76, ఎస్: పంజాబ్ 4:08.21, బి: తమిళనాడు 4:10.14

https://ci4.googleusercontent.com/proxy/tS-QlWj447ApFfSyBYhTBjbvdZt6xAeQNsVousXHAOPz04fTsqxKsZAkasAFEnLf3sw8P7AU3PF7CN7jRRbSSRt4LTkVpKANd2kOrHUhJJNy9oAi2-VwQ2VE9w=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ML4G.jpg

హర్యానా రాష్ట్రం, పంచకులలోని తావూ దేవీలాల్ స్టేడియంలో జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవం, బాలుర 102 కిలోల విభాగం వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో పతకాలు గెలిచిన విజేతలు

https://ci4.googleusercontent.com/proxy/neW7N9jdYEzuKJ0IFWd57oUtqnwdkhVSmZJlJHr13CbWHXP3uylw4VfWjR3uVQ22Rh8Oc0rL6vX2YhF6SRS8DMLR_AS9UagY0yoUTvUDGoJHeiQ5u-g7wixO2A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005P0KD.jpg

హర్యానా రాష్ట్రం, పంచకులలోని తావూ దేవీలాల్ స్డేడియంలో జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవం, బాలికల +81 కిలోల కేటగిరీలో పతకాల విజేతలు

 

వెయిట్‌లిఫ్టింగ్:

బాలురు

102కిలోల విభాగం: జి: భోలా సింగ్ (బీహార్) 282, ఎస్: పర్వీందర్ సింగ్ (పంజాబ్) 266, బి: ప్రియాంశు (ఢిల్లీ) 261

బాలికలు

+81కిలోల విభాగం:  జి: ఎం. మార్టినా దేవి (మణిపూర్) 186, ఎస్: కె. ఒవియా (తమిళనాడు) 164, బి: ఆర్. గాయత్రి (ఆంధ్రప్రదేశ్) 160

 

****


(Release ID: 1832777) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi , Marathi