సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
విజయ గాథ: మహిళా పారిశ్రామికవేత్తలకు విజయవంతమైన బాట వేస్తున్న ఎంఎస్ఎంఈ
Posted On:
09 JUN 2022 2:38PM by PIB Hyderabad
ఆధ్యా ఎంటర్‌ప్రైజెస్ అనేది ఢిల్లీ ఆధారిత ముగ్గురు మహిళల నడిపే సంస్థ. వారు బ్యాక్‌ప్యాక్‌లు, స్కూల్ బ్యాగ్‌లు, జిమ్ బ్యాగ్‌లు, ట్రావెల్ బ్యాగ్‌లు మొదలైన వాటితో సహా విభిన్నమైన పోర్ట్‌ఫోలియో మరియు బ్యాగ్‌ల విస్తృత వర్గాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ-డీఐ సహాయంతో దిల్లీ యూనిట్ ఎంఎస్ఎంఈ కేటగిరీలో సంస్థ నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగా వారికి నగదు క్రెడిట్ వ్యవధి గణనీయంగా తగ్గింది. తద్వారా ఆ సంస్థకు నగదు ప్రవాహం, లాభదాయకత మెరుగుపడ్డాయి.
ఎంఎస్ఎంఈ యొక్క ఛాంపియన్ డెస్క్ వారికి కొత్త వ్యాపార మార్గాలతో మార్గనిర్దేశం చేసింది. వారి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మరిన్ని వర్గాలు మరియు ప్లాట్‌ఫారమ్‌లను పరిచయం చేయడానికి MSME-DI వారికి సహాయపడింది. ఎంఎస్ఎంఈ అందించిన మద్దతును యూనిట్ గుర్తించింది. దీని ద్వారా వారు IITF-2021లో పాల్గొనే అవకాశాన్ని పొందారు, అందులో వారు దేశీయ మరియు ఎగుమతి ప్రాధాన్యాన్ని పొందారు.
***
(Release ID: 1832672)
Visitor Counter : 121