ఆర్థిక మంత్రిత్వ శాఖ

2014 నుండి ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలు ఆర్థిక వ్యవస్థను, ప్రజలను క్లిష్ట సమయాల్లో తేలిగ్గా ఉంచడానికి సహాయపడ్డాయి: శ్రీమతి నిర్మలా సీతారామన్


మహమ్మారి సమయంలో ప్రభుత్వ లక్ష్య విధానం పౌరులకు సహాయం అందించడానికి దోహద పడింది: ఎఫ్ఎం

ఆర్థిక వ్యవహారాల శాఖ ఐకానిక్ డే వేడుకలను ప్రారంభించిన ఎఫ్ ఎం:
'నేత్రా పోర్టల్ , మొబైల్ అప్లికేషన్‘ ప్రారంభించిన శ్రీమతి సీతారామన్

ఎక్స్ టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ లు, ఫైనాన్షియల్ లిటరసీ , ఇతర దేశాలకు ప్రభుత్వం ద్వారా క్రెడిట్ లైన్స్ పై మూడు డిఇఎ లఘు చిత్రాలను ప్రారంభించిన ఆర్థిక మంత్రి

Posted On: 08 JUN 2022 2:38PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (అకాం) లో భాగంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తో ఆర్థిక వ్యవహారాల శాఖ ఐకానిక్ డే వేడుకలను ప్రారంభించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి తో పాటు, ఆర్థిక

వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు డా. అనంత వి. నాగేశ్వరన్ సెబీl హోల్ టైమ్ మెంబర్ శ్రీ ఎస్.కె. మొహంతి కూడా పాల్గొన్నారు కార్యక్రమానికి  ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు , ప్రముఖులు కూడా హాజరయ్యారు.

 

2014 నుంచి ప్రభుత్వం తీసుకున్న అనేక

చర్యల కారణంగా భారత దేశ మూలాలు మరోసారి దృఢమయ్యాయని ఆర్థిక మంత్రి

తన ప్రసంగంలో పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి రాక ముందు కార్పొరేట్ పన్నును తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా డిజిటలైజ్ చేయడం, జిఎస్టి , ఐబిసిని తీసుకురావడం - వంటి ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలు,మహమ్మారి కల్పించిన అసాధారణమైన పరిస్థితికి మనలను సిద్ధం చేశాయని ఆమె అన్నారు.

 

సహాయం అందించడంలో ప్రభుత్వం లక్ష్యిత విధానాన్ని అనుసరించి, క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకొని, త్వరగా, సకాలంలోపారదర్శక రీతిలో చేసినప్పుడు, దాని ప్రభావం ప్రతి ఒక్కరూ చూస్తారని శ్రీమతి సీతారామన్ అన్నారు. సందర్భంగా

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పిఎమ్ జికెవై) పై జరిగిన ఒక అధ్యయనాన్ని ఆమె

ప్రస్తావించారు.ఇది దేశవ్యాప్తంగా ప్రజలు వినియోగ వస్తువులను తగ్గించే సంభావ్యత ను  75% తగ్గించింది. డబ్బును అప్పు తీసుకునే సంభావ్యతను కూడా  పిఎంజికెవై 67% తగ్గించిందని అధ్యయనం వెల్లడించింది

 

ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ గ్యారెంటీ స్కీమ్ (ఇసిఎల్జిఎస్) పై మరొక అధ్యయనాన్ని ఉటంకిస్తూ, పథకం కింద మంజూరైన రుణాలు మార్చి 2022 నాటికి రూ .3.19 లక్షల కోట్లు దాటాయని, ఇప్పుడు ఇసిఎల్జిఎస్ పరిధిని 2023 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.మహమ్మారి సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చాలా మందికి  ఉపశమనం కల్పించినట్లు అధ్యయనం పేర్కొంది.

 

ఆర్థిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించిన మూడవ అధ్యయనం ఆయుష్మాన్ భారత్ పథకంపై ఉంది, దీని ప్రకారం  పథకం అమలు జేబు వెలుపల ఆరోగ్య వ్యయంలో 21%,  అత్యవసర ఆరోగ్య ప్రయోజనాల కోసం అప్పు తీసుకునే పరిస్థితి లో 8% తగ్గింపుతో ముడిపడి ఉన్నట్టు వెల్లడైంది.

 

అనేక బహుళ  సంస్థల మద్దతుతో ఆర్థిక వ్యవహారాల శాఖ దేశంలోని ప్రతి ప్రాంతం వైపు విదేశీ సాయాన్ని మళ్లించిందని ఆర్థిక మంత్రి చెప్పారుభారతదేశం చాలా తెలివిగా నిధులను సమీకరించి , వాటిని మౌలిక సదుపాయాల నిర్మాణానికి మాత్రమే కాకుండా ప్రతి ప్రాంతంలో జీవనోపాధి అవకాశాల కోసం కూడా పంపిణీ చేసిందని చెప్పారు. అనేక దేశాల్లో విస్తరించిన ఐడియాస్ ప్రాజెక్ట్ ద్వారా డిఇఎ ప్రయత్నాలను శ్రీమతి సీతారామన్ అభినందించారు . ఇది చాలా దేశాలలో విస్తరించి ఉంది జీవనోపాధి వాతావరణానికి, ప్రత్యేకించి పలు ఆఫ్రికా , ద్వీప దేశాలకు కూడా ఇది ఒక వ్యత్యాసాన్ని కలిగిస్తుంది.

 

ఆకాం వేడుకల సందర్భంగా ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ అనంత వి. నాగేశ్వరన్ మాట్లాడుతూ, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్టి) దివాలా కోడ్ (ఐబిసి) వంటి ప్రభుత్వ నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ ప్రస్తుత  రాజకీయ పరిణామాలుస్థూల ద్రవ్య విధాన సవాళ్ల ప్రస్తుత మేఘాలు తొలగిపోయిన తర్వాత.రాబోయే దశాబ్దంలో వాటి ప్రయోజనాలు , సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని అన్నారు. కారణాల వల్ల 2026-27 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ  ఐదు ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోందని, ప్రతి ఏడు సంవత్సరాలకు దేశ జిడిపి రెట్టింపు అయితే, తలసరి ఆదాయం 15,000 డాలర్లకు దగ్గరగా ఉన్న 2040 నాటికి మనం 20 ట్రిలియన్ డాలర్ల జిడిపిగా ఉంటామని ఆయన తెలిపారు.

 

ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో భారతదేశం అనేక ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉందని డాక్టర్ నాగేశ్వరన్ పేర్కొన్నారు.

స్థిరమైన అధిక వృద్ధి రేటును నిర్వహించడం, ద్రవ్యోల్బణాన్ని తటస్థంగా ఉంచడం, ఆర్థిక వ్యవస్థను సమతుల్యంగా ఉంచడం, రూపాయి బాహ్య విలువ స్థిరంగా ఉండేలా చూడటం వంటి సవాళ్లను మనం ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. అయితే కీలక అంశాలను సమతుల్యం చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఇఎ స్పష్టం చేశారు.

 

శ్రీమతి సీతారామన్  సందర్భంగా గా 'నేత్రా (న్యూ -ట్రాకింగ్ అండ్ రిమోట్ అడ్మినిస్ట్రేషన్)' పోర్టల్ , మొబైల్ అప్లికేషన్ ఫర్ ఇండియన్ డెవలప్ మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీం (IDEAS)ని ప్రారంభించారు.

 

ఎన్ ఎస్ డి ఎల్ అవుట్ రీచ్ చొరవ 'మార్కెట్ కా ఏకలవ్యఎక్స్ ప్రెస్' అనే కార్యక్రమాన్ని సందర్భంగా ప్రదర్శించారు. విద్యార్థులకు పెట్టుబడి , ఆర్థిక మార్కెట్ల ప్రాథమిక అంశాలను పరిచయం చేయడానికి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

 

'మార్కెట్ కా ఏకలవ్యఎక్స్ ప్రెస్ఆర్థిక అవగాహన, ఆర్థిక క్రమి శిక్షణ అనే  ఆర్థిక స్వాతంత్ర్యం జంట స్తంభాలకు సరళమైన భాషలో, సంక్లిష్టమైన భావనలను వివరించడానికి దైనందిన జీవితంలోని సాపేక్ష ఉదాహరణలను ఉపయోగించి.

పునాది వేస్తుంది, అకామ్ వేడుకల్లో భాగంగా, 75 ఏళ్ల  స్వాతంత్య్రానికి గుర్తుగా ఎన్ ఎస్ డి ఎల్ ఇటీవల 8 భాషల్లో 75 నగరాలకు చేరుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ వేడుకల సందర్భంగా ఎక్స్ టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులపై 'సహయోగ్ సే సమృద్ధి' అనే లఘు చిత్రాన్ని కూడా ఆర్థిక మంత్రి విడుదల చేశారు. చిత్రం 1947 నుండి భారతదేశ అభివృద్ధి పథంలో బయటి నుంచి సహాయం అందించే ప్రాజెక్టుల పాత్రను ప్రదర్శించింది, గత 8 సంవత్సరాలలో బహుళ  , ద్వైపాక్షిక సంస్థలతో భారతదేశ భాగస్వామ్యం పై ప్రత్యేక దృష్టి సారించింది.

 

సహయోగ్ సే సమృద్ధి':

 

శ్రీమతి సీతారామన్ఐడియాస్ - ఇండియా పార్టనర్ ఇన్ గ్లోబల్ గ్రోత్అనే క్రెడిట్ లైన్లో ఒక చిత్రాన్ని కూడా ప్రారంభించారు.అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు నమ్మకమైన అభివృద్ధి భాగస్వామిగా భారతదేశం గుర్తింపును చిత్రం ఆవిష్కరించింది. భాగస్వామ్య దేశాలలో సామాజిక- ఆర్థికాభివృద్ధిలో భారత అభివృద్ధి, ఆర్థిక సహాయ పథకం ( డి ఎస్) కీలక పాత్ర పోషించింది.ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, ఓషియానియా , సిఐఎస్ ప్రాంతంలో జిఓఐ లైన్స్ ఆఫ్ క్రెడిట్ కింద ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ చేసిన కీలక మార్క్యూ ప్రాజెక్టులను చిత్రం కలిగి ఉంది.

 

" డి ఎస్ (IDEAS) - గ్లోబల్ గ్రోత్ లో భారతదేశ భాగస్వామ్యం":

 

ఆర్థిక వ్యవహారాల విభాగం సహకారంతో సెబీ నిర్వహించిన 'జాగృక్ నివేషాక్: సమృద్ధి భారత్ కీ నీవ్' అనే అంశంపై జరిగిన సింపోజియంలో 'సెక్యూరిటీస్ మార్కెట్లో మహిళా ఇన్వెస్టర్ల ఆవిర్భావం', 'భారతీయ రిటైల్ ఇన్వెస్టర్ల ఎదుగుదల' అనే అంశాలపై ఉదయం సెషన్ లో  చర్చించారు.వివేచనాత్మక ఆర్థిక ఎంపికలు చేయడానికి శక్తివంతుడైన జ్ఞానోదయ పెట్టుబడిదారుడి ఆలోచన చర్చలకు కేంద్రబిందువుగా ఉంది. సింపోజియం ను ఆర్థిక మార్కెట్లలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే ప్రోత్సాహకరమైన ధోరణి ద్వారా అందించే ఉత్తేజకరమైన అవకాశాలను అన్వేషించడానికి కూడా ఉద్దేశించారు.

 

***



(Release ID: 1832523) Visitor Counter : 164