యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
తంగ్-తాను కాశ్మీర్ లోని ఒక మౌల్వి ఎలా రక్షించాడు?
Posted On:
07 JUN 2022 5:03PM by PIB Hyderabad
జమ్ము కాశ్మీర్ లో తంగ్ తా క్రీడపట్ల యువతను ఆకర్షితులను చేయడానికి మహ్మద్ ఇక్బాల్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు.
"20 సంవత్సరాల క్రితం నేను ఒక ప్రైవేటు శిక్షకుడిని, బాల బాలికలకు తంగ్ తా లో ఉచితంగా శిక్షణ ఇచ్చేవాడిని" అని చెప్పుకున్న ఇక్బాల్ ఇప్పుడు రాష్ట్రంలో పేరెన్నికగన్న కోచ్. అతని టీమ్ ఖేలో ఇండియా యూత్ గేమ్‌లో పోటిపడింది.
"తొలినాళ్లలో , బాలికలు ఈ క్రీడా తరగతులకు హాజరుకావడాన్ని స్థానికులు అభ్యంతర పెట్టేవారు. వీరిలో చాలా మంది చాలా తీవ్రంగా స్పందిస్తూ మా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తూ ఉండేవారు" అని ఇక్బాల్ చెప్పారు.
అయితే అప్పట్లో ఇక్బాల్ నివసించే ప్రాంత స్థానిక మసీదు అధిపతి ఇతనికి సాయపడ్డాడు. "మౌల్వి, పలువురు పాఠశాలల ప్రిన్సిపల్స్ నా నడవడి గురించి అనుకూలంగా మాట్లాడారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని వారికి మాట ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను " అని ఇక్బాల్ అన్నారు.
ఇది బాలికలు ఈ క్రీడ నేర్చుకోడానికి ఉపయోగపడింది. ఎంత వ్యతిరేకత ఉన్నా బాలికలు ఈ క్రీడను నేర్చుకునేందుకు గట్టి సంకల్పం ప్రదర్శించారు.
చాల సంవత్సరాలుగా తీవ్రవాదం నీడలో ఉన్న ఈ ప్రాంతంలో మహ్మద్ ఇక్బాల్ వేలాది మంది పిల్లలను తంగ్ తా క్రీడవైపు ఆకర్షితులను చేశారు. వారిని ప్రధాన స్రవంతిలో ఉంచేందుకు ఆయన ఈ పని చేశారు.
ఇవాళ ఆనాడు నేర్చుకున్న వారిలో చాలామంది యువతీ యువకులు స్థానిక కోచ్‌లుగా ఉన్నారు. కొద్దిమంది ప్రపంచంలోని పలు ప్రాంతాలకు, దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించారు. కొరియా, దుబాయ్ ఇరాన్ లలో ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొన్నవారున్నారు. వీరు ఇతరులకు ప్రేరణనిస్తున్నారు అని ఇక్బాల్ సగర్వంగా చెబుతుంటారు.
"మణిపూర్ ఈ శాన్య ప్రాంతంలో ని తంగ్ -తా కొండ కోనలు, మైదనా ప్రాంతాలు దాటి ఉత్తరాదిన జమ్ము కాశ్మీర్ కు ఎలా చేరిందన్నది ఊహించడం కష్టం. ఈ క్రీడ మన దేశంలోనే పుట్టిన మార్షల్ ఆర్ట్ రూపం.ఈ క్రీడను మేం స్వీకరించాం అంతే" అని ఇక్బాల్ అంటారు." నేను పాఠశాలలో చదువుకునే రోజులలోనే ఈ క్రీడకు ఆకర్షితుడినయ్యాను "అని ఇక్బాల్ అంటారు.
ఆరోజుల్లో జరిగిన స్థానిక టోర్నమెంట్ తంగ్ త విస్తరణకు దోహదపడిందని చాలామంది భావిస్తారు. అప్పట్లో టోర్నమెంట్‌ను మాకు ఈ క్రీడ గురించి అవగాహన రావడానికి ఏర్పాటు చేశాం. ఆ తర్వాత నేను 1999 మణిపూర్ నేషనల్ గేమ్స్ లో పాల్గొన్నాను.
ఈ క్రీడ నేర్చుకున్న వారు కాస్త పెద్దయి కోచ్ అయ్యాక వారికి మణిపురి తంగ్ తా ఫెడరేషన్ నుంచి ఆహ్వానం అందుతుంది. వారు వీరికి ఇందులో అధునాతన మెళకువలు, శిక్షణ ఇస్తారు.
ఇవాళ 20 కిపైగా తంగ్ తా క్లబ్‌లు శ్రీనగర్ శివార్లలో ఉన్నాయి. వీటిలో చాలామంది ఇక్బాల్ శిష్యులు శిక్షణ ఇచ్చే వారుగా ఉన్నారు..
"ఇప్పుడు ఇది ఒక రకంగా క్రీడా సంప్రదాయంగా మారింది. ఆయా కుటుంబాల వారు కూడా తమ పిల్లలను ఈ క్రీడ నేర్చుకునేందుకు పంపడానికి సంతోషంగా ఉన్నార"ని జమ్ము కాశ్మీర్ తంగ్ తా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయాజ్ అహ్మద్ భట్ అంటారు.
"ఇప్పుడు బాలికలు తమ స్వీయ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు" అని ఇక్బాల్ సగర్వంగా చెబుతుంటారు.
***
(Release ID: 1832124)
Visitor Counter : 182