ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) వేడుకల్లో సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


మిషన్ కర్మయోగిలో భాగంగా వ్యయ విభాగం శిక్షణా మాడ్యూల్స్ ఆవిష్కరణ

Posted On: 07 JUN 2022 7:14PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పిఎఫ్ఎంఎస్ కి చెందిన సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) డ్యాష్‌బోర్డ్‌ను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి   నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏకేఏఎంని జరుపుకోవడానికి 6 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు ‘ఐకానిక్ వీక్’ వేడుకలను నిర్వహిస్తోంది. 

మిషన్ కర్మయోగిలో భాగంగా వ్యయ విభాగం  శిక్షణా మాడ్యూల్స్ని కూడా ఆవిష్కరించారు. 

ఆర్థిక శాఖ, వ్యయ విభాగాల కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, శ్రీమతి సోనాలి సింగ్,   పిఎఫ్ఎంఎస్ డివిజన్ అదనపు సిజిఏ శ్రీమతి ధరిత్రి పాండా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్ఎన్ఏ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో, గత 75 ఏళ్లలో సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో పబ్లిక్ ఫైనాన్స్‌లో  ఎస్ఎన్ఏ అమలు ఒక మైలురాయి అని అన్నారు.  ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్‌లో పారదర్శకతను తీసుకువచ్చి మంచి గుర్తింపు తచ్చినందుకు సిజిఏ బృందాన్ని శ్రీమతి సీతారామన్ అభినందించారు.  ఎస్ఎన్ఏ ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు వంటి ఇతర వాటాదారులు కూడా హాజరు కావడం పట్ల ఆర్థిక మంత్రి హర్షం వ్యక్తం చేశారు.  సిఎస్ఎస్ ద్వారా ఇప్పుడు రాష్ట్రాలకు నిధులు విడుదల చేయడాన్ని శ్రీమతి సీతారామన్ ప్రశంసించారు మరియు   ఎస్ఎన్ఏ విజయం గురించి స్థానిక భాషలలో తెలియజేయాలని, తద్వారా సాధారణ ప్రజలకు పాలనను సులభతరంగా అర్థమయ్యేలా చేయాలనీ అధికారులను కోరారు.

అధికారులకు సాధికారత, శిక్షణ, నైపుణ్యం కోసం శిక్షణా మాడ్యూళ్లను రూపొందించడానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌తో మిషన్ కర్మయోగి కలిసి పనిచేయడాన్ని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాలు మిషన్ కింద శిక్షణ కోసం మొదట ముందుకు వచ్చినందుకు శ్రీమతి సీతారామన్ ప్రశంసించారు.

ఆర్థిక కార్యదర్శి డాక్టర్ సోమనాథన్ మాట్లాడుతూ, తుది లబ్ధిదారుని వరకు చేరుకునే వివిధ పథకాలు, కార్యక్రమాల డబ్బు కళ్ళకు కనబడేలా చేయడమే ఎస్ఎన్ఏ ప్రాథమిక విజయం అని అన్నారు.  నిధుల నిర్వహణలో తీసుకుంటున్న చర్య వల్ల వడ్డీ ఖర్చులు ఆదా అవుతాయని, ద్రవ్య లోటును నియంత్రించడంలో ఈ చర్యలు సహాయపడతాయని ఆయన తెలిపారు. అలాగే ఎస్ఎన్ఏ మౌలికమైన కీలక అంశాన్ని కేంద్రీకృతంగా చూడడంతో పాటు, వికేంద్రీకృత పరిధులను కలిగి ఉండటం రాష్ట్రాలు, ఏజెన్సీలకు పథకాల అమలులో స్వేచ్ఛనిస్తుందని ఆర్థిక కార్యదర్శి నొక్కి చెప్పారు.

 

ఎస్ఎన్ఏ డాష్‌బోర్డ్ గురించి... 

ఎస్ఎన్ఏ డ్యాష్‌బోర్డ్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్ఎస్) కోసం నిధులు విడుదల చేయడం, పంపిణీ చేయడం, పర్యవేక్షించడం వంటి వాటికి సంబంధించి 2021లో ప్రారంభించిన ఒక ప్రధాన సంస్కరణ. ఈ సవరించిన విధానం, ఇప్పుడు  ఎస్ఎన్ఏ  మోడల్‌గా సూచిస్తారు, ప్రతి రాష్ట్రం ప్రతి స్కీమ్‌కు  ఎస్ఎన్ఏ ని గుర్తించి, డెసిగ్నెట్ చేయాలి. నిర్దిష్ట స్కీమ్‌లోని ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం నిధులు ఇప్పుడు ఈ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి, ఇతర అన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల ఖర్చులు ఈ ఖాతా నుండి ఖర్చవుతాయి.  ఎస్ఎన్ఏ మోడల్ , సిఎస్ఎస్ కోసం రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు సకాలంలో, వివిధ నిబంధనలను పాటించిన తర్వాత జరుగుతాయని నిర్ధారిస్తుంది. ఈ మోడల్‌ను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల సిఎస్ఎస్ నిధుల వినియోగం, నిధుల ట్రాకింగ్, ఆచరణాత్మకంగా, రాష్ట్రాలకు సకాలంలో నిధులు విడుదల చేయడంలో సామర్థ్యాలు మరింత పెరుగుతాయి.

ఎస్ఎన్ఏ మోడల్‌లోని వాటాదారులకు స్కీమ్‌ల ఆపరేషన్‌లో అవసరమైన ప్రతిస్పందన, పర్యవేక్షణ సాధనాలను అందించడానికి,పిఎఫ్ఎంఎస్...  ఎస్ఎన్ఏ డాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేసింది. వివిధ రాష్ట్రాలకు మంత్రిత్వ శాఖలు చేసిన విడుదలలు,  ఎస్ఎన్ఏ ఖాతాలకు స్టేట్ ట్రెజరీలు చేసిన తదుపరి విడుదలలు, ఏజెన్సీల ద్వారా నివేదించిన ఖర్చులు,  ఎస్ఎన్ఏ ఖాతాలకు బ్యాంకులు చెల్లించే వడ్డీ మొదలైనవాటిని అర్థమయ్యే, సమాచారం, దృశ్యమానంగా ఆకర్షణీయమైన గ్రాఫిక్‌లలో ఎస్ఎన్ఏ వివరిస్తుంది. 

 

మిషన్ కర్మయోగి గురించి... 

అధికారుల పెంచడానికి  ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ (ఐఎన్జిఏఎఫ్), అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఏజేఎన్ఐఎఫ్ఎం) ఇగోట్ కర్మయోగి పోర్టల్ రూపొందించింది. డిఓపిటి ప్రచురించడానికి కోర్సులను అభివృద్ధి చేశాయి. జిఎఫ్‌ఆర్‌లు, ఇతర సూచనల వెలుగులో ప్రతిపాదనలను పరిశీలించడంలో వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల సమీకృత ఆర్థిక విభాగాల (ఐఎఫ్‌డిలు)లో ఉన్న అధికారులకు ఇది సహాయపడుతుంది.

***


(Release ID: 1832123) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi