రైల్వే మంత్రిత్వ శాఖ
ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్/ ఆప్ ద్వారా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ పరిమితిని పెంచినద భారతీయ రైల్వేలు
Posted On:
06 JUN 2022 12:56PM by PIB Hyderabad
ప్రయాణీకుల సౌకర్యార్ధం భారతీయ రైల్వేలు టికెట్ బుకింగ్ గరిష్ట పరిమితిని నెలకు 6 నుంచి 12కు ఆధార్‌తో అనుసంధానం లేని యూజర్ ఐడి ద్వారా చేసుకునేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయించింది. ఇక ఆధార్‌తో అనుసంధానమైన యూజర్ ఐడి ద్వారా బుక్ చేసుకునే సంఖ్యను నెలకు 12 నుంచి 24కు పెంచింది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లలో ఒక ప్రయాణీకుని టికెట్‌ను ఆధార్ ద్వారా ధృవీకరిస్తారు.
ప్రస్తుతం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్/ ఆప్ ద్వారా ఆధార్‌తో లంకెలేని యూజర్ ఐడితో గరిష్టంగా నెలకు 6 టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే, ఆధార్‌తో అనుసంధానమైన యూజర్ ఐడిని ఉపయోగించి ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్/ ఆప్ ద్వారా గరిష్టంగా నెలకు 12 టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న టికెట్లలో ఒకరి టికెట్‌ను ఆధార్ ద్వారా ధృవీకరిస్తారు.
***
(Release ID: 1831718)