హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పద్మ అవార్డులు-2023 నామినేషన్లకు 2022 సెప్టెంబర్ 15 వరకు గడువు

Posted On: 30 MAY 2022 4:18PM by PIB Hyderabad

2023 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులు -2023 కోసం ఆన్లైన్ నామినేషన్లు / సిఫార్సులు 2022 మే 1 న ప్రారంభ మయ్యాయి. పద్మ అవార్డుల నామినేషన్ల స్వీకరణ తుది గడువు 2022 సెప్టెంబర్ 15. తో ముగుస్తుంది.

 

పద్మ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు/సిఫారసులను నేషనల్ అవార్డ్స్ పోర్టల్ పై ఆన్ లైన్ లో మాత్రమే స్వీకరిస్తారు.

https://awards.gov.in

 

పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పద్మ పురస్కారాలు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటిగా ఉన్నాయి. 1954లో నెలకొల్పిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు.

కళలు, సాహిత్యం , విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ , ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, ట్రేడ్ , ఇండస్ట్రీ మొదలైన అన్ని రంగాలు/ విభాగాల్లో విశిష్టమైన ,అసాధారణమైన విజయాలు/సేవలకు గాను ఈ అవార్డు ఇస్తారు. జాతి, వృత్తి, హోదా లేదా లింగ భేదం లేకుండా వ్యక్తులు అందరూ కూడా ఈ అవార్డులకు అర్హులు. డాక్టర్లు, సైంటిస్టులు మినహా పి ఎస్ యు లలో పని చేసే ప్రభుత్వోద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కారు

.

పద్మ అవార్డులను "ప్రజా పద్మ"గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందువల్ల, స్వీయ నామినేషన్ తో సహా నామినేషన్ లు/సిఫారసులు సమర్పించాలని పౌరులను కోరడమైనది. మహిళలు, సమాజంలోని బడుగు- బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయవచ్చు.

 

నామినేషన్ లు/సిఫారసులు పైన పేర్కొన్న పోర్టల్ పై లభ్యం అయ్యే ఫార్మెట్ లో పేర్కొనబడ్డ అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉండాలి, సిఫారసు చేయబడిన ఆమె/అతని సంబంధిత రంగం/వృత్తిలో వారి వారి విశిష్టమైన , అసాధారణ ప్రతిభ/ విజయాలు/సర్వీస్ లను స్పష్టంగా వివరించే రూపంలో ఒక ప్రశంసాపత్రం (గరిష్టంగా 800 పదాలు) ఉండాలి.

 

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ (https://mha.gov.in) వెబ్ సైట్ లో 'అవార్డులు, పతకాలు' శీర్షిక కింద, పద్మ అవార్డుల పోర్టల్ (https://padmaawards.gov.in) లో లభిస్తాయి. ఈ అవార్డులకు సంబంధించిన నియమ నిబంధనలు https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్ తో వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

***


(Release ID: 1829590) Visitor Counter : 269