పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
భారతీయ గ్యాస్ ఎక్స్‌చేంజ్‌లో దేశీయ సహజవాయువు వాణిజ్యం జరిపే తొలి అన్వేషణ, ఉత్పత్తి (ఎక్స్‌ప్లొరేషన్ & ప్రొడక్షన్ -ఇ&పి) చేసే తొలి భారతీయ సంస్థగా ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఒఎన్‌జిసి)
Posted On:
23 MAY 2022 6:14PM by PIB Hyderabad
భారతీయ గ్యాస్ ఎక్స్‌చేంజ్‌లో దేశీయ సహజవాయువు వాణిజ్యం జరిపే తొలి అన్వేషణ, ఉత్పత్తి (ఎక్స్‌ప్లొరేషన్ & ప్రొడక్షన్ -ఇ&పి) చేసే తొలి భారతీయ సంస్థగా ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఒఎన్‌జిసి) అవతరించింది. భారతదేశంలో తొలి యాంత్రిక జాతీయ స్థాయి గ్యాస్ ఎక్స్‌చేంజ్ (ఐజిఎక్స్) పై ఒఎన్‌జిసి డైరెక్టర్ (ఆన్‌షోర్), ఇన్‌చార్జ్ మార్కెటింగ్ అనురాగ్ శర్మ తొలి ఆన్‌లైన్ అమ్మకాన్ని 23 మే 2022న చేశారు. ఒఎన్‌జిసి కృష్ణ గోదావరి 98/2 బ్లాక్ నుంచి ఉత్పత్తి అయిన సహజవాయువు అమ్మకమిది.
సహజవాయువు ధరలపై నియంత్రణలను 2020-21లో ఎత్తివేసిన తర్వాత, దానిపై లాభాలను పొందేందుకు ఒఎన్‌జిసి తనను తాను సంసిద్ధం చేసుకుంది. గ్యాస్ ఎక్స్‌చేంజ్ ద్వారా ఒఎన్‌జిసి అమ్మకాల పరిమాణం క్రమంగా పెంచనున్నారు.
ఫోటో కాప్ః ఐజిఎక్స్ పై తొలి గ్యాస్ ట్రేడింగ్ చేస్తున్నఒఎన్‌జిసి డైరెక్టర్ (ఆన్‌షోర్), ఇన్‌చార్జ్ మార్కెటింగ్ అనురాగ్ శర్మ
***
(Release ID: 1827825)
Visitor Counter : 183