పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

అక్టోబర్, 2022 నాటికి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భ‌వనం


- ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.707.73 కోట్లు

- ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత గంటకు 1200 మంది,సంవత్సరానికి 40 లక్షల మంది ప్రయాణికులకు సౌల‌భ్యం

Posted On: 19 MAY 2022 6:08PM by PIB Hyderabad

 

ప్రాచీన  అండమాన్ & నికోబార్ దీవుల‌లోని పోర్ట్ బ్లెయిర్‌ వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్వరలోనే కొత్త టెర్మినల్ భవనం అందుబాటులోకి రానుంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు రూ.707.73 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను నిర్మించేందుకు గాను పనులను చేపట్టింది.
మొత్తం 40,837 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ కొత్త టెర్మినల్ భవనం నిర్మిస్తున్నారు. ఈ టెర్మిన‌ల్ రద్దీ సమయాల్లో 1200 మంది ప్రయాణీకులను,ఏటా దాదాపు 40 లక్షల మంది ప్రయాణికుల పౌక‌ర్య‌వంతంగా ఉంటూ సేవ‌ల‌ను అందించ‌నుంది.  ఈ స‌రికొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం లోయర్ గ్రౌండ్,  పై గ్రౌండ్ , మొదటి అంతస్తుతో స‌హా మూడు అంతస్తుల్ని కలిగి ఉంటుంది. దిగువ గ్రౌండ్ ఫ్లోర్‌ను రిమోట్ అరైవల్, బస్ లాంజ్ మరియు సర్వీస్ ఏరియాగా, పై గ్రౌండ్ ఫ్లోర్‌ను ప్రయాణీకుల నిష్క్రమణ మరియు రాక కోసం టెర్మినల్ భవనానికి యాక్సెస్‌గాను, మొదటి అంతస్తు అంతర్జాతీయ ప్రయాణికుల కోసం సెక్యూరిటీ హోల్డ్ ఏరియా (ఎస్‌హెచ్ఏ)గా ఉపయోగించబడుతుంది. ప్రకృతి నుండి ప్రేరణతో  టెర్మినల్ రూపకల్పనను సముద్రం మరియు ద్వీపాలను వర్ణించే షెల్ ఆకార నిర్మిస్తున్నారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ అనేది అల్యూమినియం షీట్ రూఫింగ్ మరియు చుట్టూ కేబుల్ నెట్ గ్లేజింగ్‌తో అందించబడిన ఒక పెద్ద విస్తీర్ణం (120 మీట‌ర్ల‌) స్ట్రక్చరల్ స్టీల్ ఫ్రేమ్డ్ బిల్డింగ్. మొత్తం టెర్మినల్‌లో రోజుకు 12 గంటల పాటు 100 శాతం సహజ లైటింగ్ ఉంటుంది, ఇది స్కైలైట్‌ల ద్వారా సాధించబడుతుంది. ప్రపంచ స్థాయి భవనంలో 28 చెక్-ఇన్ కౌంటర్లు, మూడు ప్యాసింజర్ బోర్డింగ్ వంతెనలు మరియు నాలుగు కన్వేయర్ బెల్ట్‌లు ఉంటాయి. విమానాశ్రయంలోని సిటీ సైడ్ ఏరియా కూడా ల్యాండ్‌స్కేపింగ్‌తో పాటు కారు, టాక్సీ, బస్సులకు తగిన పార్కింగ్ సౌకర్యం అభివృద్ధి చేయబడుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్ కోసం నాలుగు అదనపు బేలను జోడించారు. అదనపు అప్రాన్ ప్రాంతం నిర్మాణం కూడా పురోగతిలో ఉంది. 80% కంటే ఎక్కువ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్ట్ అక్టోబర్, 2022 నాటికి పూర్తి చేయాలని  అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త టెర్మినల్ భవనం యొక్క కార్యాచరణ పర్యాటక పరిశ్రమ విస్తరణకు ప్రోత్సాహాన్నిస్తుంది మరియు తద్వారా ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పెరిగిన కనెక్టివిటీ స్థానిక కమ్యూనిటీకి కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టించడమే కాకుండా మెరుగైన విద్య మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తుంది.
పురోగతిలో ఉన్న ప‌ని - నగరం వైపు వీక్షణ దృశ్యం
ఎయిర్ సైడ్ దృశ్యం
పురోగతిలో ఉన్న ప‌ని - పై అంతస్తు
న‌గ‌రంవైపు ఎలివేషన్ యొక్క దృశ్యం
                                                                       

 ********



(Release ID: 1826778) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi