ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కర్ణాటక రాష్ట్రంలో పౌర భాగస్వామ్య పాలనను ప్రోత్సహించడానికి మైగవ్ కర్నాటక ప్రారంభం
Posted On:
18 MAY 2022 1:18PM by PIB Hyderabad
మైగవ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన పౌరుల భాగస్వామ్యం కలిగిన కార్యక్రమం. దీనిని గౌరవ ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ గారు 2014 జూలై 26న ప్రారంభించారు. మై గవ్ కర్ణాటక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయ్ 2022 మే 17న కర్ణాటకలో ప్రారంభించారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా మైగవ్ ఏర్పడిన రాష్ట్రాలలొ ఇది 17 వది.,
మై గవ్ కర్ణాటక అనేది ఒక ఐడియా క్రౌడ్ సోర్సింగ్ ప్లాట్ ఫారం. ఇది పౌరులను పాలనలో, విధాన నిర్ణయాలలో క్రియాశీలంగా భాగస్వామ్యం చేసేందుకు , వారు ఇందులో పాలుపంచుకునేందుకు ప్రోత్సహిస్తుంది.
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అధీకృత సమాచారాన్ని సకాలంలో అందించడంపై మైగవ్ కర్ణాటక ప్రత్యేక దృష్టిపెడుతుంది.
పౌరులు తమ పేర్లను karnataka.mygov.in నమోదుచేసుకుని, ప్రభుత్వానికి సంబంధించి వారి అభిప్రాయాలను, ఆలోచనలను, సూచనలను ఈ వేదికపై పంచుకోవచ్చు.
కర్ణాటక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడే రాష్ట్రం.అందుకు అనుగుణంగా కర్ణాటక తమ పౌరులు ప్రభుత్వ కార్యకలాపాలలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆ రాష్ట్రప్రభుత్వం కోరుకుంటున్నది. ఇందుకు వీలుగా మై గవ్ కర్ణాటక ద్వారా పౌరులు వివిధ కార్యకలాపాలకు సంబంధించి చర్చలు, లక్షాలు, ఇన్నొవేషన్ సవాళ్లు, అభిప్రాయ సేకరణ, సర్వేలు, బ్లాగ్‌లు, ప్రసంగాలు, క్విజ్‌లు , ప్రత్యక్ష కార్యకలాపాలలో పాలుపంచుకోవచ్చు.
మై గవ్ ఇండియా ను ప్రారంభించే సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో, ప్రభుత్వ పాలనలో పౌరుల భాగస్వామ్యం గురించి ప్రస్తావించారు. ఇది కేవలం ఓటింగ్ కు మాత్రమే పరిమితం కాకుండా మై గవ్ కార్యక్రమం దేశ నిర్మాణంలో సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి దోహదపడడంలో ముందడుగు అని అన్నారు.
ఈ విప్లవాత్మక ప్లాట్‌ఫారంలో పాల్గొనడం ద్వారా సుపరిపాలనలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావలసిందిగా, ఈకర్ణాటక ప్రభుత్వం తమ పౌరులను కోరింది.
(Release ID: 1826714)
Visitor Counter : 161