సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కన్హేరి గుహలలో సౌకర్యాల ప్రారంభోత్సవం
బుద్ధ పూర్ణిమ సందర్భంగా పురాతన కన్హేరి గుహలలో సౌకర్యాలను ప్రారంభించిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి
బుద్దుని భోధనలు నేటికి అనుసరణీయం..
ఘర్షణలు, వాతావరణ మార్పులు లాంటి బుద్దుని భోధలను పరిష్కరించవచ్చు..కిషన్ రెడ్డి
మన వారసత్వ పరిరక్షణ, సంరక్షణ,వ్యాప్తిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, కార్పొరేట్ , స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం అవసరం.. కిషన్ రెడ్డి
భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదను అందించాలి : జి కిషన్ రెడ్డి
Posted On:
16 MAY 2022 4:05PM by PIB Hyderabad
బుద్ధ పూర్ణిమ రోజున కన్హేరి గుహలలో నూతనంగా కల్పించిన సౌకర్యాలను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. 2022 మే 15,16 తేదీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కన్హేరి గుహలలో కల్పించిన సౌకర్యాలను ప్రారంభించారు.
#బుద్ధపూర్ణిమ 2022 శుభ దినం సందర్భంగా కన్హేరి, బోరివలిలో ప్రజా సౌకర్యాలను ప్రారంభించాను. #ముంబై
ఏఎస్ఐ-ఎన్ సి ఎఫ్ -ఐఓఎఫ్ ప్రాజెక్ట్‌లో భాగమైన ఈ సౌకర్యాలు పర్యాటకాన్ని మెరుగుపరుస్తాయి మరియు జాతీయ వారసత్వ రక్షణ, సంరక్షణ మరియు ప్రచారానికి సహకరిస్తాయి. pic.twitter.com/ WVkRh2LkXD
— జి కిషన్ రెడ్డి (@kishanreddybjp) మే 16, 2022
కన్హేరి గుహలు, అజంతా ఎల్లోరా గుహలు వంటి వారసత్వ ప్రదేశాల నిర్మాణ మరియు ఇంజనీరింగ్ అద్భుతాల గురించి నా ప్రసంగంలో ప్రస్తావించాను. పురాతన కాలంలో ప్రజల కళ, ఇంజనీరింగ్, నిర్వహణ నిర్మాణం, ఓర్పు పట్టుదల అంశాలకు ఈ కట్టడాలు నిదర్శనంగా ఉంటాయి. pic.twitter.com/ 6nclmxEGf9
— జి కిషన్ రెడ్డి (@kishanreddybjp) మే 16, 2022
మన వారసత్వాన్ని రక్షించడం, సంరక్షించడం మరియు ప్రచారం చేయడంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు లు మరియు పౌర సమాజం పాత్ర ముఖ్యమని స్పష్టం చేసాను. ఇలా జరిగినప్పుడు భవిష్యత్ తరాలకు ఈ సంపదలను అందించడానికి వీలవుతుంది. pic.twitter.com/ fzZehLLSWp
— జి కిషన్ రెడ్డి (@kishanreddybjp) మే 16, 2022
బోరివలిలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో ఉన్న కన్హేరి గుహలు సమాజ ఆరాధన, అధ్యయనం , ధ్యానం కోసం ఒక విలక్షణమైన బౌద్ధ సంస్థగా గుర్తింపు పొందాయి . pic.twitter.com/ 9NQOmp0SUv
— జి కిషన్ రెడ్డి (@kishanreddybjp) మే 16, 2022
కన్హేరిలో 110 కంటే ఎక్కువ విభిన్న రీతుల్లో రాతితో నిర్మించిన ఏకశిలా నిర్మాణాలను కలిగి ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద ఏకైక త్రవ్వకాల్లో ఒకటిగా కన్హేరి గుహలు గుర్తింపు పొందాయి.బౌద్ధమతం హీనయాన,మహాయాన దశల్లో వీటిని నిర్మించారు. కన్హేరి గుహల్లో మహాయాన కాలం నాటి శైలి కృత వాస్తుశిల్పానికి సంబంధించిన అనేక ఉదాహరణలు, వజ్రయాన క్రమం యొక్క కొన్ని ముద్రణలు కూడా కనిపిస్తాయి. కన్హేరి అనే పేరు ప్రాకృతంలోని 'కన్హగిరి' నుంచి ఉద్భవించింది. శాతవాహన పాలకుడు వాసిష్టీపుత్ర పులోమావి కాలం నాటి నాసిక్ శాసనం లో వీటి ప్రస్తావన ఉంది.
గుహల్లో సౌకర్యాలను ప్రారంభించిన అనంతరం శ్రీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. “కన్హేరీ గుహలు మన ప్రాచీన వారసత్వంలో భాగంగా ఉన్నాయి. మానవజాతి పరిణామ క్రమానికి, మన గత చరిత్రకు కన్హేరి గుహలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. వీటిలో కల్పించిన సౌకర్యాలను బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రారంభించడం సంతోషంగా గర్వకారణంగా ఉంది. సంఘర్షణ మరియు వాతావరణ మార్పు వంటి సవాళ్లను పరిష్కరించడంలో బుద్ధుని సందేశం నేటికీ అనుసరణీయంగా ఉంది ” అని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కన్హేరి, అజంతా ఎల్లోరా గుహల వంటి వారసత్వ ప్రదేశాల నిర్మాణ మరియు ఇంజనీరింగ్ అద్భుతాలు గతంలో ప్రజలకు ఉన్న కళ, ఇంజనీరింగ్, నిర్వహణ నిర్మాణం, సహనం మరియు పట్టుదలకు తార్కాణంగా నిలుస్తాయని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. అటువంటి అనేక స్మారక కట్టడాలు నిర్మించడానికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టిందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. సాంకేతిక మరియు ఇంజనీరింగ్ నైపుణ్యాలు అందుబాటులో ఉన్న 21వ శతాబ్దంలో ఇటువంటి కట్టడాలు నిర్మించడం కష్టమని వ్యాఖ్యానించారు.
వారసత్వ రక్షణ, సంరక్షణ, వ్యాప్తిలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు లు మరియు పౌర సమాజం పాత్ర కీలకంగా వుంటాయని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. వారసత్వం,పురాతన చరిత్రను భావి తరాలకు సంపదగా అందించాలని అన్నారు. విలువైన వారసత్వ సంపదను భావితరాలకు సంపదగా అందించేందుకు నిపుణులు, విద్యావేత్తలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశాభివృద్ధిలో వారసత్వ సంపద కీలక పాత్ర వహిస్తుందని గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ అంశంలో చురుగ్గా పాల్గొని తమ బాధ్యత నిర్వర్తించాలని శ్రీ కిషన్ రెడ్డి కోరారు.
భారతదేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు తమ అనుభవాల్లో కన్హేరి గుహలను ప్రస్తావించారు. 399-411 సీఈ మధ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ఫా-హెయిన్ రచనల్లో తొలిసారిగా కన్హేరి గుహల ప్రస్తావన ఉంది . ఆ తర్వాత కాలంలో భారతదేశంలో పర్యటించిన యాత్రికులు తమ అనుభవాల్లో ఈ గుహలను ప్రస్తావించడం జరిగింది. కన్హేరి గుహల్లో చేపట్టిన తవ్వకాల్లో అనేక నీటి తొట్టెలు, ఎపిగ్రాఫ్లు, పురాతన ఆనకట్ట, స్థూపం ఆకారంలో ఒక శ్మశాన వాటిక, వర్షపు నీటి సంరక్షణ కోసం నిర్మించిన వ్యవస్థ బయటపడ్డాయి. నిర్మాణ విస్తీర్ణం,కల్పించిన సౌకర్యాలను పరిశీలిస్తే ఈ ప్రాంతం సన్యాసుల మరియు యాత్రికుల కేంద్రంగా బహుళ ప్రజాదరణ పొందిందని సూచిస్తున్నాయి. ప్రధానంగా హీనయాన దశలో నిర్మించిన కట్టడాలు ఎక్కువగా కన్హేరి లో కనిపిస్తాయి. అయితే, మహాయాన కాలం నాటి శైలీ కృత వాస్తు శిల్పాలు, వజ్రయాన క్రమం నాటి కొన్ని ముద్రణలు కూడా ఈ గుహల్లో ఉన్నాయి. 2వ శతాబ్దం సీఈ (గుహ నం. 2 స్థూపం) నుంచి 9వ శతాబ్దం సీఈ వరకు సాగిన బౌద్ధ విశ్వాసం, వాస్తుశిల్పం సాధించిన నిరంతర పురోగతిని ఇక్కడ గమనించవచ్చు. శాతవాహనులు, త్రికూటములు, వాకాటకులు మరియు సిలహారుల అండదండలతో ఈ ప్రాంతానికి చెందిన సంపన్న వ్యాపారులు అందించిన విరాళాలతో కన్హేరి అభివృద్ధి చెందింది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ తన నేషనల్ కల్చర్ ఫండ్ ద్వారా కన్హేరి గుహల వద్ద పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు అందిస్తోంది. స్మారక చిహ్నంగా గుర్తింపు పొందిన కన్హేరి గుహలు రక్షిత ప్రాంత పరిధిలో ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉన్న నిర్మాణాల పునర్నిర్మాణం మరియు అప్-గ్రేడేషన్ పనులకు అనుమతులు జారీ అయ్యాయి. సందర్శకుల ప్రాంతం, కస్టోడియన్ క్వార్టర్, బుకింగ్ ఆఫీస్ వంటి ప్రస్తుత భవనాలను అభివృద్ధి చేసి పునరుద్ధరించారు. ల్యాండ్‌స్కేపింగ్ , మొక్కల పెంపకం ద్వారా బుకింగ్ కౌంటర్ నుంచి కస్టోడియన్ క్వార్టర్ వరకు ఉన్న ప్రాంతం అప్-గ్రేడ్ చేయబడింది.
దట్టమైన అటవీ ప్రాంతంలో గుహలు ఉండడంతో విద్యుత్, నీటి వసతి లేదు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాటుగా సోలార్ సిస్టమ్, జనరేటర్ సెట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నిర్మించిన వేసిన బోరు బావి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.
జాతీయ పార్కుగా గుర్తింపు పొందిన కన్హేరి దట్టమైన అడవుల్లో అందమైన ప్రకృతి దృశ్యాలు కలిగి ఉంది. ప్రకృతి అందాలను తిలకించి, ఆస్వాదించడానికి ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. సందర్శకుల కోసం అందమైన ఫోర్‌కోర్టులు మరియు రాతితో నిర్మించిన బెంచీలు ఉన్నాయి.
(Release ID: 1825911)
Visitor Counter : 197