ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అటల్ ఇన్నోవేషన్ మిషన్- ప్రైమ్ ప్లేబుక్ & స్టార్ట్-అప్ షోకేస్‌ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్


నేటి ఆవిష్కరణలే భవిష్యత్తు జీవనశైలి: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్


భారతదేశాన్ని ప్రపంచ ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 10 MAY 2022 4:59PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్అటల్ ఇన్నోవేషన్ మిషన్- ప్రైమ్ (ఇన్నోవేషన్మార్కెట్ సంసిద్ధత మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం పరిశోధకుల కోసం ప్రోగ్రామ్) ప్లేబుక్ స్టార్ట్-అప్ షోకేస్‌ను ఈ రోజు ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ, "భారత ప్రభుత్వం "అవుట్-ఆఫ్-ది-బాక్స్ థింకింగ్" ను గుర్తించిఆరోగ్యం మరియు వైద్య సాంకేతిక రంగాలను ప్రోత్సహించే మేక్-ఇన్-ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. "రాబోయే దశాబ్దంలోభారత్ వైద్య పరికరాలుడయాగ్నోస్టిక్స్ప్రొటీన్-ఆధారిత బయాలాజిక్స్సాంప్రదాయ ఔషధం మొదలైన వాటితో సహా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల యొక్క ప్రధాన ఎగుమతిదారుగా మారడానికి సిద్ధంగా ఉంది. మనం పరిశోధన-ఆధారిత ఆవిష్కరణలు మరియు సంపద సృష్టి యొక్క స్థిరమైన సర్కిల్‌ను సృష్టించాలంటేమనం సాంకేతిక వాణిజ్యీకరణలో నైపుణ్యం సాధించాలి. ఈ సందర్భంలో, AIM PRIME (ప్రోగ్రాం ఫర్ రీసర్చర్స్ ఇన్ ఇన్నోవేషన్, మార్కెట్ రెడీనెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) ప్రోగ్రామ్ అన్ని క్లిష్టమైన రంగాలలో బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలను సృష్టించడానికి ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిస్తుందని తెలిపారు.

ఈ ప్రయత్నానికి నీతి ఆయోగ్‌ను డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అభినందించారు. నేటి ఆవిష్కరణలే భవిష్యత్తు జీవనశైలి అని పేర్కొన్నారు. "పురాతన కాలం నుండి మనం ఎల్లప్పుడూ మన విధానంలో వినూత్నంగా ఉన్నాము. భారతదేశం ప్రపంచానికి ఆయుర్వేదంయోగా మరియు సున్నా భావనను అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలను రూపొందించడంలో భారత్ క్రియాశీలక పాత్ర పోషించింది" అని ఆమె అన్నారు.

మంత్రి మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి భారతదేశం కోసం నూతన సృజన కోసం పిలుపునిచ్చారు. ఆయన దూరదృష్టి గల నాయకత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడిందన్నారు. ఇది 9 నెలల వ్యవధిలో శిక్షణ మరియు మార్గదర్శకత్వం ద్వారా విజ్ఞానశాస్త్ర-ఆధారిత లోతైన- సాంకేతికత ఆలోచనలను మార్కెట్‌కు ప్రచారం చేస్తుందన్నారు. భారతదేశాన్ని ప్రముఖ ప్రపంచ ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అమె తెలిపారు. .

ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో దేశం యొక్క ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ యొక్క పురోగతిని గమనించిన డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్గ్లోబల్ ఇన్నోవేషన్ మెట్రిక్‌లలో భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతోందని అన్నారు. "మహమ్మారి సమయంలో హెల్త్‌కేర్ ప్రధాన పాత్ర పోషించినప్పుడుస్టార్టప్‌లు సందర్భానుసారంగా పెరగడం మరియు డయాగ్నోస్టిక్స్పిపిఇలువెంటిలేటర్లు మరియు చివరి మైలు వ్యాక్సిన్ డెలివరీలో ముఖ్యమైన సహకారాన్ని అందించడం చూశాం. ఇది భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగ సమస్యలను పరిష్కరించడంలో భారతీయ స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించింది."

"ప్రతి విజయవంతమైన ఆవిష్కరణకు ప్రేరణ అనేది ఉత్ప్రేరక పదార్ధం" అని ఆమె పరిశోధకులను ఉద్బోధించారు. పౌరులకు ప్రయోజనం చేకూర్చే పరిశోధన, అభివృద్ధి మరియు సాంకేతికతను దేశంలో అభివృద్ధి చేయడానికి ప్రతి ప్రయత్నం చేయాలని వారిని కోరారు.

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ సుమన్ బెరీనీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి కె పాల్నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ అమితాబ్ కాంత్భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు డాక్టర్ అజయ్ సూద్మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్అటల్ ఇన్నోవేషన్ మిషన్నీతి ఆయోగ్ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

****



(Release ID: 1824283) Visitor Counter : 138